కొత్త లగ్జరీ కార్ కొన్న కార్తీక్ ఆర్యన్.. దీని రేటు అక్షరాలా..
ఇటీవల సినీ పరిశ్రమలో చాలామంది సెలబ్రెటీలు లగ్జరీ కార్లను కొనుగోలుచేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ లంబోర్ఘిని ఉరుస్ కారుని, ప్రభాస్ లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ కారుని కొనుగోలు చేశారు. అంతే కాకుండా కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి, బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ లంబోర్ఘిని ఉరుస్ కార్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు మరో బాలీవుడ్ యాక్టర్ అయిన కార్తీక్ ఆర్యన్ లంబోర్ఘిని ఉరుస్ కారును కొనుగోలు చేశారు.

కార్తీక్ ఆర్యన్ కొనుగోలు చేసిన లంబోర్ఘిని ఉరుస్ కారు యొక్క ఫోటోలను అతడు తమ సోషల్ నెట్‌వర్కింగ్ అకౌంట్ లో పంచుకున్నారు. కార్తీక్ ఆర్యన్ కొనుగోలు చేసిన లంబోర్ఘిని ఉరుస్ కారు ధర రూ. 3.1 కోట్లు. కార్తీక్ కొనుగోలు చేసిన ఈ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ బ్లాక్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఈ కొత్త కారుతో ఉన్న వీడియోను కూడా ఆర్యన్ షేర్ చేసాడు. ఈ వీడియోలో అతను చాలా సరదాగా ఉన్నట్లు చూడవచ్చు. కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని కలిగి ఉన్న బాలీవుడ్ ప్రముఖుల జాబితాలో చేరాడు. కార్తీక్ ఆర్యన్ గత జనవరిలో తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కొత్త మినీ కూపర్ కారును ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చాడు.

కార్తీక్ ఆర్యన్ తన కొత్త ఉరుస్ ఎస్‌యూవీతో ముంబై వీధుల్లో కనిపిస్తున్నారు. రోహిత్ శెట్టి రెడ్ కలర్ మరియు రణవీర్ సింగ్ ఎల్లో కలర్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని కొనుగోలు చేయగా, కార్తిక్ ఆర్యన్ బ్లాక్ లంబోర్ఘిని కారుని కొన్నాడు.

చాలామంది వాహన ప్రియులు లంబోర్ఘిని కార్ కొనుగోలుచేయాలనుకుంటూ ఉంటారు. కానీ ఆ వాహనాలు అత్యంత ఖరీదైనవి కావడం వల్ల చాలామంది సామాన్యులు కొనునుగోలుచేయలేకపోతారు. లంబోర్ఘిని ఉరుస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. ఈ ఎస్‌యూవీకి భారత్‌లో కూడా మంచి స్పందన వస్తోంది.

ఈ ఎస్‌యూవీకి చెందిన 100 యూనిట్లు భారతదేశంలో అమ్ముడయ్యాయని ఇటీవల కంపెనీ అధికారికముగా తెలిపింది. 10,000 యూనిట్ల ఉత్పత్తిని కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసినట్లు కూడా కంపెనీ ప్రకటించింది. ఇవి చాలా ఖరీదైనవి అయినప్పటికీ చాలా మంచి లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటాయి.
లంబోర్ఘిని ఉరుస్ ఆకర్షణీయమైన డిజైన్, పనితీరు మరియు ఎక్కువ స్థలం ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా చాలామంది వినియోగదారులు ఈ ఎస్‌యూవీని ఇష్టపడతారు. లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ 4.0-లీటర్, 8-సిలిండర్ ట్విన్-టర్బో వి 8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 641bhp పవర్ మరియు 850 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ యొక్క గరిష్ట వేగం గంటకు 305 కిమీ. కరోనా మహమ్మారి మధ్య లంబోర్ఘిని 52 యూనిట్ల ఉరుస్‌ను దేశీయ మార్కెట్లో విక్రయించింది. ఏది ఏమైనా ఈ కారు చాలామంది వినియోగదారులకు ఇష్టమైన వాహనం.


Click it and Unblock the Notifications








