Kia Caren బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఇక్కడ చూడండి

దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ అయిన 'కియా మోటార్స్' (Kia Motors) భారతీయ మార్కెట్లో ఇటీవల కియా కారెన్స్ (Kia Carens) అనే కొత్త MPV ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఈ MPV కోసం 2022 జనవరి 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Kia Caren బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఇక్కడ చూడండి

కియా ఇండియా యొక్క కియా కారెన్స్ (Kia Carens) కంపెనీ యొక్క నాల్గవ మోడల్. అంతే కాకుండా 2022 లో విడుదలవుతున్న కంపెనీ యొక్క మొదటి కారు కూడా, ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కియా కంపెనీ తన కియా కారెన్స్ యొక్క బుకింగ్ తేదీని కొత్త టీజర్‌తో అధికారికంగా ప్రకటించింది. కావున కొనుగోలుదారులు జనవరి 14 2022 నుంచి బుక్ చేసుకోవచ్చు.

Kia Caren బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఇక్కడ చూడండి

కియా కారెన్స్ అద్భుతమైన మరియు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి 6 మరియు 7 సీట్ల ఎంపికలతో రానుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్‌ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

Kia Caren బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఇక్కడ చూడండి

ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది.

Kia Caren బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఇక్కడ చూడండి

కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ కియా మోడల్స్ లో కనిపించదు. అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

Kia Caren బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఇక్కడ చూడండి

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

Kia Caren బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఇక్కడ చూడండి

ఇందులోని స్టీరింగ్ వీల్ కంపెనీ యొక్క సెల్టోస్ మాదిరిగా ఉంటుంది. ఈ స్టీరింగ్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కొత్త కియా కారెన్స్ 6 మరియు 7 సీట్ల ఎంపికలలో తీసుకురాబడింది. కావున ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది. కంపెనీ యొక్క అత్యధిక వీల్ బేస్ కలిగిన మోడల్ ఇదేనని కంపెనీ పేర్కొంది.

Kia Caren బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఇక్కడ చూడండి

ఇక కొత్త కియా కారెన్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దేశంలోని సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

కొత్త కియా కారెన్స్ పెట్రోల్ మరియు డీజిల్ రెండింటితో సహా మల్టిపుల్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలలో అందించబడుతుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు ఇవ్వబడతాయి. మ్యాన్యువల్, ఆటోమేటిక్, డిసిటి గేర్‌బాక్స్ ఆప్షన్‌తో పాటు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఇందులో అందించే అవకాశం ఉంటుంది.

Kia Caren బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఇక్కడ చూడండి

కొత్త కియా కారెన్స్ MPV దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత 6/7 సీట్ల MPV విభాగంలో ప్రవేశిస్తుంది. ఈ విభాగానికి దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. కావున కియా యొక్క కొత్త కార్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశించవచ్చు. ఈ కొత్త MPV భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే కంపెనీ ఈ MPV యొక్క లాంచ్ తేదీని గురించి అధికారికంగా ప్రకటించలేదు, కానీ త్వరలో కంపెనీ ఈ కియా కారెన్స్ యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 30, 2021, 18:39 [IST]
English summary
Kia carens booking opens on 14th january design features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+