హ్యుందాయ్ స్టారియా ఎమ్‌పివి టీజర్ లాంచ్; కియా కార్నివాల్ కాంపిటీటర్!

హ్యుందాయ్ అందించే వాహనాలు వాటి విశిష్టమైన డిజైన్ మరియు ప్రీమియం ఫీచర్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందినవి. ఈ కొరియన్ ఆటోమొబైల్ బ్రాండ్ తాజాగా ఓ సరికొత్త ఎమ్‌పివిని అభవృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది.

హ్యుందాయ్ స్టారియా పేరుతో కంపెనీ ఓ కొత్త ప్రీమియం ఎమ్‌పివి మోడల్‌ను తయారు చేయనుంది. ఈ మోడల్‌కి సంబంధించిన లేటెస్ట్ టీజర్ చిత్రాలను కూడా హ్యుందాయ్ విడుదల చేసింది. ఈ ఎమ్‌పివి ముందుగా ఆసియా దేశాలలో అమ్మకానికి రానుంది.

హ్యుందాయ్ స్టారియా ఎమ్‌పివి టీజర్ లాంచ్; కియా కార్నివాల్ కాంపిటీటర్!

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ కంపెనీ, ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని కలిగి ఉంది. ఈ కంపెనీ వివిధ దేశాల్లో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ వంటి విభాగాల్లో బలమైన మార్కెట్ వాటాను కలిగి ఉంది. అయితే, ఎమ్‌పివి (మల్టీ పర్పస్ వెహికల్) విభాగంలో మాత్రం హ్యుందాయ్‌కి తగినంత మార్కెట్ వాటా లేదు.

హ్యుందాయ్ స్టారియా ఎమ్‌పివి టీజర్ లాంచ్; కియా కార్నివాల్ కాంపిటీటర్!

ఈ నేపథ్యంలో, ఎమ్‌పివి విభాగంలో కూడా తమ సత్తాను చాటేందుకు ప్రీమయం స్టైల్, ఆల్ట్రా కంఫర్ట్ ఫీచర్స్ మరియు క్లాస్ లీడింగ్ డిజైన్‌తో తమ సరికొత్త స్టారియా ఎమ్‌పివిని హ్యుందాయ్ డిజైన్ చేసింది. హ్యుందాయ స్టారియా టీజర్ చిత్రాలలో కంపెనీ అనేక విషయాలను వెల్లడి చేసింది.

హ్యుందాయ్ స్టారియా 7 సీట్ (ముందు వరుసలో రెండు, మధ్య వరుసలో రెండు మరియు చివరి వరుసలో మూడు సీట్లు) కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. మధ్య వరుసలో కెప్టెన్ స్టైల్ సీట్లను ఆఫర్ చేస్తున్నారు. ఇవి ఇండివిడ్యువల్ రిక్లైనింగ్ మరియు స్లైడింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

హ్యుందాయ్ స్టారియా ఎమ్‌పివి టీజర్ లాంచ్; కియా కార్నివాల్ కాంపిటీటర్!

హ్యుందాయ్ స్టారియా పేరు 'స్టార్' మరియు 'రియా' అనే రెండు పదాల కలయిక నుండి పుట్టుకొచ్చింది. కొరియన్ కార్ మేకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వాహనం భవిష్యత్ ఆధారిత ఉత్పత్తి విలువలు మరియు డిజైన్ లక్షణాలను సూచిస్తుంది. ఈ కారును స్పేస్ షిప్ నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది

ఈ కారులో ఇంటిగ్రేడెట్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్స్, వెడల్పాటి పెద్ద ఫ్రంట్ గ్రిల్, బానెట్ పొడవునా ఉండే ఎల్ఈడి లైట్ స్ట్రిప్, రోల్స్ రాయిస్ కార్లను తలపించే సైడ్ డోర్స్, సింపుల్ సైడ్ డిజైన్ మరియు బాక్స్ టైప్ టెయిల్ డిజైన్ వంటి అంశాలను గమనించవచ్చు.

హ్యుందాయ్ స్టారియా ఎమ్‌పివి టీజర్ లాంచ్; కియా కార్నివాల్ కాంపిటీటర్!

హ్యుందాయ్ స్టారియా వెనుక డిజైన్ ట్రెడిషనల్ ఎమ్‌పివిలా నిలువుగా ఉంటుంది. వెనుక భాగంలో ఇరువైపులా అమర్చిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఈ కారుకు మరింత ఫ్యూచరిస్టిక్ లుక్‌ని జోడిస్తాయి. కారు లోపలి భాగంలో డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ చాలా సింపుల్‌గా మరియు క్లీన్‌గా అనిపిస్తుంది.

ప్యాసింజర్ సైడ్ పొడవాటి ఎయిర్ వెంట్, డ్యాష్‌బోర్డ్ మధ్యలో అమర్చిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు దాని దిగువ భాగంలో, డ్యాష్‌బోర్డుకే అమర్చిన గేర్‌బాక్స్ యూనిట్ వంటి డిటేల్స్‌ను ఈ టీజర్ చిత్రాలలో చూడొచ్చు. ఇందులో డ్రైవర్ మరియు ప్యాసింజర్‌ను వేరే చేసే సెంటర్ కన్సోల్ లేనట్లుగా తెలుస్తోంది.

హ్యుందాయ్ స్టారియా ఎమ్‌పివి టీజర్ లాంచ్; కియా కార్నివాల్ కాంపిటీటర్!

అంతేకాకుండా, కారు ఇంటీరియర్స్‌లో వివిధ ఫీచర్లను నియంత్రించే భౌతిక స్విచ్‌లను (ఫిజికల్ బటన్స్) తగ్గించి, వాటన్నింటినీ టచ్‌స్క్రీన్ ద్వారా మరియు స్టీరింగ్ మౌంటెడ్ బటన్స్ ద్వారా కంట్రోల్ చేసేలా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. దీని పొడవాటి పరిమాణం కారణంగా కారులో కూడా విశాలమైన క్యాబిన్ స్పేస్ లభ్యం కానుంది.

హ్యుందాయ్ స్టారియా ఈ విభాగంలో కియా కార్నివాల్ వంటి ఎమ్‌పివిలకు గట్టి పోటీగా నిలుస్తుంది. ఈ కారును ముందుగా ఆస్ట్రేలియా మార్కెట్లలో ప్రవేశపెట్టనున్నారు. ఆసియా మార్కెట్లలో హ్యుందాయ్ తమ స్టారియా పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఫ్రాన్స్, జర్మనీ మరియు లాటిన్ అమెరికాతో సహా పలు యూరోపియన్ దేశాలలో కూడా అమ్ముడయ్యే అవకాశం ఉంది.

హ్యుందాయ్ స్టారియా ఎమ్‌పివి టీజర్ లాంచ్; కియా కార్నివాల్ కాంపిటీటర్!

ప్రస్తుతానికి ఈ కారును భారతదేశంలో ప్రవేశపెట్టడం గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, మన దేశంలోని పెద్ద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కారును ఇక్కడి మార్కెట్లో విడుదల చేస్తే మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఈ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Most Read Articles

English summary
Hyundai Staria Premium MPV Teaser Images Revealed; Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X