తగ్గనున్న మారుతి సుజుకి కార్ల వెయిటింగ్ పీరియడ్.. పెరిగిన కార్ల ఉత్పత్తి..

ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కుంటున్నాయి. తక్కవ ఉత్పత్తి కారణంగా, వాహనాల వెయిటింగ్ పీరియడ్ పెరిగి, అమ్మకాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా, భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి గత కొన్ని నెలలుగా తక్కువ అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది.

తగ్గనున్న మారుతి సుజుకి కార్ల వెయిటింగ్ పీరియడ్.. పెరిగిన కార్ల ఉత్పత్తి..

అయితే, ప్రస్తుతం సెమీకండక్టర్ల లభ్యత నెమ్మదిగా మెరుగుపడుతున్న నేపథ్యంలో, మారుతి సుజుకి (Maruti Suzuki) కార్ల ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరుకోనుంది. ఈ నవంబర్ 2021 నెలలో కంపెనీ 1,45,000 యూనిట్ల నుండి 1,50,000 యూనిట్ల మధ్యలో వాహనాలను ఉత్పత్తి చేయగలదని భావిస్తోంది. కాబట్టి, రానున్న మారుతి సుజుకి కార్ల కోసం వేచి ఉండే సమయం (వెయిటింగ్ పీరియడ్) తగ్గి, అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.

తగ్గనున్న మారుతి సుజుకి కార్ల వెయిటింగ్ పీరియడ్.. పెరిగిన కార్ల ఉత్పత్తి..

ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 మహమ్మారి మరియు దాని తదనంతరం పరిస్థితుల కారణంగా, సప్లయ్ చైన్ దెబ్బతిని ఆటోమొబైల్ పరిశ్రమలో భారీగా సెమీకండక్టర్ చిప్స్ కొరత ఏర్పడింది. అంతేకాకుండా, ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ భారీగా పెరగడం కూడా సెమీకండక్టర్ల కొరతకు కారణమని చెప్పవచ్చు.

తగ్గనున్న మారుతి సుజుకి కార్ల వెయిటింగ్ పీరియడ్.. పెరిగిన కార్ల ఉత్పత్తి..

గత కొన్ని నెలలుగా సెమీకండక్టర్ చిప్స్ సరఫరా మెరుగుపడిందని మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ మరియు మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. మారుతి సుజుకి సెప్టెంబర్‌లో 40 శాతం, అక్టోబర్‌లో 60 శాతం మరియు నవంబర్‌లో 85 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని, ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ సరఫరా స్థితి మెరుగుపడినప్పటికీ, మొత్తం పరిశ్రమ మాత్రం ఇంకా లోటును ఎదుర్కొంటూనే ఉందని ఆయన చెప్పారు.

తగ్గనున్న మారుతి సుజుకి కార్ల వెయిటింగ్ పీరియడ్.. పెరిగిన కార్ల ఉత్పత్తి..

సియామ్ నివేదిక ప్రకారం, మారుతి సుజుకి ఈ నవంబర్ 2021 నెలలో 1,50,000 యూనిట్లను ఉత్పత్తి చేయగలిగితే, ఇది గత నాలుగేళ్లలో అత్యుత్తమ పనితీరు అవుతుంది. అంతకు ముందు, కంపెనీ నవంబర్ 2017 నెలలో 1,54,000 కార్లను ఉత్పత్తి చేసింది. కాగా, గడచిన సెప్టెంబర్ 2021 నెలలో కేవలం 81,278 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది, ఇది గత ఎనిమిదేళ్లలో కనిష్టంగా ఉంది, అయినప్పటికీ మారుతి కార్లకు మాత్రం డిమాండ్ పెరుగుతూనే ఉంది.

తగ్గనున్న మారుతి సుజుకి కార్ల వెయిటింగ్ పీరియడ్.. పెరిగిన కార్ల ఉత్పత్తి..

అక్టోబర్ 2020 నెల అమ్మకాలతో పోలిస్తే, అక్టోబర్ నెలలో మారుతి సుజుకి అమ్మకాలు 26 శాతం క్షీణతను నమోదు చేశాయి. బిఎస్6 ఉద్గార నిబంధనల తర్వాత మారుతి సుజుకి డీజిల్ కార్ల తయారీని పూర్తిగా నిలిపివేసింది. అయితే, ఇప్పుడు వాటి స్థానంలో ఎక్కువ సిఎన్‌జి మోడళ్లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో, దేశంలో సిఎన్‌జి మోడల్స్ అద్భుతంగా రాణిస్తున్నాయని, అదనంగా వినియోగదారులు 'సబ్‌స్క్రిప్షన్ మోడల్' మరియు 'స్మార్ట్ ఫైనాన్స్' కోసం కూడా ఆసక్తిని కనబరుస్తున్నారని శ్రీవాస్తవ తెలియజేశారు.

తగ్గనున్న మారుతి సుజుకి కార్ల వెయిటింగ్ పీరియడ్.. పెరిగిన కార్ల ఉత్పత్తి..

ఇకపై డీజిల్ ఇంజన్ కార్లను అందించబోమని మారుతి తెలిపింది. BS-VI ఉద్గార నిబంధనలు పూర్తిగా అమల్లోకి రాకముందే కంపెనీ 2019 లో డీజిల్ ఇంజన్ మోడల్‌ల తయారీని నిలిపివేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఉద్గార నిబంధనల ప్రకారం డీజిల్ ఇంజన్ల తయారీ ఆచరణ సాధ్యం కాదని కంపెనీ పేర్కొంది. డీజిల్ ఇంజన్ కార్లకు మార్కెట్‌లో డిమాండ్ కూడా క్రమంగా తగ్గుతోందని, కాబట్టి డీజిల్ మోడల్‌ల తయారీ నష్టదాయకమని మారుతి సుజుకి పేర్కొంది.

తగ్గనున్న మారుతి సుజుకి కార్ల వెయిటింగ్ పీరియడ్.. పెరిగిన కార్ల ఉత్పత్తి..

మరో రెండేళ్లలో (2023 లో) కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి వస్తాని, దీని కారణంగా డీజిల్ కార్ల తయారీ ఖర్చు మరింత పెరుగుతుందని కంపెనీ తెలిపింది. ఇదిలా ఉంటే, గత కొన్ని నెలలుగా మారుతి సుజుకి సిఎన్‌జి కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మారుతి సుజుకి ప్రస్తుతం ఈ విభాగంలో (సిఎన్‌జి) 85 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉండి, దేశంలోనే అతిపెద్ద సిఎన్‌జి కార్ మేకర్ గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో విక్రయించిన 1.9 లక్షల యూనిట్ల సిఎన్‌జి వాహనాలలో 1.6 లక్షలకు పైగా సిఎన్‌జి వాహనాలు మారుతి సుజుకి సంస్థకు చెందినవే.

తగ్గనున్న మారుతి సుజుకి కార్ల వెయిటింగ్ పీరియడ్.. పెరిగిన కార్ల ఉత్పత్తి..

రాబోయే కొద్ది సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా CNG డిస్పెన్సింగ్ అవుట్‌లెట్‌ల యొక్క వేగవంతమైన విస్తరణను కంపెనీ అంచనా వేస్తుంది, ఇది CNG కార్ మార్కెట్ యొక్క వేగవంతమైన విస్తరణకు దారి తీస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు మూడు లక్షల CNG కార్లను విక్రయించాలని మారుతి సుజుకి యోచిస్తోంది. మారుతి సుజుకి బ్రాండ్ నుండి ప్రస్తుతం ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఈకో, టూర్స్, ఎర్టిగా మరియు సూపర్ క్యారీలలో CNG వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

తగ్గనున్న మారుతి సుజుకి కార్ల వెయిటింగ్ పీరియడ్.. పెరిగిన కార్ల ఉత్పత్తి..

కంపెనీ ఇటీవలే ప్రవేశపెట్టిన కొత్త సెలెరియోలో కూడా త్వరలోనే ఓ CNG వెర్షన్‌ను విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త అప్‌డేటెడ్ కె10-సి ఇంజన్‌తో కూడిన 2021 సెలెరియో కారు భారతదేశంలో కెల్లా అత్యధికంగా మైలేజీనిచ్చే పెట్రోల్ కారు అని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్‌లో ఈ కారును రూ. 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేశారు. సమాచారం ప్రకారం, కొత్త సెలెరియో యొక్క CNG మోడల్‌ను వ్యక్తిగత మరియు వాణిజ్య ఉపయోగం కోసం విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Improved semiconductor supply will reduce the waiting period for maruti suzuki cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X