క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న Hyundai Tucson ఎస్‌యూవీ - డీటేల్స్

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ 'హ్యుందాయ్ టక్సన్' (Hyundai Tucson) యూరో ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, త్వరలోనే ఈ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది.

క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న Hyundai Tucson ఎస్‌యూవీ - డీటేల్స్

ఈ నేపథ్యంలో, కొత్త 2021 హ్యుందాయ్ టక్సన్ కోసం యూరో ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఇది 5-స్టార్ రేటింగ్‌ ను దక్కించుకుంది. ఈ కారు పెద్దల భద్రత విషయంలో 86 శాతం, పిల్లల భద్రత విషయంలో 87 శాతం మరియు భద్రతా సహాయానికి (సేఫ్టీ అసిస్టెన్స్) విషయంలో 70 శాతం స్కోర్ చేసి ఓవరాల్ గా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది.

యూరో ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ నిర్వహించిన ఈ కొత్త 2021 టక్సన్ ఎస్‌యూవీ నాల్గవ తరానికి చెందిన మోడల్. హ్యుందాయ్ టక్సన్ రాబోయే నెలల్లో భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఇప్పటికే, భారత రోడ్లపై చాలా సందర్భాలలో పరీక్షించబడింది. కొత్త మార్పులతో రాబోయే సరికొత్త టక్సన్ ఎస్‌యూవీ వచ్చే ఏడాదిలో భారత్‌లో విడుదల కావచ్చని భావిస్తున్నారు.

క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న Hyundai Tucson ఎస్‌యూవీ - డీటేల్స్

అయితే, ఈ విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. భారతదేశంలో ఎస్‌యూవీ టైప్ కార్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఈ కొత్త 2021 టక్సన్ ను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. యూరో ఎన్‌సిఎపి విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ ఎస్‌యూవీ యొక్క ప్రయాణీకుల కంపార్ట్‌మెంట్ ముందు వైపు నుండి క్రాష్‌ చేసినప్పుడు చాలా స్థిరంగా ఉన్నట్లు స్పష్టమైంది.

క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న Hyundai Tucson ఎస్‌యూవీ - డీటేల్స్

ఫ్రంటల్ కొల్లైజన్ సమయంలో కొత్త 2021 హ్యుందాయ్ టక్సన్ కారు డ్రైవర్ మరియు ప్రయాణీకుడు ఇద్దరికీ మంచి మోకాలి మరియు తొడ రక్షణను అందించింది, అయితే డ్రైవర్ ఛాతీ రక్షణ చాలా బలహీనంగా ఉన్నట్లు తేలింది. దీనితో పాటు, పూర్తి వెడల్పు అవరోధ పరీక్షలో శరీరంలో చాలా భాగం తగిన రక్షణ పొందినట్లు యూరో ఎన్‌క్యాప్ నివేదించింది.

క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న Hyundai Tucson ఎస్‌యూవీ - డీటేల్స్

అదే సమయంలో, సైడ్ బారియర్ పరీక్షలో, శరీరంలో చాలా భాగం తగిన రక్షణ పొందినట్లు తేలింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో, చాలా శరీర భాగాలకు మంచి రక్షణ లభించింది మరియు ఈ విషయంలో కారు గరిష్ట మార్కులను స్కోర్ చేసింది. ముందు మరియు సైడ్ బారియర్ పరీక్షలలో, శిశువు డమ్మీ యొక్క చాలా శరీర భాగాలు బాగా రక్షించబడ్డట్లు స్పష్టమైంది.

క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న Hyundai Tucson ఎస్‌యూవీ - డీటేల్స్

ఈ ఫలితాల కారణంగా, కొత్త 2021 హ్యుందాయ్ టక్న్ కారు మొత్తంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కొత్త మోడల్ యొక్క ముందు భాగంలో ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, నిలువుగా ఉండే డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌లైట్స్ ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే, ఇది మునుపటి కంటే కొంచెం పొడవుగా ఉండవచ్చని తెలుస్తోంది.

క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న Hyundai Tucson ఎస్‌యూవీ - డీటేల్స్

కొత్త తరం టక్సన్ యొక్క ఇంటీరియర్ వివరాలు ఇంకా తెలియలేదు, కానీ ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 10.25 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ మరియు బోస్ సౌండ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లను ఆశించవచ్చు. ప్రస్తుత తరం మోడల్‌లో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, రెండవ వరుస సీట్ రిక్లైన్ ఫంక్షన్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి.

క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న Hyundai Tucson ఎస్‌యూవీ - డీటేల్స్

ఈ కారులో ప్రయాణీకుల భద్రత కోసం, బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ కీప్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ మరియు బ్లైండ్ స్పోర్ట్ మానిటర్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్ట్‌ సిస్టమ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. హ్యుందాయ్ టక్సన్ యొక్క కొత్త తరం మోడల్‌ను వచ్చే ఏడాది మధ్య నాటికి భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ధర పరంగా చూస్తే, దాని పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త తరం మోడల్ ధరలో స్వల్ప పెరుగుదల ఉంటుందని అంచనా.

క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న Hyundai Tucson ఎస్‌యూవీ - డీటేల్స్

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్లో హ్యుందాయ్ టక్సన్ వివిధ రకాల ఇంజన్ ఆప్సన్స్ కలిగి ఉంటుంది. అయితే, భారత మార్కెట్లోకి రాబోయే ఈ మోడల్ 48వి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 2.5 లీటర్ ఇంజన్, 2 లీటర్ ఇంజన్ మరియు 1.6 లీటర్ ఇంజన్ ఆప్షన్లు ఉండొచ్చని సమాచారం. అంతేకాకుండా, ఇది ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ తో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న Hyundai Tucson ఎస్‌యూవీ - డీటేల్స్

భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ టక్సన్ ఈ విభాగంలో జీప్ కంపాస్, ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ మరియు టాటా సఫారీ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. భారత మార్కెట్లో హ్యుందాయ్ టక్సన్ విడుల కావడం ఇదేం మొదటిసారి కాదు. కంపెనీ ఇదివరకే ఈ కారును ఇక్కడి మార్కెట్లో విక్రయించింది. అయితే, అప్పట్లో ఇది అంత విజయవంతం కాలేదు. కానీ, ఇప్పుడు సరికొత్త డిజైన్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ మరియు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో వస్తున్న నేపథ్యం, ఖచ్చితంగా ఇది విజయం సాధించవచ్చని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Hyundai tucson scores 5 star safety rating in euro ncap crash test details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X