Just In
- 6 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 17 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 19 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 20 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- Movies
A1 Express 2 Days Collections: రెండో రోజే తగ్గిన కలెక్షన్లు.. ఇంకా ఎంత వస్తే హిట్ అవుతుందంటే!
- Finance
బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: వారికి ఇలా ప్రయోజనం
- News
షాకింగ్:ఫోర్జరీతో వైసీపీ గెలుపు -చిత్తూరు కార్పోరేషన్ ఎన్నిక ఆపేయండి -హైకోర్టులో టీడీపీ పిటిషన్, ఉత్కంఠ
- Sports
దిగ్గజాలా మజాకా.. మొన్న సెహ్వాగ్.. నిన్న లారా, తరంగా.. ఆ జోరు ఏ మాత్రం తగ్గలేదు.!
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్వరలో రోడెక్కనున్న 400 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా?
భారతదేశంలో రోజు రోజుకి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తారా స్టాయికి చేరుకుంటున్నాయి. ఇది సామాన్యుడిపై పెనుభారం మోపుతోంది. ఈ తరుణంలో చాలామంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అంతే కాదు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బస్ సర్వీకులు కూడా ఈ డీజిల్ మరియు పెట్రోల్ కి ప్రత్యామ్నాయంగా ఉండే విధంగా ఉండాలని యోచిస్తున్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో 2021 మార్చి 400 కొత్త సిఎన్‌జి బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ 400 కొత్త సిఎన్‌జి బస్సుల నిర్వహణను సులభతరం చేయడానికి ఇండోర్‌కు చెందిన అటల్ నగర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ విజయనగర్ స్క్వేర్‌లో కొత్త బస్ డిపోను నిర్మించాలని సంబంధిత అధికారులు యోచిస్తోంది.

విజయ్ నగర్ స్క్వేర్‌లోని ఐఎంసి జోనల్ ఆఫీస్ వెనుక మూడు ఎకరాల భూమిలో బస్ డిపో ఏర్పాటు చేయడానికి టెండర్‌ను ఏడాది క్రితం ఆహ్వానించారు. కరోనా వైరస్ కారణంగా ఈ పనులు అనుకున్న స్థాయిలో పురోగతి సాధించలేదు. అయితే ఇప్పుడు 400 సిఎన్‌జి బస్సులను కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వబడింది.
MOST READ:2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి బైక్ రివ్యూ.. ఇప్పుడు మరింత సూపర్ గురూ..

ఈ బస్సుల నిర్వహణకు బస్ డిపో అవసరం కాబట్టి కొన్ని మార్పులతో టెండర్ తిరిగి ఆహ్వానించబడింది. అటల్ ఇండోర్ సిటీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ అధికారులు మాట్లాడుతూ, టెండర్ జారీ చేసిన తర్వాత సుమారు 6 నెలల వ్యవధిలో 11 కోట్ల రూపాయల వ్యయంతో బస్ డిపో పూర్తవుతుందని మేము ఆశిస్తున్నామన్నారు.

బస్సుల నిర్వహణ మరియు పార్కింగ్ కోసం అన్ని సౌకర్యాలు ఈ బస్ డిపోలో అందుబాటులో ఉంటాయి. మొత్తం 400 కొత్త సిఎన్‌జి బస్సులు మార్చి మధ్య నాటికి డెలివరీ అవుతాయి. కొత్త బస్సులు వచ్చిన తరువాత కనీసం 25 కొత్త రూట్లలో ఈ సర్వీస్ ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.
MOST READ:మంత్రి కాన్వాయ్ ఓవర్‌టేక్ చేయడంతో చిక్కులో పడ్డ పర్యాటకులు

మార్చిలో ఇండోర్‌లో 400 సిఎన్‌జి బస్సులు కొనుగోలుకు గ్రీన్ సిగ్నెల్ లభించడంతో, ఇందులో ఇందులో 150 సిఎన్‌జి ఏసీ బస్సులు మరియు 100 నాన్ ఏసీ సిఎన్‌జి బస్సులు ఉంటాయి. ఈ బస్సుల వచ్చిన తర్వాత కొత్త ఆపరేషన్ మార్గాలపై మరియు మరొక బస్ డిపో ఏర్పాటు నిర్ణయించబడుతుంది.

సిఎన్‌జి వాహనాలు ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాయు కాలుష్యం వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర రవాణా సంస్థలు కూడా సిఎన్‌జి వాహనాలను కొనడానికి ఆసక్తి చూపుతున్నాయి.
MOST READ:నేపాల్ నుండి ఇండియాకి పెట్రోల్ స్మగ్లింగ్; అక్కడ రూ.22 తక్కువ అందుకే..

ఢిల్లీ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ దీనికి స్పష్టమైన ఉదాహరణ. ఇండోర్ మాత్రమే కాదు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కూడా ఎక్కువ సిఎన్‌జి బస్సులను కొనుగోలు చేస్తోంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సిఎన్‌జి బస్సులతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది.
పర్యావరణ అనుకూల వాహనాల వాడకంలో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు ఢిల్లీ ప్రభుత్వం ఆదర్శప్రాయంగా ఉంది. వాయు కాలుష్య సమస్య తీవ్ర ప్రభావం కారణంగా ఢిల్లీ, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
Note: Images used are for representational purpose only.