దేశంలో అతిపెద్ద సోలార్ కార్ పార్క్ ఏర్పాటు చేసిన టాటా మోటార్స్; వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పూణేలోని తన సౌకర్యం వద్ద భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ కార్ పార్క్ ఏర్పాటును పూర్తి చేసింది. దీని ద్వారా టాటా మోటార్స్ కార్బన్ న్యూట్రల్ కంపెనీగా మారటానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పుడు కంపెనీ పూణేలో తయారు చేసిన ఈ కొత్త సోలార్ కార్ పార్క్ ద్వారా సంవత్సరానికి దాదాపు 7,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి.

దేశంలో అతిపెద్ద సోలార్ కార్ పార్క్ ఏర్పాటుచేసిన టాటా మోటార్స్; వివరాలు

టాటా మోటార్స్ పూణే ప్లాంట్‌లో ఈ కొత్త సోలార్ పార్క్ 30,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించింది. దేశంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ అయిన ఈ సదుపాయం ప్రతి సంవత్సరం 86.4 లక్షల కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. టాటా గ్రూప్ యొక్క గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్ తత్వానికి అనుగుణంగా, టాటా మోటార్స్ మరియు టాటా పవర్ పూణేలోని చిఖాలిలోని తన కార్ ప్లాంట్లో అతిపెద్ద గ్రిడ్-కనెక్ట్ చేసిన సోలార్ కార్ పార్క్ ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలో అతిపెద్ద సోలార్ కార్ పార్క్ ఏర్పాటుచేసిన టాటా మోటార్స్; వివరాలు

పూణేలోని చిఖాలిలోని తన తయారీ కేంద్రంలో 30,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న స్టాక్‌యార్డ్‌లో సోలార్ ప్లేట్స్ చేర్చడానికి, కంపెనీ టాటా పవర్‌తో కలిసి పనిచేసింది. ఈ సోలార్ కార్ పార్కింగ్ యొక్క ప్రధాన లక్ష్యం 2039 కి జీరో కార్బన్ కి చేరడం. ఇందుకోసమే కంపెనీ 2020 ఆగస్టు 31న రెండు సంస్థలు విద్యుత్ కొనుగోలు ఒప్పంద కుదుర్చుకున్నాయి.

దేశంలో అతిపెద్ద సోలార్ కార్ పార్క్ ఏర్పాటుచేసిన టాటా మోటార్స్; వివరాలు

ఈ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత కరోనా మహమ్మారి అధికంగా ప్రబలుతున్న ఈ సమయంలో కూడా కేవలం కేవలం 9.5 నెలల ఈ ప్రాజెక్టును పూర్తిచేసుకుంది. ఇక్కడున్న 6.2 మెగావాట్ల సోలార్ స్టాక్‌యార్డ్ ఏటా 7,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను అంటే తన జీవితకాలంలో మొత్తం 1.6 లక్ష టన్నులను తగ్గిస్తుందని అంచనా. అంతే కాకుండా సోలార్ ప్యానెల్ కింద నిలిపిన కార్లకు అదనపు రక్షణ కూడా కల్పించనున్నారు.

దేశంలో అతిపెద్ద సోలార్ కార్ పార్క్ ఏర్పాటుచేసిన టాటా మోటార్స్; వివరాలు

దేశంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఆటో తయారీదారులు పర్యావరణ అనుకూల తయారీకి పాల్పడుతున్నారు. టాటా మోటార్స్ నుండి వచ్చిన కొత్త సోలార్ కార్ పార్క్ గణనీయమైన మొత్తంలో స్వచ్ఛమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఉత్పత్తి సౌకర్యం యొక్క ఆపరేషన్ కోసం ఉపయోగించబడుతుంది.

దేశంలో అతిపెద్ద సోలార్ కార్ పార్క్ ఏర్పాటుచేసిన టాటా మోటార్స్; వివరాలు

టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ యూనిట్) శైలేష్ చంద్ర మాట్లాడుతూ 30,000 చదరపు మీటర్ల సోలార్ ప్లేస్ లో కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లను పార్క్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

దీని గురించి టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, మా అన్ని కార్యకలాపాల కోసం 100% పునరుత్పాదక ఇంధన వనరులను సాధించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతే కాకూండా కార్బన్ ఉద్గారాలు తక్కువవైతే పర్యావరణం కూడా సమతుల్యంగా ఉంటుందన్నారు.

Most Read Articles

English summary
India’s Largest Solar Car Park In Pune Setup By Tata Motors. Read in Telugu.
Story first published: Saturday, June 19, 2021, 12:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X