మీ వద్ద ఎస్‌యూవీ ఉంటే, ఇసుజు పికప్ ట్రక్కుపై రూ.1.50 లక్షల భారీ డిస్కౌంట్!

ఇసుజు ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త 2021 హై-లాండర్ మరియు వి-క్రాస్ పికప్ ట్రక్కులపై కంపెనీ భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇసుజు డి-మాక్స్ హై-లాండర్‌పై కంపెనీ ఫ్లాట్ రూ.1.5 లక్షల క్యాష్ డిస్కౌంట్‌ను ప్రకటించింది.

మీ వద్ద ఎస్‌యూవీ ఉంటే, ఇసుజు పికప్ ట్రక్కుపై రూ.1.50 లక్షల భారీ డిస్కౌంట్!

అయితే, ఈ ఆఫర్‌ను పొందాలంటే, ఖచ్చితంగా మీ వద్ద ఇప్పటికే ఓ ఎస్‌యూవీ ఉండాలి. మీ వద్ద ఇప్పటికే మారుతి విటారా బ్రెజ్జా నుండి టొయోటా ఫార్చ్యూనర్ వరకు ఏదైనా ఒక ఎస్‌యూవీ ఉన్నట్లయితే, కొత్తగా కొనుగోలు చేయబోయే ఇసుజు డి-మ్యాక్స్ పికప్ ట్రక్కుపై ఈ భారీ తగ్గింపును పొందవచ్చు.

మీ వద్ద ఎస్‌యూవీ ఉంటే, ఇసుజు పికప్ ట్రక్కుపై రూ.1.50 లక్షల భారీ డిస్కౌంట్!

గుర్తుంచుకోండి, ఇది ఎక్స్ఛేంజ్ ఆఫర్ కాదు, ఫ్లాట్ డిస్కౌంట్. సింపుల్‌గా చెప్పాలంటే, మీరు ఇప్పటికే ఓ ఎస్‌యూవీని కలిగి ఉండి, కొత్తగా ఇసుజు పికప్ వాహనాన్ని కొనుగోలు చేయటానికి చూస్తుంటే, మీరు కొనుగోలు చేయబోయే ఇసుజు పికప్ ట్రక్ మీద కంపెనీ ఈ అదనపు తగ్గింపును అందిస్తుంది.

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

మీ వద్ద ఎస్‌యూవీ ఉంటే, ఇసుజు పికప్ ట్రక్కుపై రూ.1.50 లక్షల భారీ డిస్కౌంట్!

అయితే, ఇది ప్రమోషనల్ ఆఫర్ మాత్రమేనని, దీనికి నిర్దిష్ట గడువు లేకుండా, మొదటి లాట్ బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. కాబట్టి, మీరు నిజంగా ఇసుజు హై-లాండర్ పట్ల ఆసక్తి కలిగి ఉండి, మీ వద్ద ఓ ఎస్‌యూవీ కూడా ఉన్నట్లయితే మీకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

మీ వద్ద ఎస్‌యూవీ ఉంటే, ఇసుజు పికప్ ట్రక్కుపై రూ.1.50 లక్షల భారీ డిస్కౌంట్!

ఇసుజు మోటార్స్ లిమిటెడ్, భారతదేశంలో బిఎస్6 కాలుష్య నిబంధనల నేపథ్యంలో తమ డి-మ్యాక్స్ పికప్ ట్రక్కును సుమారు ఒక ఏడాది కాలం పాటు తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత కొత్త 2021 డి-మ్యాక్స్‌ను విడుదల చేసింది.

MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

మీ వద్ద ఎస్‌యూవీ ఉంటే, ఇసుజు పికప్ ట్రక్కుపై రూ.1.50 లక్షల భారీ డిస్కౌంట్!

ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ అనే ప్రీమియం వేరియంట్ మరియు హై-లాండర్ అనే బేస్ వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు రూ.16.98 లక్షల నుండి 24.49 లక్షల మధ్యలో ఉన్నాయి. (పరిచయ ధరలు, ఎక్స్-షోరూమ్ చెన్నై).

మీ వద్ద ఎస్‌యూవీ ఉంటే, ఇసుజు పికప్ ట్రక్కుపై రూ.1.50 లక్షల భారీ డిస్కౌంట్!

ఇసుజు వి-క్రాస్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, ఈ లైఫ్-స్టైల్ పికప్ ట్రక్కులో ఆరు ఎయిర్‌బ్యాగులు, 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, 6-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

మీ వద్ద ఎస్‌యూవీ ఉంటే, ఇసుజు పికప్ ట్రక్కుపై రూ.1.50 లక్షల భారీ డిస్కౌంట్!

అయితే, బేస్ వేరియంట్ అయిన హై-లాండర్‌లో కంపెనీ ఎలాంటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేయడం లేదు. ఇందులో కేవలం రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు మాత్రమే లభిస్తాయి. కాగా, వి-క్రాస్ హై-లాండర్ కోసం కంపెనీ అనేక రకాల యాక్ససరీలను కూడా అందిస్తోంది. ఇంజన్ పరంగా ఈ రెండు మోడళ్లు ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉంటాయి.

మీ వద్ద ఎస్‌యూవీ ఉంటే, ఇసుజు పికప్ ట్రక్కుపై రూ.1.50 లక్షల భారీ డిస్కౌంట్!

వీటిలో బిఎస్ 6-కంప్లైంట్ 1.9-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 163 హెచ్‌పి పవర్‌ను మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తుంది. హై-లాండర్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 2-వీల్ డ్రైవ్ సిస్టమ్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అదే సమయంలో, వి-క్రాస్ 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది.

MOST READ:నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

Most Read Articles

Read more on: #ఇసుజు #isuzu
English summary
Isuzu India Offers Flat Rs 1.5 Lakh Discount On D-Max, If You Own A SUV, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X