బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

ప్రపంచం చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. ఈ తరుణంలో అని దేశాలు వేగంగా అభివృద్ధివైపు పరుగులు తీస్తున్నాయి. భారతదేశం కూడా నిరంతరం అభివృద్ధివైపు సాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే అన్ని రంగాల్లో టెక్నాలజీ బాగా పెరుగుతోంది. కావున దేశంలో ఎలక్ట్రిక్ వాహన శకం ప్రారంభమయ్యింది.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

ఇప్పటికే దాదాపు చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నిమగ్నమయ్యాయి. అంతే కాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై అనేక రాయితీలు కూడా కల్పిస్తున్నాయి.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

కొనుగోలుదారులు కూడా ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఒకటిగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కేరళ రాష్ట్రం ఇటీవల ఒక షాకింగ్ న్యూస్ విడుదల చేసింది. ఇక నుంచి ఫ్రీ ఛార్జింగ్ సదుపాయం ఉండదంటూ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొన్ని రాష్ట్రాలలో ఫ్రీ పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఓపెన్ చేయబడ్డాయి. కేరళ రాష్ట్రంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సెంటర్లు ప్రారంభించబడ్డాయి. అయితే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

ఇంతకు ముందు ఈ ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసుకోవడానికి అనుమతించేవారు. ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్కీమ్ ఇక రాబోయే రెండు వారాల్లో నిలిపివేయబడుతుంది. కానీ ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఉపయోగించుకోవడానికి ఇకపై ఛార్జ్ చేయబడుతుంది. ఇందులో భాగంగానే ప్రతి యూనిట్ కి రూ. 15 వరకు ఛార్జ్ చేయవచ్చని భావిస్తున్నారు.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వంతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీని ప్రకారం, గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారీ రాయితీలను ప్రకటించింది. అటువంటి సందర్భంలో, కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చింది.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఈ విషయాన్ని తెలియజేసింది. విద్యుత్ వినియోగం యొక్క ప్రతి యూనిట్ కోసం రూ. 15 వరకు ఫీజు ఉంటుందని బోర్డు తెలిపింది. అంతే కాకుండా ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫ్రీ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను పరీక్షిస్తున్నట్లు కూడా అధికారులు తెలిపారు. మూడు నెలల పాటు కొనసాగిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి కావస్తోంది.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు సహాయం చేయడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలక్ట్రిసిఫై అనే ఒక కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనదారులకు సమీపంలోని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను తెలుసుకోవచ్చు. ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

ఇప్పుడు కేరళలోని ప్రధాన నగరాలైన త్రిసూర్, కోజికోడ్ మరియు తిరువనంతపురంలలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఓపెన్ చేయబడ్డాయి. ఇందులో త్రిసూర్ మరియు కోజికోడ్ వద్ద ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అత్యధిక విద్యుత్ వినియోగాన్ని కలిగి ఉన్నాయి. తిరువనంతపురంలో చాలా ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

ఇప్పటి నుండి, ఒక యూనిట్ విద్యుత్ ధర రూ. 5 వరకు ఉంటుంది. అయితే దీనిపై GST మరియు సర్వీస్ ఛార్జీలను ఛార్జ్ చేసిన తర్వాత మొత్తం రూ. 15 రూపాయలుగా ఉంటుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించే పనిలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 25 కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు తెరవబడతాయి.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు అందించే అనేక సబ్సిడీల కారణంగా కేరళలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. నివేదికల ప్రకారం ఈ సంవత్సరం 3,313 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు కేరళ రాష్ట్రంలో నమోదు చేయబడ్డాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ మరియు జూలై నెలల్లో, ఎలక్ట్రిక్ వాహనాలు అత్యధిక సంఖ్యలో నమోదు చేయబడ్డాయి.

బ్రేకింగ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు షాకింగ్ న్యూస్

రోజురోజుకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన ఫేమ్ 2 పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు సబ్సిడీ ఇస్తోంది. ఇది రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను గణనీయంగా పెంచనుంది.

Source: ET Auto

Most Read Articles

English summary
Kerala electricity board to stop free charging scheme for electric vehicles details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X