హ్యుందాయ్ నుండి అత్యంత శక్తివంతమైన ఐ20 ఎన్-లైన్; త్వరలో విడుదల!

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, అంతర్జాతీయ మార్కెట్లలో తమ స్టాండర్డ్ కార్లతో పాటుగా 'ఎన్-లైన్' పేరిట పెర్ఫార్మెన్స్ కార్లను కూడా విక్రయిస్తోంది. కానీ, మనదేశంలో హ్యుందాయ్ ఎన్-లైన్ కారు ఒక్కటి కూడా అందుబాటులో లేదు. కాగా, తాజా సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఇప్పుడు తమ ఎన్-లైన్ పెర్ఫార్మెన్స్ కార్లను భారత మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

హ్యుందాయ్ నుండి అత్యంత శక్తివంతమైన ఐ20 ఎన్-లైన్; త్వరలో విడుదల!

హ్యుందాయ్ త్వరలోనే తమ మొట్టమొదటి ఎన్-లైన్ పెర్ఫార్మెన్స్ కారును భారత మార్కెట్లో విడుదల ప్రవేశపెట్టనుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ తమ తొలి ఎన్-లైన్ సిరీస్‌ను దేశీయ విపణిలో విడుదల చేయనుంది.

హ్యుందాయ్ నుండి అత్యంత శక్తివంతమైన ఐ20 ఎన్-లైన్; త్వరలో విడుదల!

భారత మార్కెట్లో ఐ20 ఎన్-లైన్ వేరియంట్ విడుదలను హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎస్.ఎస్. కిమ్ ధృవీకరించారు. "హ్యుందాయ్ దేశంలోని ప్రముఖ స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా తనను తాను నిలబెట్టుకుంటోందని, హ్యుందాయ్ మొబిలిటీ ల్యాండ్‌స్కేప్ కస్టమర్ల ఆకాంక్షలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లే ఉత్పత్తులతో పునర్నిర్వచించబడుతోందని" ఆయన అన్నారు.

హ్యుందాయ్ నుండి అత్యంత శక్తివంతమైన ఐ20 ఎన్-లైన్; త్వరలో విడుదల!

భారతదేశంలో తమ ఎన్-లైన్ సిరీస్‌ని ప్రారంభించడం వలన కస్టమర్‌లకు గతంలో మునుపెన్నడూ లేని క్రీడా అనుభవం లభిస్తుందని, ఎన్-లైన్ సిరీస్ ఉత్పత్తులు ప్రతి డ్రైవ్‌ని మరింత ఉత్సాహాభరితంగా మరియు వినోదభరితంగా మారుస్తాయని చెప్పారు. కస్టమర్ల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి తాము 2021లో కొత్త ఎన్-లైన్ మోడల్‌ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

హ్యుందాయ్ నుండి అత్యంత శక్తివంతమైన ఐ20 ఎన్-లైన్; త్వరలో విడుదల!

గతేడాది అక్టోబర్ నెలలో హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ వెర్షన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేశారు. కాగా, ఇప్పుడు ఈ ఎన్-లైన్ సిరీస్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ భారత రోడ్లపై పరీక్షిస్తోంది. దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ స్టాండర్డ్ హ్యుందాయ్ ఐ20 మాదిరిగానే ఉన్నప్పటికీ, కంపనీ ఇందులో అనేక పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్స్ చేయనుంది.

హ్యుందాయ్ నుండి అత్యంత శక్తివంతమైన ఐ20 ఎన్-లైన్; త్వరలో విడుదల!

హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ ఎక్స్‌టీరియర్

స్టాండర్డ్ ఐ20తో పోల్చుకుంటే, ఈ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ సిరీస్‌లో అనేక కాస్మెటిక్ మార్పులు ఉండనున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తున్నట్లుగానే ఉండే అవకాశం ఉంది. స్టాండర్డ్ ఐ20తో పోల్చుకుంటే, ఐ20 ఎన్-లైన్ చాలా స్పోర్టీయర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ నుండి అత్యంత శక్తివంతమైన ఐ20 ఎన్-లైన్; త్వరలో విడుదల!

కేవలం ఎక్స్టీరియర్ మార్పులే కాకుండా, ఈ కొత్త హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ సిరీస్‌లో కొన్ని మెకానికల్ మార్పులు కూడా ఉండనున్నాయి. ఇందులో సస్పెన్షన్ సెటప్‌ను కొద్దిగా సవరించే అవకాశం ఉంది. అలాగే, ప్రస్తుతం ఉన్న 16 ఇంచ్ చక్రాల స్థానంలో మరింత పెద్దగా 17 ఇంచ్ వీల్స్‌ను ఉపయోగించనున్నారు. అంతే కాకుండా, ఈ కారులో క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన ట్విన్-టిప్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు స్పోర్టీ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు కూడా ఉంటాయి.

హ్యుందాయ్ నుండి అత్యంత శక్తివంతమైన ఐ20 ఎన్-లైన్; త్వరలో విడుదల!

హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ ఇంటీరియర్

భారతదేశంలో విడుదల కానున్న హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ ఇంటీరియర్ దాని అంతర్జాతీయ మోడల్ మాదిరిగానే ఉండవచ్చని తెలుస్తోంది. ఎక్స్‌టీరియర్ మాదిరిగానే, కంపెనీ దీని ఇంటీరియర్‌లో కూడా స్పోర్టీనెస్‌ను ఇచ్చేందుకు కొద్దిపాటి మార్పులు చేర్పులు చేయనుంది. ఇందులో ఎన్-లైన్ బ్రాండింగ్‌తో కూడిన ప్రీమియం అప్‌హోలెస్ట్రీ, స్పోర్టీ ఫ్రంట్ బకెట్ సీట్స్, ఎన్-బ్రాండెడ్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, లెదర్ ఎన్ షిఫ్ట్ గేర్ లివర్ మరియు మెటల్ పెడల్స్ వంటి ఉండనున్నాయి.

హ్యుందాయ్ నుండి అత్యంత శక్తివంతమైన ఐ20 ఎన్-లైన్; త్వరలో విడుదల!

హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ ఇంజన్, గేర్‌బాక్స్

హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్‌లో 1.0-లీటర్ జిడిఐ, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పి పవర్‌ను మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఐఎమ్‌టి లేదా 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
I20 n line series teased an upcoming performance car from hyundai details
Story first published: Monday, August 9, 2021, 18:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X