రెనో కార్లపై జులై నెల ఆఫర్లు; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్ ద్వారా కంపెనీ మంచి అమ్మకాలను సాధిస్తోంది. రెనో ప్రస్తుతం దేశీయ విపణిలో క్విడ్, ట్రైబర్, డస్టర్ మరియు కైగర్ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ మోడళ్లపై కంపెనీ జులై 2021 నెలలో భాగంగా ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.

ఈ జులై నెలలో రెనో కార్లను సొంతం చేసుకునే కస్టమర్లు, మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి రూ.65,000 వరకూ విలువైన నగదు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్సేంజ్ బోనస్ మరియు లాయల్టీ బెనిఫిట్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఆఫర్లు జులై 1 నుండి జులై 31వ తేదీ వరకూ చెల్లుబాటులో ఉంటాయి.

రెనో క్విడ్
రెనో ఇండియా అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు క్విడ్‌పై కంపెనీ మొత్తం రూ.52,000 వరకు లాభాలను అందిస్తోంది. ఇందులో రూ.20,000 వరకు నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు లాయల్టీ బోనస్ ఉన్నాయి.

వీటికి అదనంగా, ఆన్‌లైన్ బుకింగ్‌లు చేసుకున్న కస్టమర్లకు కంపెనీ రూ.2,000 తగ్గింపును అందిస్తోంది. ఈ మోడల్‌పై స్టాండర్డ్ ఆఫర్లలో భాగంగా, అర్హత కలిగిన వినియోగదారులకు రెనో రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా రూ.5,000 గ్రామీణ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

రెనో ట్రైబర్
రెనో ట్రైబర్ ఎమ్‌పివిపై కంపెనీ రూ.55,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో ట్రైబర్ 2020 మోడల్‌పై కస్టమర్లు రూ.25,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.10,000 వరకు లాయల్టీ బోనస్‌లను అందిస్తోంది.

అలాగే ట్రైబర్ యొక్క 2021 మోడల్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.10,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు లాయల్టీ బోనస్ మరియు రూ.5,000 ఆన్‌లైన్ బుకింగ్ బోనస్‌లను కూడా అందిస్తోంది. ట్రైబర్ కస్టమర్లందరికీ రూ.10,000 కార్పొరేట్ బోనస్ లేదా గ్రామీణ ఆఫర్‌కు అర్హత లభిస్తుంది.

రెనో కైగర్
రెనో బ్రాండ్ లేటెస్ట్ మోడల్ కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై కంపెనీ గరిష్టంగా రూ.20,000 వరకు నగదు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ బోనస్ మరియు రూ.10,000 లాయల్టీ బోనస్‌లు కలిసి ఉంటాయి. ఇవి తప్ప ఈ మోడల్‌పై వేరే ఏ ఇతర ఆఫర్లు లేవు.

రెనో డస్టర్
రెనో ఇండియా యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ డస్టర్‌పై కంపెనీ గరిష్టంగా రూ.65,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 నగదు ప్రయోజనం మరియు రూ.15,000 లాయల్టీ బెనిఫిట్స్ కలిసి ఉన్నాయి.

ఈ ఎస్‌యూవీపై స్టాండర్డ్ ఆఫర్లలో భాగంగా, కస్టమర్లు రూ.30,000 కార్పోరేట్ డిస్కౌంట్ లేదా రూ.15,000 గ్రామీణ ఆఫర్ మరియు r.e.li.v.e స్క్రాపేజ్ ప్రోగ్రాం కింద రూ.10,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందవచ్చు.

పైన తెలిపిన ఆఫర్‌లన్నీ జూలై 31, 2021 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, వివిధ రాష్ట్రాలు మరియు నగరాలను బట్టి ఈ ఆఫర్లలో మార్పులు ఉండవచ్చు. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత రెనో డీలర్‌షిప్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








