హతవిధీ.. Hyundai Verna కు కూడా సేఫ్టీ విషయంలో జీరో రేటింగ్

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్' (Hyundai Motor) యొక్క 'హ్యుందాయ్ వెర్నా' (Hyundai Verna) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ ప్రీమియం సెడాన్. ఇది దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న 'హ్యుందాయ్ వెర్నా' లాటిన్ అమెరికాలో 'హ్యుందాయ్ యాక్సెంట్' పేరుతో విక్రయించబడుతోంది.

హతవిధీ.. Hyundai Verna కు కూడా సేఫ్టీ విషయంలో జీరో రేటింగ్

లాటిన్ అమెరికాలో హ్యుందాయ్ యాక్సెంట్ (హ్యుందాయ్ వెర్నా) ఇటీవల లాటిన్ NCAP క్రాష్ టెస్ట్ కి గురైంది. ఈ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ మోడల్ ఏకంగా 0-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇది నిజంగా హ్యుందాయ్ వెర్నా వినియోగదారులకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది వినియోగదారులను చాలా నిరాశకు గురి చేసింది.

హతవిధీ.. Hyundai Verna కు కూడా సేఫ్టీ విషయంలో జీరో రేటింగ్

NCAP క్రాష్ టెస్ట్‌లో వినియోగించిన హ్యుందాయ్ వెర్నా మోడల్ భారతదేశంలో తయారు చేయబడింది. ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న హ్యుందాయ్ వెర్నా వెర్షన్ లాటిన్ మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ మోడల్‌లో తక్కువ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే ఇది సేఫ్టీ విషయంలో వెనుకబడిపోయింది.

హతవిధీ.. Hyundai Verna కు కూడా సేఫ్టీ విషయంలో జీరో రేటింగ్

ఇటీవల భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ టక్సన్ కు కూడా క్రాష్ టెస్ట్ నిర్వహించడం జరిగింది, ఈ టెస్ట్ లో హ్యుందాయ్ టక్సన్ విఫలమైంది. హ్యుందాయ్ టక్సన్ క్రాష్ టెస్ట్ తరువాత హ్యుందాయ్ వెర్నా క్రాష్ టెస్ట్ నిర్వహించారు, ఇది కూడా కంపెనీకి ఆశించిన విజయాన్ని తీసుకురాలేకపోయింది.

హతవిధీ.. Hyundai Verna కు కూడా సేఫ్టీ విషయంలో జీరో రేటింగ్

క్రాష్ టెస్ట్‌లో ఉపయోగించిన హ్యుందాయ్ వెర్నా మోడల్‌లో సింగిల్ డ్రైవర్-సైడ్ ఎయిర్‌బ్యాగ్, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, EBD మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లతో కూడిన ABS వంటి ఫీచర్లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ మరియు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను ఆప్సనల్ గా హై వేరియంట్లో ఎంచుకోవచ్చు.

హతవిధీ.. Hyundai Verna కు కూడా సేఫ్టీ విషయంలో జీరో రేటింగ్

క్రాష్ టెస్ట్ లో హ్యుందాయ్ వెర్నా (యాక్సెంట్) సెడాన్ వయోజన ప్రయాణీకుల భద్రత విషయంలో 9 శాతం మరియు పిల్లల భద్రత కోసం 13 శాతం స్కోర్ చేసింది. ఈ స్కోర్ మిగిలిన వాటికంటే కూడా చాలా తక్కువ. అంతే కాకుండా పాదచారుల భద్రతలో 53 శాతం మరియు సేఫ్టీ అసిస్ట్ సిస్టంలో కేవలం 7 శాతం మాత్రమే పొందింది. హ్యుందాయ్ వెర్నా టెస్టింగ్ సమయంలో డ్రైవర్ మరియు ప్రయాణీకుల యొక్క మెడ మరియు తలకు కావాల్సిన భద్రతను అందించగలిగింది.

హతవిధీ.. Hyundai Verna కు కూడా సేఫ్టీ విషయంలో జీరో రేటింగ్

దీనితో పాటు డ్రైవర్ యొక్క ఛాతీకి కూడా తగిన రక్షణ లభించింది, కానీ ప్రయాణీకుల ఛాతీకి మాత్రం చాలా తక్కువ రక్షణ లభించింది. డ్రైవర్ మోకాళ్లు మరియు సహ ప్రయాణీకుడి మోకాళ్లకు కూడా ఇందులో చాలా తక్కువ భద్రత ఉందని స్పష్టంగా నిర్దారించబడింది. ఎందుకంటే డ్యాష్‌బోర్డ్ వెనుక ఉన్న నిర్మాణాల వల్ల వారు ప్రభావితమయ్యారు.

హతవిధీ.. Hyundai Verna కు కూడా సేఫ్టీ విషయంలో జీరో రేటింగ్

మొత్తానికి ఈ క్రాష్ టెస్ట్ లో 0 శాతం రేటింగ్ పొంది భద్రత విషయంలో వెనుకబడిపోయింది. కానీ దాని బాడీ షెల్ మరియు ఫుట్‌వెల్ ప్రాంతం స్థిరంగా మరియు ఫార్వర్డ్ లోడ్‌లను తట్టుకోగలదని భావించారు. హ్యుందాయ్ వెర్నా కూడా CRS (చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్) ఫీచర్‌తో రాలేదు మరియు అందువల్ల పిల్లల భద్రతలో కూడా చాలా తక్కువ స్కోరింగ్ పొందింది.

హ్యుందాయ్ వెర్నా సెడాన్ ఈ క్రాష్ టెస్ట్‌లో విఫలమవడానికి ప్రధాన కారణం ప్రాథమిక భద్రతా ఫీచర్లు లేకపోవడమే. ఈ సెడాన్‌లో ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ చేంజ్ వార్ణింగ్ మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి కొన్ని ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లు లేవు. లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లో హయ్యర్ సేఫ్టీ రేటింగ్ కోసం ఈ ఫీచర్‌లు తప్పనిసరి. కావున భద్రతలో 0 రేటింగ్ పొందింది.

హతవిధీ.. Hyundai Verna కు కూడా సేఫ్టీ విషయంలో జీరో రేటింగ్

ఇటీల కాలంలో అహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు మైలేజ్, కారు యొక్క డిజైన్ వంటివి మాత్రమే కాకూండా ఇందులో సరైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయా.. లేదా అని కూడా చూస్తారు. కావున మార్కెట్లో సేఫ్టీ విషయంలో మంచి స్కోరింగ్ చేసిన కార్లను మాత్రమే ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కావున తక్కువ భద్రతా ఫీచర్స్ ఉన్న కార్ల మార్కెట్లో ఆశించిన ఫలితాలను అందించవు. కావున కారులో సేఫ్టీ ఫీచర్స్ చాలా అవసరం.

Most Read Articles

English summary
Hyundai verna gets zero star safety rating in latin ncap crash test details
Story first published: Friday, December 17, 2021, 11:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X