భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

ఈరోజుల్లో వాహనంపై మక్కువ లేని వారు ఉండరు. భారతీయ రోడ్లపై రోజురోజుకూ పెరుగుతున్న కొత్త వాహనాలే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా, భారతీయులు ఎక్కువగా ఎస్‌యూవీ తరహా వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో, ఎంట్రీ లెవల్ మరియు చిన్న కార్ల విభాగంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న సెడాన్లు మరియు హ్యాచ్‌బ్యాక్‌లు కూడా మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

తాజాగా, అంతర్జాల దిగ్గజం గూగుల్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. ఇదివరకటి కథనంలో మనం భారతదేశంలో గూగుల్ సెర్చ్ ఇంజన్ లో శోధించబడిన టాప్ 10 ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకున్నాం. కాగా, ఇప్పుడు ఈ కథనంలో గూగుల్ సెర్చ్ లో శోధించబడిన టాప్ 5 ఎంట్రీ లెవల్ కార్ల గురించి తెలుసుకుందాం రండి.

భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

1. మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire):

మారుతి సుజుకి డిజైర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్. ఈ కారును 2021 లోనే ప్రతి నెలా సగటున 4.5 లక్షల మంది ఈ కారు కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఈ జాబితాలో మారుతి డిజైర్ అగ్రస్థానంలో ఉంది. ఈ సబ్-కాంపాక్ట్ కారును భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం.

భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

భారత మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్ కాంపాక్డ్ సెడాన్ ధరలు రూ. 5.98 లక్షల నుండి రూ. 9.03 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ కారులో విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు లేటెస్ట్ కార్ కనెక్టింగ్ ఫీచర్లు ఉన్నాయి. కాంపాక్ట్ డిజైన్ మరియు స్టైలిష్ లుక్ కారణంగా ఈ కారుకు ఇప్పటికీ డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాచులో ఉంది.

భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

2. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఆల్ట్రోజ్ కారు, కంపెనీ నుండి లభిస్తున్న సురక్షితమైన కార్ మోడళ్లలో ఒకటిగా ఉంది. ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. భారత మార్కెట్లో మారుతి డిజైర్ తర్వాత అత్యధికంగా డిమాండ్ కలిగిన కారుగా టాటా ఆల్ట్రోజ్ ఉంది.

భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

టాటా ఆల్ట్రోజ్ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. అదనంగా, ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ. 5.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

3. హోండా సిటీ (Honda City)

జపనీస్ కార్ బ్రాండ్ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీ కూడా భారత మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన కార్లలో ఒకటి. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్లలో ఒకటైన హోండా సిటీ కారును ప్రతి నెలా సగటువ 3.6 లక్షల మంది భారతీయులు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఫలితంగా, హోండా సిటీ ఈ జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది.

భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

హోండా సిటీ 'CNB ఆడియన్స్ ఛాయిస్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021' టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇందులో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి సియాజ్ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

4. టాటా టియాగో (Tata Tiago)

టాటా మోటార్స్ అందిస్తున్న మరొక మోడల్ టాటా టియాగో ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. దీన్నిబట్టి చూస్తుంటే, భారతీయ వినియోగదారులు టాటా కార్లకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. టాటా ఆల్ట్రోజ్ మాదిరిగా టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ కూడా అత్యుత్తమ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ చిన్న కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది.

భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ కూడా '2017 CNB ఎంట్రీ హ్యాచ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది. దీంతో భారతదేసంలో ఈ కారు విలువ మరింత పెరిగింది. టాటా టియాగో ప్రస్తుతం పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే లభిస్తుంది. కాగా, తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇందులో ఓ సిఎన్‌జి మోడల్ ను వచ్చే ఏడాది జనవరి మధ్య భాగం నాటికి భారత మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

5. మారుతి సుజుకి ఆల్టో 800 (Maruti Alto 800)

భారతదేశపు ఫేవరేట్ కారు మారుతి సుజుకి ఆల్టో, ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. మధ్యతరగతి ప్రజల కలల కారుగా, సరసమైన ధరకే లభించే ఓ బెస్ట్ ఫ్యామిలీ కార్ ఆల్టో. ఈ 5-సీటర్ కారును గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ప్రతినెలా సగటున 3 లక్షల మందికి పైగా శోధించినట్లు గూగుల్ రిపోర్ట్ పేర్కొంది. మారుతి సుజుకి ఆల్టో 800సిసి పెట్రోల్ ఇంజన్ తో లభిస్తుంది. ఇది ఈ విభాగంలో రెనో క్విడ్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

భారతదేశంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న టాప్ 5 కార్లు ఏవో తెలుసా..?

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మారుతి సుజుకి రెండు దశాబ్దాలుగా ఆల్టో కారును భారతదేశంలో విక్రయిస్తోంది. ఇదిలా ఉంటే, ఇందులో ఓ నెక్స్ట్ జనరేషన్ మోడల్ ను వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
India s top five most searched cars in google in 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X