పార్కింగ్ ఫీజు చెల్లించడానికి కూడా ఫాస్ట్‌ట్యాగ్.. ఎక్కడో తెలుసా?

రోడ్డు రవాణా శాఖ టోల్ ప్లాజాలో వాహనాల రద్దీ మరియు వాహనాలు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, ఫాస్ట్‌ట్యాగ్ అమలు చేసిన విషయం తెలిసిందే. హైవేలపై టోల్ టాక్స్ చెల్లింపును భారత ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది, ఆ తరువాత అన్ని కార్లపై ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది.

పార్కింగ్ ఫీజు చెల్లించడానికి కూడా ఫాస్ట్ ట్యాగ్.. ఎక్కడో తెలుసా?

ఫాస్ట్‌ట్యాగ్ టోల్ టాక్స్‌ను టోల్ ప్లాజాల్లో వేగంగా జమ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగా టోల్ ప్లాజాలలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. కావున ఇప్పుడు దాదాపు అన్ని ద్విచక్ర వాహనాలకు కాకుండా మిగిలిన వాహనాలకు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలి.

పార్కింగ్ ఫీజు చెల్లించడానికి కూడా ఫాస్ట్ ట్యాగ్.. ఎక్కడో తెలుసా?

అయితే ఇప్పుడు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో దేశంలోని మొట్టమొదటి ఫాస్ట్‌ట్యాగ్ / యుపిఐ ఆధారిత నగదు రహిత పార్కింగ్ సౌకర్యాన్ని దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించారు.

పార్కింగ్ ఫీజు చెల్లించడానికి కూడా ఫాస్ట్ ట్యాగ్.. ఎక్కడో తెలుసా?

ఈ పార్కింగ్ సదుపాయంలో 55 ఫోర్ వీలర్లు, 174 ద్విచక్ర వాహనాలను పార్క్ చేసే సౌకర్యం ఉంది. ఈ పార్కింగ్ సౌకర్యం కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ యొక్క గేట్ నెం-6 వద్ద అందుబాటులో ఉంది. నాలుగు చక్రాల వాహనాలు పార్కింగ్ ఛార్జీలు చెల్లించడానికి మాత్రమే ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించబడుతుంది.

పార్కింగ్ ఫీజు చెల్లించడానికి కూడా ఫాస్ట్ ట్యాగ్.. ఎక్కడో తెలుసా?

ఇక ద్విచక్ర వాహన విషయానికి వస్తే, ద్విచక్ర వాహన డ్రైవర్లు యుపిఐ యాప్ ద్వారా పార్కింగ్ ఫీజు చెల్లించవచ్చు. ఈ కొత్త పార్కింగ్ సౌకర్యం చెల్లింపు ఫాస్ట్‌ట్యాగ్ మరియు యుపిఐ ద్వారా మాత్రమే తీసుకోబడుతుందని వాహనదారులు గమనించాలి.

పార్కింగ్ ఫీజు చెల్లించడానికి కూడా ఫాస్ట్ ట్యాగ్.. ఎక్కడో తెలుసా?

ఢిల్లీలోని మెట్రో స్టేషన్లలో కూడా ఇలాంటి మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ యోచిస్తున్నందున ఈ ప్రాజెక్ట్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కి ఒక ముఖ్యమైన దశగా పనిచేస్తుంది. ఈ పార్కింగ్ సౌకర్యం ప్రారంభోత్సవానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మంగు సింగ్ హాజరయ్యారు.

పార్కింగ్ ఫీజు చెల్లించడానికి కూడా ఫాస్ట్ ట్యాగ్.. ఎక్కడో తెలుసా?

ప్రభుత్వం యొక్క 'డిజిటల్ ఇండియా' చొరవలో భాగంగా నగదు రహిత పార్కింగ్ ప్రాజెక్ట్ ఒక ప్రధాన దశ. మేము దీనిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాము. కాలక్రమంలో ఇలాంటి మరిన్ని పార్కింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి కూడా తగిన సన్నాహాలను సిద్ధం చేస్తున్నామని వారు అన్నారు.

పార్కింగ్ ఫీజు చెల్లించడానికి కూడా ఫాస్ట్ ట్యాగ్.. ఎక్కడో తెలుసా?

ఇలాంటి సదుపాయం ఎక్కడ ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంటుందో మరియు ఇలాంటి సదుపాయాలు ఎక్కడ అవసరమవుతాయో అలాంటి ప్రదేశాల్లో ఇలాంటివి ఏర్పాటు చేయడానికి, అవకాశాలను అన్వేషిస్తాము. ఇది సౌకర్యాలను ఆధునీకరించడంలో మాకు సహాయపడటమే కాకుండా, ప్రయాణికులు తమ సమయాన్ని ఆదా చేసుకోవడానికి మరియు ప్రక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.

పార్కింగ్ ఫీజు చెల్లించడానికి కూడా ఫాస్ట్ ట్యాగ్.. ఎక్కడో తెలుసా?

ఈ కార్యక్రమంలో ఎన్‌పిసిఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీమతి ప్రవీణ రాయ్ కూడా హాజరయ్యారు, కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్‌లో ఎన్ఈటిసి ఫాస్ట్‌ట్యాగ్ కాంటాక్ట్‌లెస్ కార్ పార్కింగ్ సొల్యూషన్‌తో దేశం యొక్క మొట్టమొదటి 100% డిజిటల్ పార్కింగ్ ప్లాజాను ప్రారంభించటానికి మేము ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తో భాగస్వామ్యం చేసాము. ఈ సదుపాయం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
FASTag Can Now Be Used To Pay Parking Fee. Read in Telugu.
Story first published: Friday, July 9, 2021, 12:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X