భారతదేశంలో నీటితో నడిచే హ్యుందాయ్ కారుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది

దేశంలో పెరిగిపోతున్న వాహనా కాలుష్య సమస్యకు చెక్ పెట్టేందుకు ఆటోమొబైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాలు మరియు శక్తితో నడిచే వాహనాలపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసినదే.

భారతదేశంలో నీటితో నడిచే హ్యుందాయ్ కారుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది

ఇందులో భాగంగానే, ప్రస్తుతం కార్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై నిరంతరాయంగా పనిచేస్తూనే, నీటితో నడిచే కార్ల తయారీలో కూడా బిజీగా ఉన్నారు. తాజాగా కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ అభివృద్ధి చేసిన హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ కార్ నెక్సోకి భారత మార్కెట్లో అనుమతి లభించింది.

ఈ కంపెనీ ఇప్పటికే తమ హ్యుందాయ్ నెక్సో ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని పలు అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు కంపెనీ ఈ కారును భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, భారతదేశంలో హ్యుందాయ్ నెక్సో కారుకి అనుమతి కూడా లభించింది.

భారతదేశంలో నీటితో నడిచే హ్యుందాయ్ కారుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది

హ్యుందాయ్ ఈ కారును ఈ సంవత్సరంలోనే భారతదేశానికి తీసుకురావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. మెట్రో నగరాల్లో సిఎన్‌జి మరియు హైబ్రిడ్ వాహనాల విక్రయాలు కూడా జోరందుకున్నాయి.

MOST READ:పోర్ష్ ఎలక్ట్రిక్ సైకిళ్ల విడుదల; ధర వింటే షాక్ తగలాల్సిందే!

భారతదేశంలో నీటితో నడిచే హ్యుందాయ్ కారుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది

సాంప్రదాయ వాహనాలకు సవాల్ విసిరేందుకు మరియు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు హ్యుందాయ్ తొలిసారిగా భారతదేశంలో తమ హైడ్రోజెన్ పవర్డ్ కారును ప్రవేశపెట్టనుంది. దేశంలో ఈ కారును పరీక్షించేందుకు ఈ కంపెనీకి అనుమతి కూడా లభించింది. హ్యుందాయ్ నెక్సో చాలా విశిష్టమైన ఎఫ్‌సిఈవీ (ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్).

భారతదేశంలో నీటితో నడిచే హ్యుందాయ్ కారుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది

హ్యుందాయ్ నెక్సో ఎఫ్‌సిఈవీ విషయానికి వస్తే, ఈ కారులో 95 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్‌తో పనిచేస్తుంది, ఇది 40 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బ్యాటరీ పవర్‌ను ఉపయోగించుకొని ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 163 పిఎస్ పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

MOST READ:మాడిఫైడ్ టాటా ఇండికా.. ఇప్పుడు మరింత చిన్నదైపోయింది

భారతదేశంలో నీటితో నడిచే హ్యుందాయ్ కారుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది

ఈ కారులో మూడు ఇంధన ట్యాంకులు ఉంటాయి, ఇవి మొత్తం 156 లీటర్ల హైడ్రోజన్‌ను నిల్వ చేయగలవు. దీని సాయంతో ఈ వాహనం మొత్తం 666 కిలోమీటర్ల రేంజ్ (మైలేజ్)ను అందిస్తుంది. సాధారణ ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే, ఈ రేంజ్ చాలా అధికంగా ఉంటుంది. భారత్‌లో ఈ తరహా కార్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

భారతదేశంలో నీటితో నడిచే హ్యుందాయ్ కారుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది

అయితే, ఇందుకు అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల అధికం అవుతున్నప్పటికీ, సరైన ఛార్జింగ్ నెట్‌వర్క్ లేకపోవడం వాటి వినియోగానికి ప్రధాన ఆటంకంగా మారుతోంది. అలాగే, హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనానాల విషయంలో కూడా మౌళిక సదుపాయాలు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.

MOST READ:నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

భారతదేశంలో నీటితో నడిచే హ్యుందాయ్ కారుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది

భారతదేశంలో హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లు లేకపోవడం హ్యుందాయ్‌కు అతి పెద్ద సవాలుగా ఉంటుంది. ఇలాంటి ఎప్‌సిఈవీల కోసం సరైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే వరకు, దేశంలో వాటిని పూర్తిస్థాయిలో వినియోగించడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్‌సిఈవీలు బ్యాటరీతో నడిచే ఈవీలకు నిజంగా ఆచరణాత్మక ప్రత్యామ్నాయంగా ఉండవు.

భారతదేశంలో నీటితో నడిచే హ్యుందాయ్ కారుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది

హ్యుందాయ్ నెక్సో ఎప్‌సిఈవో కొలతలను గమనిస్తే, ఇది 4670 మి.మీ పొడవును, 1860 మి.మీ వెడల్పును, 1630 మి.మీ ఎత్తును మరియు 2790 మి.మీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో నిలువుగా ఉండే హెడ్‌ల్యాంప్‌లు, క్యాస్కేడింగ్ గ్రిల్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, షార్ప్ లుకింగ్ ఎల్‌ఈడీ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ ఎడిషన్ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

భారతదేశంలో నీటితో నడిచే హ్యుందాయ్ కారుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది

ఈ ఎస్‌యూవీలో ఫీచర్లను మరియు పరికరాలను కూడా పుష్కలంగా అందించనున్నారు. ఒకవేళ ఈ కారు భారత మార్కెట్లో విడుదల చేయబడితే, అది సిబియు (కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్) మార్గం ద్వారా మన దేశానికి దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. దీని ధర సుమారు రూ.65 లక్షలు ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Hyundai Nexo Gets Type Approval In India, Launch Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X