2021 రాంగ్లర్ ఎడిషన్ ఆవిష్కరించిన జీప్; పూర్తి వివరాలు

మార్కెట్లో దాదాపు 80 సంవత్సరాలుగా 4x4 విభాగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఎస్‌యూవీ జీప్ కంపెనీ యొక్క రాంగ్లర్. ఈ జీప్ రాంగ్లర్ ఇటీవల తన 80 వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంది. అయితే ఈ సందర్భంగా కంపెనీ తన 80 వ యానివర్సరీ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2021 రాంగ్లర్ ఎడిషన్ ఆవిష్కరించిన జీప్; పూర్తి వివరాలు

కొత్త 2021 జీప్ రాంగ్లర్ ఎస్‌యూవీ అనేక లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ విధమైన కొత్త ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల జీప్ రాంగ్లర్ మరింత సామర్థ్యం గల ఆఫ్-రోడర్‌గా మారుతుంది. ఈ కొత్త మోడల్‌లో సెలెక్ట్-స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. ఇది ఆఫ్-రోడ్ క్రూయిజ్ కంట్రోల్, ఇది రాక్ క్రాల్ మరియు డ్రైవర్ స్థిరమైన వేగాన్ని నిర్వహించడానికి అనుమతిస్తుంది.

2021 రాంగ్లర్ ఎడిషన్ ఆవిష్కరించిన జీప్; పూర్తి వివరాలు

జీప్ రాంగ్లర్ స్పెషల్ ఎడిషన్ హైడ్రో బ్లూ, స్నాజ్‌బెర్రీ మరియు సర్జ్ గ్రీన్ అనే కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. జీప్ రాంగ్లర్ 80 వ యానివర్సరీ ఎడిషన్‌లో గ్రే కలర్ గ్రిల్, హెడ్‌లైట్ మరియు ఫాగ్ లైట్ బెజెల్స్‌ మరియు గ్రానైట్ క్రిస్టల్ యాక్సెంట్స్ తో 18 ఇంచెస్ టూ-టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది.

2021 రాంగ్లర్ ఎడిషన్ ఆవిష్కరించిన జీప్; పూర్తి వివరాలు

ఆటో హై బీమ్ కంట్రోల్, బాడీ-కలర్ హార్డ్‌టాప్ మరియు ఫ్రంట్ వీల్ ఆర్చ్‌లపై 80 వ యానివర్సరీ బ్యాడ్జ్‌తో ఫుల్లీ ఎల్‌ఈడీ హై-విజిబిలిటీ హెడ్‌లైట్లు ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను గుర్తించడానికి సహాయపడతాయి.

2021 రాంగ్లర్ ఎడిషన్ ఆవిష్కరించిన జీప్; పూర్తి వివరాలు

ఈ స్పెషల్ ఎడిషన్ యొక్క లోపలి భాగంలో కాంట్రాస్ట్ స్టిచింగ్ మరియు బార్బర్ ఫ్లోర్ మాట్స్ ఉన్న డాష్‌బోర్డ్‌ కలిగి ఉంది. ఇది యుకనెక్ట్ 8.4 ఎన్ఎవి సిస్టమ్‌తో 8.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంది.

2021 రాంగ్లర్ ఎడిషన్ ఆవిష్కరించిన జీప్; పూర్తి వివరాలు

ఇది 9-స్పీకర్ ఆల్పైన్ ఆడియో సిస్టమ్‌ను 7 ఇంచెస్ టిఎఫ్‌టి డిస్‌ప్లే మరియు 552డబ్ల్యు వూఫర్‌తో కలిగి ఉంది. ఇది రియర్ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, కీలెస్ ఎంటర్ 'ఎన్ గో, ఫార్వర్డ్ కొలిక్షన్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌ను స్టాప్‌తో కలిగి ఉంది.

2021 రాంగ్లర్ ఎడిషన్ ఆవిష్కరించిన జీప్; పూర్తి వివరాలు

కొత్త 2021 జీప్ రాంగ్లర్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రోడ్ క్యాపబిలిటీస్ కావాల్సినన్ని ఉంటాయి. కావున ఇది ఉత్తమమైన ఆఫ్ రోడర్ గా ఉంటుంది. కొత్త రాంగ్లర్ అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, స్టాప్ అండ్ గో, ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు ఆటో హై బీప్ వంటి వాటిని కలిగి ఉంటుంది

2021 రాంగ్లర్ ఎడిషన్ ఆవిష్కరించిన జీప్; పూర్తి వివరాలు

ఇందులో 2.0 ఎల్ యూరో 6 డి పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 272 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. అయితే ఇది మంచి సామర్త్యాన్ని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

2021 రాంగ్లర్ ఎడిషన్ ఆవిష్కరించిన జీప్; పూర్తి వివరాలు

కొత్త 2021 జీప్ రాంగ్లర్ మునుపటికంటే ఎక్కువ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కంపెనీ యొక్క 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్రాండ్ కావున 80 వ యానివర్సరీ ఎడిషన్ గా ఆవిష్కరించారు. 80 సంవత్సరాలు మార్కెట్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ రాంగ్లర్ మార్కెట్లో ఎంత ప్రజాదరణ పొందిన వాహనంలో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

More from DriveSpark

Article Published On: Monday, July 26, 2021, 19:19 [IST]
English summary
2021 Jeep Wrangler Revealed 80th Anniversary Special Edition. Read in Telugu.
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+