'శిఖర్ ధావన్' కొన్న జర్మన్ లగ్జరీ కారు, ఇదే.. చూసారా!!
ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్న ప్రముఖ బ్యాట్స్‌మెన్స్ లో ఒకరు 'శిఖర్ ధావన్'. శిఖర్ ధావన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే క్రికెట్ అభిమానులందరికి కూడా ఈ పేరు సుపరిచయమే. అయితే ఇటీవల 'శిఖర్ ధావన్' కొత్త BMW M 8 కూపే లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. శిఖర్ ధావన్ కొనుగోలు చేసిన కొత్త BMW M 8 కూపే గురించి మరింత సమాచారం ఇక్కడ మీ కోసం..

భరతయీయ మార్కెట్లో BMW M 8 కూపే 2020 లో విడుదల చేయబడింది. BMW M 8 కూపే మంచి పర్ఫెమెన్స్ కారు, ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలో విక్రయించే BMW కూపే కార్లలో ఉత్తమమైనది M8. దేశీయ మార్కెట్లో ఈ BMW M8 కూపే కారు Audi RS 7 స్పోర్ట్స్ బ్యాక్ మరియు Mercedes Benz యొక్క AMG GT 63 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

BMW యొక్క ఇతర కార్లలాగా M8 కూపే కూడా అనేక అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు, యాంబియంట్ లైటింగ్, హార్మోన్ సౌండ్ సిస్టమ్, M స్పోర్ట్ సీట్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆపిల్ కార్ ప్లే, BMW డిస్ప్లే కీ, పార్క్ అసిస్ట్ ప్లస్, హెడ్‌లైట్, టెయిల్ లైట్, డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఫాగ్ లైట్, LED లైట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

BMW M 8 కూపేలోని ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 4.4 లీటర్ వి8 ట్విన్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఇది BMW యొక్క అత్యంత శక్తివంతమైన ఇంజిన్లలో ఒకటి. ఈ ఇంజన్ గరిష్టంగా 592 బిహెచ్‌పి పవర్ మరియు 750 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

BMW M 8 కూపే M-spec X Drive ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ సిస్టం ఇంజిన్ శక్తిని కారు యొక్క నాలుగు చక్రాలకు ప్రసారం చేస్తుంది. ఈ కారు కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంది. ఈ కారు అద్భుతమైన పనితీరును ఆశించే వినియోగదారులను చక్కగా ఆకర్షిస్తుంది.

BMW M 8 కూపే యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఇది లీటరుకు 9.52 కిమీ మైలేజీని అందిస్తుంది. ఇది ARAI సర్టిఫైడ్ మైలేజ్. అయితే వాస్తవ ప్రపంచంలో గణాంకాలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఇది వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

BMW M 8 కూపే కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,867 మిమీ, 1,907 మిమీ వెడల్పు మరియు 1,362 మిమీ ఎత్తు మరియు వీల్‌బేస్ పొడవు 2827 మిమీ వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 130 మిమీ మాత్రమే. BMW M 8 కూపే బరువు 1960 కేజీల వరకు ఉంటుంది. దాదాపు 2 వేల కేజీల బరువున్నప్పటికీ BMW M 8 కూపే మంచి పనితీరుని అందిస్తుంది.

BMW M 8 కూపే 2-డోర్స్ మోడల్, కావున ఈ కారులో గరిష్టంగా నలుగురు వ్యక్తులు మాత్రమే ప్రయాణించవచ్చు. ఈ కారు 420 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది. BMW M 8 కూపేకి 68 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ఇవ్వబడింది. ఈ కారు ఒక ఫుల్ ట్యాంక్ తో దాదాపు 600 కిమీ వరకు ప్రయాణిస్తుంది.

BMW M 8 కూపే మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం మొత్తం 6 ఎయిర్‌బ్యాగులు అందించబడ్డాయి. అంతే కాకుండా ఇందులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు సీట్ బెల్ట్ అలారం వంటివి కూడా ఉన్నాయి. BMW M 8 కూపే ధర దేశీయ మార్కెట్లో దాదాపు రూ. 2.41 కోట్లు వరకు ఉంటుంది.

శిఖర్ ధావన్ BMW M 8 కూపేతో పాటు Mercedes GL350 కూడా కలిగి ఉన్నాడు. ఇది 3.8-లీటర్ వి6 డీజిల్ ఇంజిన్ ద్వారా 258 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. ఇది 7 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది మరియు ఇది ఆల్ వీల్ డ్రైవ్ కారు, దీని ధర సుమారు 80 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

వీటితో పాటు, Audi కంపెనీ యొక్క Q7 ను కూడా కలిగి ఉన్నాడు. ఇది దేశీయ మార్కెట్లో ఎక్కువమంది ఇష్టపడే కార్లలో ఒకటి. ఇది 3.2 లీటర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 252 బిహెచ్‌పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. భారతీయ క్రికెటర్లలో చాలామందికి ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో శిఖర్ ధావన్ కూడా చేరిపోయారు.


Click it and Unblock the Notifications








