మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

వైద్య ప్రపంచంలో అంబులెన్సులకు ఉన్న ప్రాముఖ్యతను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీటి ప్రాముఖ్యత ఈ కరోనా మహమ్మారి సమయం మరింత పెరిగింది. అంబులెన్స్‌లు రోగులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లడంలో చాలా సహాయపడతాయి. వీటిలో అనేక సహాయక పరికరాలు కూడా అందుబాటులో ఉంటాయి. రోగుల ప్రాణాలను కాపాడటంలో అంబులన్సులే ప్రధాన పాత్ర వహిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

భారతదేశంలో అంబులెన్సులను అనుకూలంగా ఉండే వాహనాలు ఏవి, అవి ఏవిధంగా అనుకూలంగా ఉంటాయి అనే విషయాలను గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

Maruti Suzuki Omni (మారుతి సుజుకి ఓమ్ని)

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి Maruti Suzuki. అయితే ఈ కంపెనీ యొక్క Omni భారతదేశంలోని పురాతన అంబులెన్స్ వాహనాలలో ఒకటి, ఇది ఇప్పటికి కూడా దేశంలో అంబులెన్స్‌గా వాడుకలో ఉంది. Maruti Suzuki Omni అంబులెన్సుకి కావలసిన విధంగా ఉంటుంది.

మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

మారుతి సుజుకి దాని అంబులెన్స్ ఎడిషన్‌ అయిన Maruti Suzuki Omni ని నిలిపివేసినప్పటికీ, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, ఈ కారు సాధారణ ప్యాసింజర్ ఎడిషన్‌గా కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ కారు ఆశించిన స్థాయిలో సేఫ్టీ ఫీచర్స్ పొందలేదు, అయినప్పటికీ మనం అక్కడక్కడా Maruti Suzuki Omni అంబులెన్స్‌ చూస్తూనే ఉన్నాము.

మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

Maruti Suzuki Eeco (మారుతి సుజుకి ఎకో):

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో Maruti Suzuki Eeco కూడా మంచి ప్రజాదరణ పొందిన మోడల్. ప్రస్తుతం కాలంలో కూడా కంపెనీ యొక్క ఎకో మోడల్ అంబులెన్సులుగా వినియోగంలో ఉన్నాయి. ఎకో మోడల్ తో పోలిస్తే కంపెనీ యొక్క ఓమ్ని మోడల్ వెనుకబడి ఉంది అనే చెప్పాలి.

Maruti Suzuki Eeco ఇప్పటికి కూడా చాలా ఆసుపత్రులు మరియు నర్సింగ్ హోమ్‌లలో అంబులెన్స్‌గా ఉపయోగించబడుతుంది, అంతే కాకుండా పాఠశాలలో పిల్లలను రవాణా చేయడానికి కూడా ఇది ఉపయోగించబడుతుంది. అయితే కంపెనీ యొక్క Omni వలె, మారుతి సుజుకి Eeco కూడా అంత సురక్షితం కాదు, కావున వాహన వినియోగదారులు కొంత జాగ్రత్త వహించాలి.

మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

Tata Winger (టాటా వింగర్):

దేశీయ వాహన తయారు సంస్థ అయిన Tata Motors యొక్క Tata Winger ఒక పెద్ద వాహనం. కావున ఇది వైద్య పరికరాలను నిల్వ చేయడానికి ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంది. ఈ కారణంగానే చాలా వరకు పెద్ద ఆసుపత్రులలో దీనిని అంబులెన్సులుగా ఉపయోగిస్తున్నారు.

మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

Tata Winger ఇప్పుడు BS6 అవతార్ పరిచయం చేయబడింది. కావున ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. ఇది అంబులెన్సులుగా ఉపయోగించడానికి ఖచ్చితంగా తగిన వాహనం అని చెప్పాలి. Tata Winger లో రోగిని సులభంగా తీసుకురావడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో బేసిక్ లైఫ్ సపోర్టు, మోడ్రన్ లైఫ్ సపోర్ట్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

Mahindra Bolero (మహీంద్రా బొలెరో):

Mahindra & Mahindra కంపెనీ యొక్క అత్యంత పాపులర్ మోడల్ లో Mahindra Bolero ఒకటి. ఇది సాధారణ రవాణాకు అనుకూలంగా ఉండటం మాత్రమే కాకుండా, అత్యాసరమైన అంబులెన్స్ గా కూడా బాగా ఉపయోగపడుతుంది. Mahindra Bolero వెనుక భాగంలో, 5 మందికి సీటింగ్ ప్రాంతం ఇవ్వబడింది, కావున ఈ స్థానంలో స్ట్రెచర్‌ను అమర్చవచ్చు. అంతే కాకుండా రోగితోపాటు 3 మంది కూడా సులభంగా కూర్చోవచ్చు. దీనితో పాటు మహీంద్రా స్టీల్ వాష్‌బేసిన్‌ను కూడా అందిస్తుంది, ఇది అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు. కావున Mahindra Bolero అంబులెన్సుగా చాలా బాగా ఉపయోగపడుతుంది.

మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

Force Trax (ఫోర్స్ ట్రాక్స్):

Force Motors (ఫోర్స్ మోటార్స్) యొక్క ఈ Force Trax అంబులెన్స్ కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుంది. భారతీయ రహదారి కోసం ఈ అంబులెన్స్‌లో కంపెనీ అనేక మార్పులు చేసింది. దీని గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది, అత్యవసర సమయంలో ఇది చాలా బాగుంది. ఇది ప్రత్యేకంగా రూపొందించబడిన ఆటోలోడర్ స్ట్రెచర్‌ను కలిగి ఉంది, దీని కారణంగా దీనిని సులభంగా మౌంట్ చేయవచ్చు. కావున రోగిని తరలించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కావున Force Trax దేశంలో విస్తృతంగా అంబులెన్సుగా వినియోగంలో ఉంది.

మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

Force Traveller (ఫోర్స్ ట్రావెలర్):

Force Traveller వాహనం పరిమాణంలో చాలా పెద్దదిగా ఉండటం వల్ల ఇది అంబులెన్సుగా విరివిగా ఉపయోగంలో ఉంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఇందులో ట్రాకింగ్ మరియు లైవ్ ఫుటేజ్ స్ట్రీమింగ్ సర్వీస్ కూడా అందించింది. కావున రోగికి అత్యవసర సమయంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

Mahindra Supro (మహీంద్రా సుప్రో):

Mahindra కంపెనీ నుంచి అంబులెన్సుగా ఉపయోగపడుతున్న మరొక్క వాహనం ఈ Mahindra Supro. ఇందులో ఫోల్డబుల్ స్ట్రెచర్ కమ్ ట్రాలీ, మెడికల్ కిట్ బాక్స్, ఆక్సిజన్ సిలిండర్, అగ్నిమాపక పరికరంతో పాటు అంతర్గత లైటింగ్, మంటలను తట్టుకునే ఇంటీరియర్స్ వంటి అన్ని అవసరమైన ఫీచర్లను కలిగి ఉండటం వల్ల ఇది అంబులెన్సుగా చెలామణిలో ఉంది.

మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

MG Hector (ఎంజి హెక్టర్):

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన MG Motor కంపెనీ తన MG Hector ని కరోనా సమయంలో అంబులెన్సుగా చేసి విరివిగా అందించింది.ఇందులో ఆటోలోడింగ్ స్ట్రెచర్, ఆక్సిజన్ సిస్టమ్, జంప్ సీటు మొదలైనవి ఇవ్వబడ్డాయి. భవిష్యత్తులో కంపెనీ దీన్ని ప్రొడక్షన్ మోడల్‌కు తీసుకువస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇది అంబులెన్సుగా అన్ని విధాలా సరైనదిగా ఉంటుంది.

మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాలు ఇవే

Toyota Innova (టయోటా ఇన్నోవా):

టయోటా కంపెనీ ఇన్నోవాను అంబులెన్స్‌గా ఉత్పత్తి చేయనప్పటికీ, దీనిపై ఉన్న విశ్వసనీయత మరియు భద్రతను పరిగణనలోకి తీసుకుని పైన పేర్కొన్న చాలా వాహనాల కంటే మెరుగైన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఇది అంబులెన్స్‌గా వినియోగిస్తున్నారు. ఇందులో రోగికి కావలసిన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. కావున Toyota Innova అంబులెన్సుగా తగిన వాహనం.

Most Read Articles

English summary
Indian vehicles as ambulance omni eeco winger bolero details
Story first published: Tuesday, October 26, 2021, 11:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X