టాటా కార్లపై జులై 2021 ఆఫర్లు: మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గడచిన జూన్ 2021 నెలలో అమ్మకాల పరంగా మంచి పనితీరును కనబరిచింది. ఈ పనితీరును ఇలానే కొనసాగించడానికి కంపెనీ ఇప్పుడు తమ కార్లపై గొప్ప ఆఫర్లను ప్రకటించింది.

టాటా మోటార్స్ జూలై 2021 ఆఫర్లలో భాగంగా తమ ఉత్పత్తులపై తగ్గింపులను అందిస్తోంది. టాటా టియాగో, టిగోర్, నెక్సాన్ మరియు హారియర్ మోడళ్లపై కంపెనీ ఈ ఆఫర్లను అందిస్తోంది. మోడల్ వారీగా టాటా మోటార్స్ అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

టాటా టియాగో
వీటిలో మొదటిగా, టాటా టియాగో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ రూ.15,000 నగదు తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా, ఈ కారుపై టాటా మోటార్స్ రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ప్రకటించింది.

టాటా టిగోర్
టాటా మోటార్స్ యొక్క కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్‌పై కంపెనీ రూ.15,000 నగదు తగ్గింపు మరియు రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. మొత్తమ్మీద, ఈ కారుపై కస్టమర్లు గరిష్టంగా రూ.30,000 వరకూ విలువైన ప్రయోజనాలను పొందవచ్చు

టాటా హారియర్
టాటా మోటార్స్ యొక్క పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ హారియర్‌పై కంపెనీ అత్యధికంగా రూ.65,000 వరకు విలువైన ప్రయోజనాలు అందిస్తోంది. ఈ కారు యొక్క క్యామో, డార్క్ ఎడిషన్, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్+ వేరియంట్లపై రూ.40,000 వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. అదే సమయంలో, దాని ఇతర వేరియంట్లపై కంపెనీ రూ.25,000 అదనపు నగదు తగ్గింపును కూడా అందిస్తోంది.

టాటా నెక్సాన్
కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ విషయానికి వస్తే, ఇందులోని డీజిల్ వేరియంట్‌లపై కంపెనీ రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను మాత్రమే అందిస్తోంది. ఇది కాకుండా, ఈ మోడల్‌పై వేరే ఏ ఇతర ఆఫర్ అందుబాటులో లేదు.

టాటా మోటార్స్ ఇటీవలే టాటా నెక్సాన్ యొక్క డార్క్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టబడింది. టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ ఎక్స్‌జెడ్+, ఎక్స్‌జెడ్+ (ఓ), ఎక్స్‌జెడ్ఏ+ మరియు ఎక్స్‌జెడ్ + (ఓ) వేరియంట్లలో లభిస్తుంది.

స్టాండర్డ్ వేరియంట్లతో పోల్చుకుంటే, ఈ కొత్త టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ వేరియంట్ల ధరలు సుమారు రూ.44,000 నుండి రూ.45,000 అధిక ధరను కలిగి ఉంటాయి. టాటా నెక్సాన్ యొక్క డార్క్ ఎడిషన్‌తో పాటుగా కంపెనీ టాటా హారియర్ డార్క్ ఎడిషన్ కూడా మార్కెట్లో విడుదల చేసింది.

టాటా హారియర్ డార్క్ ఎడిషన్ సరికొత్త ఒబెరాన్ బ్లాక్ ఎక్స్టీరియర్ పెయింట్‌తో లభ్యం కానుంది. దీని ఇంటీరియర్‌లో కూడా ఎక్స్టీరియర్ థీమ్‌కు మ్యాచ్ అయ్యేలా కంపెనీ మార్పులు చేసింది. మార్కెట్లో టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.18.04 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

టాటా మోటార్స్ ఇటీవలే తమ టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో టాటా టియాగో ఎక్స్‌టి (ఓ) పేరుతో ప్రవేశపెట్టబడిన ఈ కొత్త వేరియంట్ ధర రూ.5.48 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications