సింగిల్ ట్యాంక్ హైడ్రోజెన్‌తో 887 కిమీ ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన హ్యుందాయ్ నెక్సో

పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేపథ్యంలో, ఆటోమొబైల్ తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల తయారీపై ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే, ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లు మరియు హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ కార్లు పుట్టుకొస్తున్నాయి.

సింగిల్ ట్యాంక్ హైడ్రోజెన్‌తో 887 కిమీ ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన హ్యుందాయ్ నెక్సో

ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా, ఇప్పుడు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు పెట్రోల్ మరియు డీజిల్‌తో నడిచే కార్ల పనితీరుతో పోటీ పడుతున్నాయి మరియు కొన్ని అంశాలలో ఇవి వాటి కంటే మెరుగ్గా కూడా ఉంటున్నాయి. తాజాగా, దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ తయారు చేసిన ఓ హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ కారు ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తోంది.

సింగిల్ ట్యాంక్ హైడ్రోజెన్‌తో 887 కిమీ ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన హ్యుందాయ్ నెక్సో

హ్యుందాయ్ నెక్సో అనే ఎఫ్‌సిఈవి ఫుల్ ట్యాంక్ హైడ్రోజెన్ ఫ్యూయెల్‌తో ఆగకుండా 887.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సరికొత్త వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. తాజా నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియా ర్యాలీ డ్రైవర్ బ్రెండన్ రీవ్స్ మెల్బోర్న్‌లోని అస్సెండన్ ఫీల్డ్స్ నుండి న్యూ సౌత్ వేల్స్‌లోని బ్రోకెన్ హిల్ వరకు సింగిల్ ట్యాంక్ హైడ్రోజన్‌తో ఈ కారును నడిపాడు.

MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

సింగిల్ ట్యాంక్ హైడ్రోజెన్‌తో 887 కిమీ ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన హ్యుందాయ్ నెక్సో

దీంతో హ్యుందాయ్ నెక్సో ఒక ఫుల్ హైడ్రోజన్ ట్యాంక్‌తో గరిష్ట దూరం ప్రయాణించిన ఫ్యూయెల్ సెల్ కారుగా కొత్త రికార్డును సృష్టించింది. ఇదే విషయంలో మునుపటి రికార్డు బెర్ట్రాండ్ పికార్డ్ 2019లో సాధించారు. అప్పుడు కూడా ఈ రికార్డు కోసం హ్యుందాయ్ నెక్సో ఎఫ్‌సిఈవి కారునే ఉపయోగించారు. అప్పట్లో ఈ కారు ఫుల్ ట్యాంక్‌పై 778 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

సింగిల్ ట్యాంక్ హైడ్రోజెన్‌తో 887 కిమీ ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన హ్యుందాయ్ నెక్సో

ఈ రికార్డు సాధించడానికి ఎంత సమయం పట్టింది?

తాజాగా, బ్రెండన్ రీవ్స్ స్థాపించిన 887.5 కిలోమీటర్ల రికార్డులో భాగంగా ఆయన హ్యుందాయ్ నెక్సో కారులో 13 గంటల 6 నిమిషాలు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో అతని సగటు వేగం గంటకు 66.9 కిలోమీటర్లు.

MOST READ:బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

సింగిల్ ట్యాంక్ హైడ్రోజెన్‌తో 887 కిమీ ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన హ్యుందాయ్ నెక్సో

ఈ సమయంలో హ్యుందాయ్ నెక్సో 6.27 కిలోహెచ్ హైడ్రోజన్‌ను వినియోగించి 44,91,000 లీటర్ల గాలిని శుద్ధి చేసింది. ఈ సందర్భంగా బ్రెండన్ రీవ్స్ మాట్లాడుతూ.. ర్యాలీ డ్రైవర్‌గా తాను ఎప్పుడూ ప్రపంచ రికార్డు సృష్టించాలని కోరుకుంటానని, అయితే ఇది ఈ రీతిలో ఉంటుందని తానెప్పుడూ ఊహించలేదని అన్నారు.

సింగిల్ ట్యాంక్ హైడ్రోజెన్‌తో 887 కిమీ ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన హ్యుందాయ్ నెక్సో

ఈ కారు సున్నా ఉద్గారాలను విడుదల చేస్తుంది!

హ్యుందాయ్ నెక్సో ఎఫ్‌సిఈవిలో 95 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ మరియు 40 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఈ బ్యాటరీ ప్యాక్ కారులోని ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 163 బిహెచ్‌పి శక్తిని మరియు 395 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును సున్నా ఉద్గారాల విభాగంలో ఉంచబడింది ఎందుకంటే దీని ఉద్గారంలో ఎక్కువ ఉద్గారాలు నీటి ఆవిరి రూపంలోనే ఉంటాయి.

MOST READ:స్వామీజీని తాకిన పేస్ మాస్క్ ఎఫెక్ట్.. ఎలా అనుకుంటున్నారా?

సింగిల్ ట్యాంక్ హైడ్రోజెన్‌తో 887 కిమీ ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన హ్యుందాయ్ నెక్సో

ఈ ఏడాది భారతదేశంలో ప్రారంభించనున్నారు!

హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఈ నెక్సో ఎఫ్‌సిఈవి ఎస్‌యూవీని ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని సమాచారం. అయితే, ఈ కారుని మార్కెట్లోకి తీసుకురావడాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఒకవేళ నెక్సో మార్కెట్లోకి వస్తే భారతదేశంలోనే ఇది మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ కారు అవుతుంది. గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శించింది.

సింగిల్ ట్యాంక్ హైడ్రోజెన్‌తో 887 కిమీ ప్రయాణించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన హ్యుందాయ్ నెక్సో

హ్యుందాయ్ నెక్సో ఫీచర్లు

హ్యుందాయ్ నెక్సో ఎస్‌యూవీలో రిమోట్ పార్కింగ్ సిస్టమ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ (ఎల్‌ఎఫ్‌ఎ), హైవే డ్రైవింగ్ అసిస్ట్ (హెచ్‌ఐడి) వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దీని లోపలి భాగంలో రెండు కలర్ వేరియంట్లు ఉన్నాయి. అవి: మెచర్ బ్లూ మరియు డ్యూయల్ టోన్ స్టోన్ మరియు షెల్ గ్రే కలర్ ఆప్షన్స్. ఇంకా ఇందులో 12.3 ఇంచ్ ఎల్‌సిడి స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ ధర మరియు లాంచ్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే

Most Read Articles

English summary
Hyundai Nexo FCEV Creates World Record By Covering 887 km In Single Tank Hydrogen Fuel. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X