హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల

దక్షిణ కొరియాకు చెందిన పాపులర్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ నుండి మరో కొత్త కారు రాబోతోంది. ఈ మేరకు హ్యుందాయ్ ఓ కొత్త బి-సెగ్మెంట్ క్రాస్ఓవర్ ఎస్‌యూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. హ్యుందాయ్ బేయోన్ పేరుతో కంపెనీ ఓ సరికొత్త కారును డెవలప్ చేస్తోంది.

హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల

హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ 2021 మొదటి అర్ధభాగంలో యూరోపియన్ మార్కెట్లను తాకే అవకాశం ఉంది. ఆ తర్వాతి, కాలంలో ఇది భారత్ వంటి మార్కెట్లలో కూడా విడుదల కావచ్చని అంచనా. గతేడాది నవంబర్ నెలలోనే హ్యుందాయ్ తమ బేయోన్ పేరును ఆవిష్కరించింది.

హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల

అప్పటి నుండే, ఈ మోడల్‌పై మార్కెట్లో ఆసక్తి నెలకొంది. ఈ పేరును ఆవిష్కరించిన దాదాపు రెండు నెలల తరువాత, హ్యుందాయ్ బేయోన్ యొక్క ముందు మరియు వెనుక ప్రొఫైల్‌ను వెల్లడి చేసే టీజర్లను ఆవిష్కరించింది.

MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]

హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల

హ్యుందాయ్ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో స్పోరీగా ఉండేలా ఈ కారును డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రాస్ఓవర్ ముందు మరియు వెనుక ప్రొఫైల్‌లో ఈ డిజైన్ లాంగ్వేజ్ స్పష్టంగా తెలుస్తుంది. బేయోన్ ముందు భాగంలో సన్నటి ఎల్ఈడి డిఆర్ఎల్ వెనుక భాగంలో బూమరాంగ్ ఆకారంలో ఉండే

ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ డిజైన్‌ను ఇందులో చూడొచ్చు.

హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల

ఈ టీజర్‌ను గమనిస్తే, కారు ముందు వైపు స్ప్లిట్ ఎల్‌ఇడి హెడ్‌లైట్ సెటప్ ఉందని గుర్తించవచ్చు. కారు బంపర్లలో ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ను అమర్చారు, దాని పై భాగంలో సన్నటి ఎల్‌ఈడీ డీఆర్ఎల్ లైట్ సెటప్ ఉంటుంది. కారు ముందు భాగంలో గ్రిల్ మధ్యలో పెద్ద ఎయిర్ ఇంటేక్ కూడా కనిపిస్తుంది.

MOST READ:మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల

ఫ్రంట్ బంపర్‌పై బానెట్‌కి దిగువన పెద్ద హ్యుందాయ్ బ్యాడ్జింగ్ ఉంది. వెనుక వైపు రెండు టెయిల్ లైట్లను కలుపుతూ బ్యాక్‌డోర్‌పై ఓ సన్నని ఎల్‌ఈడీ స్ట్రిప్ లైట్ కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. వెనుక వైపు ఈ స్ట్రిప్ క్రింది భాగంలో హ్యుందాయ్ లోగోను ఉంచారు.

హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల

హ్యుందాయ్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న క్రెటా ఎస్‌యూవీ దేశీయ విపణిలో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ 5 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై సరికొత్త అమ్మకాల మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?

హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల

మొదటి తరం హ్యుందాయ్ క్రెటాను తొలిసారిగా 2015లో భారత మార్కెట్లో విడుదల చేశారు. ఆ తర్వాత గతేడాది ఇందులో సరికొత్త 2020 మోడల్ క్రెటాని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం హ్యుందాయ్ తన ఎస్‌యూవీ లైనప్‌లో వెన్యూ, క్రెటా, టూసాన్ మరియు కోనా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
Hyundai Teases Bayon SUV Ahead Of Launch, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X