భారత్‌లో ఆవిష్కరించబడిన కొత్త Hyundai i20 N Line; డిజైన్, ఫీచర్స్ & వివరాలు

భారతీయ మార్కెట్లో Hyundai కంపెనీ సరికొత్త i20 N Line ఆవిష్కరించింది. ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు బయట మరియు లోపలి భాగంలో అనేక మార్పులకు లోనయింది. ఈ కొత్త Hyundai i20 N Line అద్భుతమైన డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త Hyundai i20 N Line (హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్) యొక్క బుకింగ్‌లు ఈరోజు నుండి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. కావున కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ వెబ్ సైట్ లో లేదా కంపెనీ అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

Hyundai i20 N Line టైటాన్ గ్రే, ఫియరీ రెడ్, థండర్ బ్లూ, పోలార్ వైట్ మరియు రెండు డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్‌తో పాటు ఫైరీ రెడ్ మరియు సాకేత్ థండర్ బ్లూ అనే ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కావున ఇది వాహనదారులను మరింత ఆకర్షించడంలో సహాయపడుతుంది.

కొత్త Hyundai i20 N Line (హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్) దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా భిన్నంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ మోడల్ యొక్క ముందు మరియు వెనుక బంపర్‌కు స్పోర్టి లుక్ ఇవ్వబడుతుంది. అయితే ఫ్రంట్ గ్రిల్‌కు వేరే నమూనా ఇవ్వబడింది. ఇది ముందు మరియు వెనుక స్కర్ట్ మరియు రియర్ బంపర్‌పై డిఫ్యూజర్‌ను కలిగి ఉంది.

దీనికి మరింత స్పోర్టి లుక్ ఇవ్వడానికి, వెనుక భాగంలో రెండు ఎగ్జాస్ట్ టిప్స్ ఇవ్వబడ్డాయి. ఇది 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది కారుకి మరింత స్పోర్టి లుక్ ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో అన్ని చక్రాలపై డిస్క్ బ్రేకులు అమర్చబడి ఉంటాయి.

Hyundai i20 N Line యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇంద్దులో సీట్లు బకెట్ స్టైల్‌లో ఉంచబడ్డాయి. అంతే కాకుండా ఎన్ బ్రాండ్ అపోల్స్ట్రే చాలా చోట్ల, స్పోర్టీ స్టీరింగ్ వీల్ మరియు క్యాబిన్‌లో చాలా చోట్ల, రెడ్ కలర్ హైలైట్‌లు స్పోర్టీ కోసం ఇవ్వబడ్డాయి. అయితే ఇందులోని క్యాబిన్ పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటుంది.

Hyundai i20 N Line లోపల 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఇవ్వబడ్డాయి. ఇంద్దులో 7 స్పీకర్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు 58 కనెక్ట్టెడ్ ఫీచర్లను కలిగి ఉండటమే కాకుండా సన్‌రూఫ్ కంట్రోల్ వంటివి కూడా ఉంటాయి. కావున ఈ మోడల్ వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Hyundai i20 N Line యొక్క ఇంజిన్ విషాయానికి వస్తే, ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 120 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది N6 వేరియంట్‌లో 6 స్పీడ్ IMT గేర్‌బాక్స్ మరియు N8 వేరియంట్‌లో 6 స్పీడ్ IMT మరియు 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ కూడా కలిగి ఉంటుంది.

ఇందులో పెడల్ షిఫ్టర్ కూడా ఉంది. N- లైన్ మోడల్‌లో సస్పెన్షన్ సెటప్ మరియు ఎగ్జాస్ట్ నోట్‌లో కూడా కొంతవరకు మార్పులు చేయబడ్డాయి. ఈ కొత్త వేరియంట్ లో పైన చెప్పినవి కాకుండా, పనితీరు మెరుగుపరచడానికి ఇతర మార్పులు చేయలేదు.

Hyundai కంపెనీ ఈ కారుపై 5 సంవత్సరాల వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్ట్ మరియు 3 సంవత్సరాల బ్లూ లింక్ సబ్‌స్క్రిప్షన్ వంటివి అందిస్తుంది. ఇవన్నీ వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇప్పుడు Hyundai కంపెనీ తన Hyundai i20 N Line ద్వారా స్పోర్ట్ వేరియంట్ భారతీయ మార్కెట్లో మళ్లీ ప్రవేశపెట్టబడింది. ఇది కంపెనీ యొక్క అమ్మకాలను మరింత మెరుగుపరచడంలో చాలా వరకు తోడ్పడుతుంది. ఇది నిజంగా కంపెనీ అభివృద్ధికి కూడా బాగా దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ మోడల్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడం వల్ల, ఇతర కంపెనీదారులు కూడా మరిన్ని మోడళ్ల స్పోర్ట్స్ వేరియంట్‌లను తీసుకువచ్చే అవకాశం ఉంది.

భారతీయ మార్కెట్లో కొత్త Hyundai i20 N Line విడుదలైన తరువాత Volkswagen Polo GT మరియు Tata Altroz iTurbo వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కొత్త Hyundai i20 N Line ధర కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఆకర్షణీయమైన ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Hyundai unveiled performance spec i20 n line in india features and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X