కేంద్ర బడ్జెట్ 2021పై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎమంటోంది..?

మార్చ్ 2021 నుండి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించిన బడ్జెట్ 2021ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ కేంద్ర బడ్జెట్ 2021లో భారతీయ ఆటోమబైల్ పరిశ్రమ స్వాగతించే అంశాలు కొన్ని ఉన్నాయి.

కేంద్ర బడ్జెట్ 2021పై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎమంటోంది..?

ఇందులో ఎప్పటి నుండో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెహికల్ స్క్రాపేజ్ సిస్టమ్ (15 ఏళ్లకు పైబడిన వాననాలను స్క్రాప్ చేయటం) ఉంది. ఈ కొత్త విధానం వలన పాత వాహనాల వినియోగం తగ్గి, కస్టమర్లు కొత్త వాహనాల కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా దేశంలో కాలుష్య స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

కేంద్ర బడ్జెట్ 2021పై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎమంటోంది..?

కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 2021 ఆటోమొబైల్ పరిశ్రమలోని వివిధ కంపెనీలు అధినేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అవేంటో చూద్దాం రండి.

MOST READ:న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

కేంద్ర బడ్జెట్ 2021పై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎమంటోంది..?

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన బడ్జెట్ 2021 భారతదేశ ఆర్థిక వ్యవస్థను భారీగా పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ అభివృద్ధి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వంటి ఆరు ముఖ్య అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించడం ద్వారా ఆయా రంగాల్లో వ్యాపారాలపై మంచి సానుకూల ప్రభావం ఉంటుందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా వ్యాఖ్యానించారు.

కేంద్ర బడ్జెట్ 2021పై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎమంటోంది..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ 2021ని టొయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ స్వాగతించారు. ప్రస్తుతం ఆర్థిక సంకోచ వాతావరణంలో ఆరోగ్యం మరియు సంక్షేమంపై అధిక దృష్టి సారించడం మరియు కోవిడ్-19 మహమ్మారి కారణంగా గణనీయంగా పెరిగిన ఆర్థిక లోటును తీర్చడం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన అంశాలు ప్రశంసనీయమని ఆయన అభిప్రాయ పడ్డారు.

MOST READ:రేసు గుర్రం వంటి కొత్త నిస్సాన్ పాత్‌ఫైండర్ టీజర్ వీడియో

కేంద్ర బడ్జెట్ 2021పై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎమంటోంది..?

ఆటోమొబైల్ పరిశ్రమ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానం ద్వారా రోడ్లపై పాత వాహనాలకు స్వస్తి పలికి, కొత్త వాహనాల వినియోగానికి దారి తీస్తుంది. తద్వారా తక్కువ ఇంధన వినియోగం, తక్కువ కాలుష్యం మరియు స్వచ్ఛమైన కొత్త వాహనాలకు అదనపు డిమాండ్ ఏర్పడుతుంది. ఆటో సెక్టార్ ఈ ప్రకటనను పూర్తిగా స్వాగతిస్తుంది మరియు దీనికి సంబంధించిన పూర్తి ప్రయోజనాలను గ్రహించాలంటే, ప్రారంభం నుండే ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సి ఉంటుందని విక్రమ్ అన్నారు.

కేంద్ర బడ్జెట్ 2021పై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎమంటోంది..?

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2021-22 కేంద్ర బడ్జెట్ దేశంలో అభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని పెంచేందుకు అనేక అంశాలు ఉన్నాయి. రహదారి రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు స్వచ్ఛంద వాహన స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూలమైన ఆటో రంగాన్ని సృష్టించడం సాధ్యమవుతుందని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గుర్‌ప్రతాప్ బోపరాయ్ అన్నారు.

MOST READ:వావ్.. నిన్న కాక మొన్న వచ్చిన ఈ కార్.. అమ్మకాల్లో అప్పుడే టాప్ 10 లో చేరిపోయింది

కేంద్ర బడ్జెట్ 2021పై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎమంటోంది..?

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యవసాయ రంగానికి ప్రకటించిన మద్దతు పట్టణేతర మార్కెట్లలో ఆదాయ సృష్టికి పెద్ద ఊ​​పునిస్తుందని మరియు ఈ ప్రాంతాలలో ఆటో డిమాండ్ కోసం అవకాశాలను పెంచుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

కేంద్ర బడ్జెట్ 2021పై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎమంటోంది..?

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఇదివరకే ప్రకటించిన పిఎల్ఐ పథకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, ఇది భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఉత్పాదక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.

MOST READ:2021 కేంద్ర బడ్జెట్‌లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం ; పూర్తి వివరాలు

కేంద్ర బడ్జెట్ 2021పై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎమంటోంది..?

రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా, ప్యాసింజర్ వాహనాల మార్కెట్ ఇదివరకటిలా 2018 స్థాయికి చేరుకునే అవకాశం లేదని మరియు జీఎస్‌టి మరియు సెస్ పన్నులను తగ్గించాల్సిన అవసరం ఉందని బోపరాయ్ గుర్తు చేశారు.

Most Read Articles

English summary
Indian Auto Industry Reactions On Union Budget 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X