భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ స్టాండర్డ్ కార్లతో పాటుగా పెర్ఫార్మెన్స్ కార్లను కూడా విక్రయిస్తుందని మీకు తెలుసా? బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ఎమ్, స్కొడాకి చెందిన ఆర్ఎస్, నిస్సాన్‌కి చెందిన జ్యూక్ మరియు మెర్సిడెస్ బెంజ్‌కి చెందిన ఏఎమ్‌జి మొదలైన బ్రాండ్ల మాదిరిగానే హ్యుందాయ్ కూడా తమ పెర్ఫార్మెన్స్ కార్లను ఎన్ మరియు ఎన్-లైన్ బ్రాండ్లతో అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది.

భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..

కాగా, ఇప్పుడు హ్యుందాయ్ తమ ఎన్ మరియు ఎన్-లైన్ సిరీస్‌కి చెందిన పెర్ఫార్మెన్స్ కార్లను భారత మార్కెట్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది మధ్య భాగం నాటికి హ్యుందాయ్ తమ తొలి పెర్ఫార్మెన్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..

హ్యుందాయ్ ఎన్ మరియు ఎన్-లైన్ బ్రాండ్ల క్రింద విక్రయించబడే కార్లు సాధారణ కార్లతో పోల్చుకుంటే మరింత శక్తివంతమైన ఇంజన్‌తో పాటుగా స్పోర్టీ ఏరోడైనమిక్ బాడీ కిట్స్, ధృడమైన ఛాస్సిస్, మెరుగైన సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయి. అలాగే, ఈ కార్ల ఇంటీరియర్స్‌లో సదరు స్పోర్టీ థీమ్ క్యారీ అవుతుంది.

MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..

తాజా సమాచారం ప్రకారం, హ్యుందాయ్ తమ ఎన్ మరియు ఎన్-లైన్ బ్రాండ్ల భారత మార్కెట్లోకి తీసుకురానున్న తొలి మోడల్ ఐ20 అని తెలుస్తోంది. కంపెనీ అందిస్తున్న ఈ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా చేసుకొని 'ఐ20 ఎన్-లైన్' పేరుతో ఈ కొత్త పెర్ఫార్మెన్స్ కారును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..

హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ కారును ఈ ఏడాది మధ్య భాగం నాటికి మార్కెట్లో తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కారులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి పవర్‌ను మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్ స్టాండర్డ్ ఐ20 మోడల్‌లో కూడా లభిస్తుంది.

MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..

అయితే, హ్యుందాయ్ తమ ఐ20 ఎన్-లైన్ మోడల్‌లో మరింత శక్తివంతమైన 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ప్రవేశపెడితే బాగుంటుందని యోచిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పి పవర్‌ను మరియు 270 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. కాకపోతే, ఇది అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రమే లభిస్తుంది. దీనిని పూర్తిగా సిబియు (కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్) మార్గంలో భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది.

భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..

ఈ స్పోర్టీ వెర్షన్ హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ వేరియంట్ ఎగ్జాస్ట్ నోట్ స్టాండర్డ్ కారు కంటే బిగ్గరగా, స్పోర్టీగా ఉంటుంది. అలాగే, ఇందులో మరింత మెరుగైన బ్రేక్స్ మరియు మరింత గట్టిగా ఉండే సస్పెన్షన్ సిస్టమ్ కూడా ఉండనుంది. ఇవి రెండూ ఈ స్పోర్టీ కారు పనితీరును మెరుగుపరచేందుకు సహకరిస్తాయి.

MOST READ:గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్

భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..

అంతేకాకుండా, ఈ పెర్ఫార్మెన్స్ వెర్షన్ ఐ20 కారు లుక్‌ని మరింత స్పోర్టీగా కనిపించేలా చేసేందుకు దీనిపై అదనపు స్పోర్టీ బాడీ కిట్‌ను జోడించే అవకాశం ఉంది. దేశీయ విపణిలో దీని ధర రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..

ప్రస్తుతం భారత మార్కెట్లో ఇలాంటి స్పోర్టీ మోడళ్లకు డిమాండ్ అంతగా లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో వీటికి మంచి స్పందన లభిస్తే కంపెనీ ఈ కార్లను దేశంలోనే స్థానికంగా అసెంబుల్ చేసే అవకాశం ఉంది. ఇలా చేయటం వలన వీటి ధర కూడా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది.

MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..

కాగా, మనదేశంలో ఇప్పటికే టాటా టిగోర్ జెటిపి, టియాగో జెటిపి, మారుతి బాలెనో ఆర్ఎస్, ఫియట్ అబార్త్ పుంటో మరియు ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి వంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే, ఇవి మార్కెట్లో నిలబడలేకపోయాయి. మరి హ్యుందాయ్ నుండి వస్తున్న ఈ పెర్ఫార్మెన్స్ ఐ20 ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Hyundai Plans To Launch Its N And N-Line Performance Cars In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X