2,50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువైన Hyundai Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయ విపణిలో విక్రయిస్తున్న లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) అమ్మకాల పరంగా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ చిన్న కారును భారత మార్కెట్లో విడుదల చేసిన కేవలం 31 నెలల్లోనే 2.50 లక్షల యూనిట్లకు పైగా విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది.

2,50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువైన Hyundai Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి వచ్చిన మొట్టమొదటి మోడల్ వెన్యూ, అతికొద్ది సమయంలోనే ఈ మోడల్ మార్కెట్లో మంచి ప్రజాదరణ దక్కించుకుంది. ప్రతినెలా ఈ మోడల్ అమ్మకాలు స్థిరంగా సాగుతున్నాయి. ఖరీదైన హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)ని కొనుగోలు చేయలేని వారికి హ్యుందాయ్ వెన్యూ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మరి హ్యుందాయ్ వెన్యూ విజయం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

2,50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువైన Hyundai Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని మే 21, 2019న భారత మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లోకి వచ్చిన కేవలం 31 నెలల్లోనే హ్యుందాయ్ వెన్యూ 2,50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువయ్యింది. మార్కెట్లో వెన్యూ ధరలు రూ. 6.50 లక్షల నుండి రూ. 11.10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే ఇది 50,000 యూనిట్లకు విక్రయాలను నమోదు చేసి, రికార్డు సృష్టించింది. ఆ తర్వాత మరికొన్ని నెలల పాటు డిమాండ్ మందగించింది. మొదటి 15 నెలల్లో 1,00,000 యూనిట్ల మార్కును చేరుకుంది.

2,50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువైన Hyundai Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఆ తర్వాత 25 నెలల్లో హ్యుందాయ్ వెన్యూ 2,00,000 యూనిట్లను చేరుకోగా, ఇప్పుడు 31 నెలల వ్యవధిలో 2,50,000 యూనిట్లను మైలురాయిని చేరుకుంది. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ), టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ మరియు టాటా పంచ్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

2,50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువైన Hyundai Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

తాజా నివేదిక ప్రకారం, హ్యుందాయ్ వెన్యూ కారుని భారత మార్కెట్లో ప్రారంభించినప్పటి నుండి నవంబర్ 2021 చివరి వరకు, ఈ కారు మొత్తం 2,50,518 యూనిట్లు విక్రయించబడ్డాయి, ఇందులో 1,81,829 పెట్రోల్ వేరియంట్లు కాదా 68,689 యూనిట్లు డీజిల్ వేరియంట్లు ఉన్నాయి. పోల్చి చూస్తే, పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్ల నిష్పత్తి 73:27 గా ఉంది. ఈ ట్రెండ్ ను గమనిస్తే, మార్కెట్లో కొనుగోలుదారులు ఎక్కువగా పెట్రోల్ కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

2,50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువైన Hyundai Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

దేశీయ విపణిలో హ్యుందాయ్ వెన్యూ మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్‌లతో విక్రయించబడుతుంది. వీటిలో మొదటి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (83 బిహెచ్‌పి పవర్), రెండవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ (100 బిహెచ్‌పి పవర్) మరియు మూడవది 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (120 బిహెచ్‌పి పవర్) పవర్. ఈ మూడు ఇంజన్లు కూడా వివిధ రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. వీటిలో మ్యాన్యువల్, ఐఎమ్‍టి మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

2,50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువైన Hyundai Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని మొదటిసారిగా చూసిన వారికి ఇదొక చిన్న సైజు క్రెటా ఎస్‌యూవీ మాదిరిగా కనిపిస్తుంది. అయితే, దీని స్టైలింగ్ మరింత ఆడంబరంగా ఉంటుంది, ముఖ్యంగా ఇందులోని స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఇంటీరియర్‌లు చక్కగా స్టైల్ చేయబడ్డాయి మరియు దీని డ్యాష్‌బోర్డ్ లో పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా లభిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ క్యాబిన్ లోపల చిన్న వస్తువుల కోసం పుష్కలమైన స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది.

2,50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువైన Hyundai Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఈ చిన్న కారులో తగినంత బూట్ స్పేస్ కూడా ఉంటుంది. అదనపు బూట్ స్పేస్ కోసం వెనుక సీట్లను మడచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. వెన్యూ పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, వెనుక వరుసలోని ప్యాసింజర్ల కోసం ఇందులో తగినంత లెగ్‌రూమ్ లభిస్తుంది. సేఫ్టీ పరంగా కూడా ఈ చిన్న కార శభాష్ అనిపించుకుంటుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ వార్నింగ్ సిస్టమ్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మొదలైనవి ఉన్నాయి.

2,50,000 మందికి పైగా కస్టమర్లకు చేరువైన Hyundai Venue కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఇదిలా ఉంటే, హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసి దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఇప్పటికే ఈ కొత్త మోడల్ టెస్టింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఇది భారత మార్కెట్‌లో విడుదల కావచ్చు. దీనితో పాటుగా కంపెనీ ఇందులో వెన్యూ యొక్క N-లైన్ అనే పెర్ఫార్మెన్స్ వేరియంట్ ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hyundai venue compact suv sales crosseed 2 50 lakh units in 31 months details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X