వచ్చే ఏడాది భారత్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న Hyundai, అవేంటంటే..?

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ మార్కెట్లో మరో మూడు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే, కొత్త 7-సీటర్ అల్కజార్ ఎస్‌యూవీ మరియు హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ మోడళ్లను ప్రవేశపెట్టి మంచి విజయాన్ని సాధించిన హ్యుందాయ్, కొత్త సంవత్సరంలో 3 అప్‌డేటెడ్ మోడళ్లను విడుదల చేయాలని భావిస్తోంది. వీటిలో కొన్ని ఫేస్‌లిఫ్ట్ మోడళ్లుగా కాగా మరికొన్ని కాస్మెటిక్ అప్‌డేట్ లను పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం రండి.

వచ్చే ఏడాది భారత్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న Hyundai, అవేంటంటే..?

1. కొత్త తరం హ్యుందాయ్ టక్సన్ (New Gen Hyundai Tucson)

హ్యుందాయ్ యొక్క ప్రీమియం ఎస్‌యూవీ టక్సన్ (Tucson) లో కంపెనీ ఓ కొత్త తరం మోడల్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే, మార్కెట్లో విక్రయించబడుతున్న పాత తరం హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ కోసం ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్టులో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కిన నేపథ్యంలో, కొత్తగా రాబోయే ఈ మోడల్ పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వచ్చే ఏడాది భారత్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న Hyundai, అవేంటంటే..?

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే తమ కొత్త తరం టక్సన్ ఎస్‌యూవీ భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఇది కొత్త ఎక్ట్సీరియర్ స్టైలింగ్, రివైజ్డ్ ఇంటీరియర్స్ మరియు పొడవైన ఫీచర్ల జాబితాను కలిగి ఉండనుంది. హ్యుందాయ్ గత సంవత్సరం BS6 పవర్‌ట్రెయిన్‌తో టక్సన్ ఎస్‌యూవీకి మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ ఎస్‌యూవీ ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లలో అందుబాటులో ఉంది.

వచ్చే ఏడాది భారత్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న Hyundai, అవేంటంటే..?

కాగా, కొత్తగా రాబోయే మోడల్ డీజిల్ ఇంజన్‌తో పాటుగా ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ను కూడా పొందుతుందని సమాచారం. ఈ కారు 2-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో మార్కెట్లో విక్రయించబడుతోంది. దీని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్‌పి పవర్ ను మరియు 192 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 185 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

వచ్చే ఏడాది భారత్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న Hyundai, అవేంటంటే..?

2. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (Hyundai Creta Facelift)

హ్యుందాయ్ నుండి అత్యంత పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటాలో కంపెనీ 2020 ఆరంభంలో ఫేస్‌లిఫ్ట్ ను విడుదల చేసింది. ఈ ఫేస్‌లిఫ్ట్ వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఈ మోడల్ కొత్త సంవత్సరంలో మరోసారి ఫేస్‌లిఫ్ట్ ను ఇచ్చే అవకాశం ఉంది. ఫేస్‌లిఫ్ట్ రూపంలో వచ్చిన 2020 మోడల్ క్రెటా మార్కెట్లో మంచి విజయాన్ని సాధించింది. మునుపటి డిజైన్ తో పోలిస్తే ఈ కొత్త డిజైన్ చాలా ప్రీమియంగా మరియు స్టైలిష్ గా ఉండటంతో కస్టమర్లు ఈ మోడల్ కోసం ఎగబడ్డారు.

వచ్చే ఏడాది భారత్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న Hyundai, అవేంటంటే..?

అయితే, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ వంటి మోడళ్లతో ఈ విభాగంలో పోటీ పెరిగింది. దీంతో ఈ పోటీకి తగినట్లుగా హ్యుందాయ్ కూడా తమ క్రెటా ఎస్‌యూవీని అప్‌డేట్ చేయాలని చూస్తోంది. వాస్తవానికి, హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయబడింది. కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో మార్పులు అనేక కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌డేట్స్ ఉండనున్నాయి.

వచ్చే ఏడాది భారత్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న Hyundai, అవేంటంటే..?

ఈ మార్పులలో ప్రధానంగా కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్ సెటప్ మరియు రియర్ ప్రొఫైల్ కోసం కొత్త 'పారామెట్రిక్-జ్యువెల్' డిజై వంటి ఎక్స్టీరియర్ హైలైట్స్ ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ దాని ఆకర్షణీయమైన సిల్హౌట్ మరియు వైఖరిని నిలుపుకుంటూ, మునుపటి కంటే మరింత తాజాగా మరియు షార్ప్ గా కనిపించనుంది. కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కాస్మెటిక్ మార్పుల మినహా యాంత్రికంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

వచ్చే ఏడాది భారత్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న Hyundai, అవేంటంటే..?

3. హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Venue Facelift)

క్రెటాకి దిగువన హ్యుందాయ్ విక్రయిస్తున్న సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూలో కూడా కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. గడచిన 2019లో మార్కెట్లోకి వచ్చిన ఈ చిన్న కేవలం 31 నెలల్లోనే 2.50 లక్షల మందికి పైగా కస్టమర్లకు చేరువ అయ్యింది. వచ్చే ఏడాదికి ఈ కారు మార్కెట్లోకి వచ్చి మూడేళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ లేదా రిఫ్రెష్డ్ మోడల్ ని మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది భారత్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న Hyundai, అవేంటంటే..?

హ్యుందాయ్ వెన్యూలో ఇది మొదటి ఫేస్‌లిఫ్ట్ కాబట్టి, ఇందులో గణనీయమైన మార్పులను ఆశించలేము. చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఇందులో వేరే పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, హ్యుందాయ్ వెన్యూ మూడు ఇంజన్ ఆప్షన్లతో విక్రయించబడుతోంది. వీటిలో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ (83 bhp పవర్/114 Nm టార్క్), 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (100 Bhp/240 Nm టార్క్) మరియు 1-లీటర్ టర్బో- పెట్రోల్ ఇంజన్ (120 bhp పవర్/172 Nm టార్క్) ఆప్షన్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Hyundai to launch three new models in india in next year details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X