సెప్టెంబర్ 2 న విడుదల కానున్న Hyundai i20 N Line; వివరాలు

ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన Hyundai కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త Hyundai i20 N Line వేరియంట్ ని ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ యొక్క అధికారిక విడుదల తేదీని కూడా ప్రకటించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం కొత్త Hyundai i20 N Line సెప్టెంబర్ 02 న దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సెప్టెంబర్ 2 న విడుదల కానున్న Hyundai i20 N Line; వివరాలు

కొత్త Hyundai i20 N Line వేరియంట్ ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించిన రోజునుంచే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త Hyundai i20 N Line బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు 25,000 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు Hyundai i20 N Line విడుదలైన రోజునుంచి ప్రారంభమవుతాయి.

సెప్టెంబర్ 2 న విడుదల కానున్న Hyundai i20 N Line; వివరాలు

Hyundai కంపెనీ యొక్క i20 N Line టెస్ట్ డ్రైవ్ కూడా త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త వేరియంట్ కంపెనీ సిగ్నేచర్ డీలర్షిప్ ద్వారా విక్రయించబడుతుంది. ఈ డీలర్షిప్ ద్వారా ఇప్పటికే Hyundai Alcazar మరియు Hyundai Tucson వంటి మోడల్స్ విక్రయించబడుతున్నాయి.

సెప్టెంబర్ 2 న విడుదల కానున్న Hyundai i20 N Line; వివరాలు

Hyundai కంపెనీ కొత్త i20 N Line ని రెండు వేరియంట్లలో తీసుకోరనుంది. ఇందులో ఒకటి N6 వేరియంట్ కాగా మరొకటి N8 వేరియంట్. ఈ కొత్త కారు నాలుగు సింగిల్ టోన్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది. అవి టైటాన్ గ్రే, ఫియరీ రెడ్, థండర్ బ్లూ, పోలార్ వైట్ మరియు ఫియరీ రెడ్ కలర్స్. అదేవిధంగా ఇది రెండు డ్యూయెల్ టోన్ కలర్స్ లో వస్తుంది. అవి ఫియరీ రెడ్ డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ మరియు సాకేత్ థండర్ బ్లూ బ్లాక్ రూఫ్.

సెప్టెంబర్ 2 న విడుదల కానున్న Hyundai i20 N Line; వివరాలు

Hyundai i20 N Line యొక్క ఇంజిన్ విషాయానికి వస్తే, ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 120 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది N6 వేరియంట్‌లో 6 స్పీడ్ IMT గేర్‌బాక్స్ మరియు N8 వేరియంట్‌లో 6 స్పీడ్ IMT మరియు 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ కూడా కలిగి ఉంటుంది.

సెప్టెంబర్ 2 న విడుదల కానున్న Hyundai i20 N Line; వివరాలు

స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ యొక్క ఇంజిన్ లో కూడా పెద్ద మార్పులు లేవని తెలుస్తుంది. Hyundai i20 N Line కేవలం 9.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. అయితే కంపెనీ ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికను ఇవ్వలేదు, కానీ ఐఎంటి గేర్‌బాక్స్ ఆప్సన్ అందుబాటులో ఉంటుంది.

సెప్టెంబర్ 2 న విడుదల కానున్న Hyundai i20 N Line; వివరాలు

కొత్త Hyundai i20 N Line (హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్) దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా భిన్నంగా కనిపిస్తుంది.ఈ మోడల్ యొక్క ముందు మరియు రియర్ బంపర్‌కు స్పోర్టి లుక్ ఇవ్వబడుతుంది. అయితే ఫ్రంట్ గ్రిల్‌కు వేరే నమూనా ఇవ్వబడింది. ఇది ఫ్రంట్ అండ్ రియర్ స్కర్ట్ మరియు రియర్ బంపర్‌పై డిఫ్యూజర్‌ను కలిగి ఉంది.

సెప్టెంబర్ 2 న విడుదల కానున్న Hyundai i20 N Line; వివరాలు

దీనికి మరింత స్పోర్టి లుక్ ఇవ్వడానికి, వెనుక భాగంలో రెండు ఎగ్జాస్ట్ టిప్స్ ఇవ్వబడ్డాయి. ఇది 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది కారుకి మరింత స్పోర్టి లుక్ ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో అన్ని చక్రాలపై డిస్క్ బ్రేకులు అమర్చబడి ఉంటాయి.

సెప్టెంబర్ 2 న విడుదల కానున్న Hyundai i20 N Line; వివరాలు

Hyundai i20 N Line యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని సీట్లు బకెట్ స్టైల్‌లో ఉన్నాయి. అంతే కాకుండా ఎన్ బ్రాండ్ అపోల్స్ట్రే చాలా చోట్ల, స్పోర్టీ స్టీరింగ్ వీల్ మరియు క్యాబిన్‌లో చాలా చోట్ల, రెడ్ కలర్ హైలైట్‌లు స్పోర్టీ కోసం ఇవ్వబడ్డాయి. అయితే ఇందులోని క్యాబిన్ పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటుంది.

సెప్టెంబర్ 2 న విడుదల కానున్న Hyundai i20 N Line; వివరాలు

లోపలి భాగంలో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఇవ్వబడ్డాయి. ఇంద్దులో 7 స్పీకర్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు 58 కనెక్ట్టెడ్ ఫీచర్లను కలిగి ఉండటమే కాకుండా సన్‌రూఫ్ కంట్రోల్ వంటివి కూడా ఉంటాయి.

సెప్టెంబర్ 2 న విడుదల కానున్న Hyundai i20 N Line; వివరాలు

భారతీయ మార్కెట్లో కొత్త Hyundai i20 N Line విడుదలైన తరువాత Volkswagen Polo GT మరియు Tata Altroz iTurbo వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కొత్త Hyundai i20 N Line ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఆకర్షణీయమైన ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Thursday, August 26, 2021, 12:00 [IST]
English summary
Hyundai new i20 n line india launch on 2nd september
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+