Just In
Don't Miss
- News
కృష్ణాబోర్డుపై జగన్‌కు షాకిచ్చిన కేసీఆర్- విశాఖకు తరలింపుపై అభ్యంతరం- బోర్డుకు లేఖ
- Movies
అఖిల్‌కు భారీ షాకిచ్చిన మోనాల్: తన అసలు లవర్ పేరు చెప్పి ఎమోషనల్.. మొత్తం రివీల్ చేసింది!
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Sports
Brisbane Test: పాపం శుభమన్ గిల్.. తృటిలో సెంచరీ మిస్!!
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్ న్యూస్: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 డిస్‌కంటిన్యూ, వైబ్‌సైట్ నుండి మాయం!
హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10ను కంపెనీ తమ వెబ్‌సైట్ నుండి తొలగించి వేసింది. ఈ పరిణామం చూస్తుంటే, కంపెనీ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మోడల్‌ను మార్కెట్ నుండి డిస్‌కంటిన్యూ చేసినట్లు తెలుస్తోంది.

హ్యుందాయ్ 2019లో 'గ్రాండ్ ఐ10 నియోస్' మోడల్‌ని విడుదల చేసిన తర్వాత కూడా కంపెనీ పాత తరం 'గ్రాండ్ ఐ10' అమ్మకాలను కొనసాగించింది. అయితే, ఇది రెండు వేరియంట్లలో కేవలం పెట్రోల్ ఇంజన్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడింది.

మునుపటి దశాబ్దంలో విక్రయించిన ఓల్డ్-జెన్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌ను గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ విజయవంతంగా భర్తీ చేసింది. అయితే, ఆ తర్వాతి కాలంలో గ్రాండ్ ఐ10 మోడల్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ గ్రాండ్ ఐ10 నియోస్ అనే కొత్త తరం మోడల్‌ను హ్యుందాయ్ విడుదల చేసింది.
MOST READ: ఇంటెర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఇప్పుడు వెరీ సింపుల్.. ఇలా చేయండి

ప్రస్తుతం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో హ్యుందాయ్ మూడు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. ఇందులో శాంత్రో, గ్రాండ్ ఐ10 నియోస్ మరియు ఐ20 మోడళ్లు ఉన్నాయి. ఎంట్రీ లెవల్ మోడల్ శాంత్రో మరియు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 మోడళ్లకు మధ్యలో గ్రాండ్ ఐ10 నియోస్‌ను విక్రయిస్తున్నారు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మార్కెట్లోకి రాక మునుపు, గ్రాండ్ ఐ10 మోడల్‌లో కంపెనీ చిన్నపాటి అప్‌గ్రేడ్స్ మరియు ఫేస్‌లిఫ్ట్‌ల మినహా ఇందులో కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టలేదు. ప్రస్తుత హ్యుందాయ్ కార్ల డిజైన్‌తో పోల్చుకుంటే, గ్రాండ్ ఐ10 కారుది చాలా పాత డిజైన్‌గా చెప్పుకోవచ్చు.
MOST READ: టాటా మోటార్స్ నుండి మరింత చవకైన ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయ్..

ఈ నేపథ్యంలో గ్రాండ్ ఐ10 స్థానాన్ని గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌తో పూర్తిగా రీప్లేస్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ విభిన్న ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

వీటిలో 74 బిహెచ్‌పి మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ డీజిల్ ఇంజన్, 81 బిహెచ్‌పి మరియు 114 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవేకాకుండా, కొత్త గ్రాండ్ ఐ10 నియోస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.
MOST READ: 5 నిమిషాల చార్జ్‌తో 100 కిమీ రేంజ్; హ్యుందాయ్ రెండవ ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5'

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అనేక ఇతర టెక్ లోడెడ్ ఫీచర్లు లభిస్తాయి. ఇంకా ఇందులో రియర్ ఏసి వెంట్స్, బహుళ ఎయిర్‌బ్యాగులు మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు రూ.5.12 లక్షల నుండి రూ.7.24 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.
MOST READ: ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్ ఆవిష్కరించిన టాటా మోటార్స్ ; వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారును భారత మార్కెట్లో గత ఏడేళ్లుగా విక్రయించారు. ఎంట్రీ లెవల్ కార్లలో ధరల అంతరాన్ని పూరించడానికి పాత-జెన్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు కొత్త తరం మోడల్‌ను కూడా కంపెనీ ఇప్పటి వరకూ విక్రయిస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు చివరకు గ్రాండ్ ఐ10 ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.