2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India), గతేడాది ఆరంభంలో భారతదేశంలో తమ కొత్త ఫేస్‌లిఫ్ట్ క్రెటా (Creta) మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త 2020 హ్యుందాయ్ క్రెటా రాకతో ఈ మోడల్ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ విభాగంలోనే ఇది అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా నిలిచింది.

2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

కాగా, ఇప్పుడు ఈ కొరియన్ కంపెనీ తమ పాపులర్ క్రెటాకు మరోసారి ఫేస్‌లిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. వాస్తవానికి, ఈ కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా (2022 Hyundai Creta) ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఆవిష్కరించబడింది. ఈ అప్‌డేటెడ్ మోడల్ ముందుగా యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ రష్యాలో తమ కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కోసం రూపొందించిన కొత్త టెలివిజన్ వాణిజ్య ప్రకటన (TVC) ని విడుదల చేసింది. ఈ టివిసిలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ హ్యుందాయ్ క్రెటాలో చేసిన ఎక్స్టీరియర్ డిజైన్ మార్పులను కంపెనీ వెల్లడి చేసింది.

2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

ఈ వీడియోని బట్టి చూస్తుంటే, కొత్త 2022 క్రెటా ముందు భాగాన్ని కంపెనీ ట్వీక్ చేసినట్లుగా తెలుస్తోంది. హ్యుందాయ్ యొక్క సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్ ఆకారాన్ని మరియు పరిమాణాన్ని రీడిజైన్ చేయడం వలన ఇప్పుడు ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. హ్యుందాయ్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన 6/7 సీటర్ ఎస్‌యూవీ అల్కాజార్‌ లో కనిపించే విధంగా క్షితిజ సమాంతర క్రోమ్ స్లాట్‌లను తీసివేసి, వాటి స్థానంలో డార్క్ క్రోమ్ స్లాట్ లను ఉపయోగించింది.

2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

ఫ్రంట్ బంపర్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్ లను కూడా రీడిజైన్ చేశారు. మొత్తంమీద చూస్తే, హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు మునుపటి కన్నా మరింత అందంగా కనిపిస్తోంది. ఇక దీని సైడ్ ప్రొఫైల్ ను గమనిస్తే, ఇక్కడ డిజైన్ వ్యత్యాసం కేవలం దాని అల్లాయ్ వీల్స్‌ లో మాత్రమే కనిపిస్తుంది. ఇకపోతే, వెనుక బంపర్ మరియు టెయిల్‌గేట్ కూడా రీడిజైన్ చేశారు, ఇప్పుడు ఇవి మరింత మెరుగ్గా కనిపిస్తాయి.

ఈ ఎక్స్టీరియర్ మార్పుల మినహా కొత్త 2022 క్రెటా లోపలి భాగంలో పెద్దగా మార్పులు చేయనట్లు తెలుస్తోంది. ఇది మునుపటి మాదిరిగానే ఆల్-బ్లాక్ క్యాబిన్ థీమ్ తో కానీ లేదా బ్లాక్ అండ్ బ్రౌన్ థీమ్‌ లో కానీ అందించబడుతుంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన పెద్ద ఎస్‌యూవీ హ్యుందాయ్ అల్కజార్ లో కూడా ఇదే ఇంటీరియర్ స్టైల్ కనిపిస్తుంది.

2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, రష్యాలో హ్యుందాయ్ క్రెటా రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయించబడుతోంది. ఇందులో మొదటిది 1.6 లీటర్ మరియు రెండవది 2.0 లీటర్ ఇంజన్లు. ఇవి రెండూ కూడా న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్లే, ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేదు.

2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

ముందుగా 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ గరిష్టంగా 123 బిహెచ్‌పి పవర్ ను మరియు 150 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరింత శక్తివంతమైనది. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 191 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

రెండు ఇంజన్‌లు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. రష్యన్ మార్కెట్లో అమ్ముడయ్యే హ్యుందాయ్ క్రెటా ఆప్షనల్ ఆల్-వీల్-డ్రైవ్ (4x4) పవర్‌ట్రెయిన్‌ తో కూడా అందుబాటులో ఉంటుంది. కాకపోతే, ఇండియన్ మార్కెట్లోకి రానున్న క్రెటా ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లనే కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇవన్నీ కూడా ఫ్రంట్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ తోనే విక్రయించబడుతున్నాయి. మనదేశంలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు. కాగా, రష్యన్ మార్కెట్లోని హ్యుందాయ్ క్రెటాలో కనిపించే కొన్ని కీలకమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో బ్లైండ్‌నెస్ కొల్లైజన్ అవైడెన్స్, ఫ్రంట్ అబ్‌స్టాకిల్ ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ మొదలైనవి ఉన్నాయి.

2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

Hyundai Creta బేస్ వేరియంట్‌లో ఏయే ఫీచర్లు లభిస్తాయి, ఈ వేరియంట్‌ను కొనుగోలు చేయడం లాభమేనా?

భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) మొత్తం ఆరు ట్రిమ్ లలో 1.5 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పలు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో క్రెటా ఇ (Creta E) అనేది దాని బేస్ వేరియంట్ మరియు ఈ వేరియంట్ 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.

2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

ఈ వేరియంట్లు మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తాయి. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉండదు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఫీచర్ కావాలనుకునే వారు మిడ్ లేదా టాప్ ఎండ్ వేరియంట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ వస్తోంది.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు..

Most Read Articles

English summary
Hyundai reveals 2022 creta facelift tvc features updated exterior details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X