అమేజింగ్ ఆఫర్..: కియా కార్నివాల్‌పై రూ.3.75 లక్షల డిస్కౌంట్!

కొరియన్ కార్ బ్రాండ్ కియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి 'కార్నివాల్'పై కంపెనీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. టొయోటా ఇన్నోవా ఎమ్‌పివి పోటీగా వచ్చిన కియా కార్నివాల్ ధర పరంగా ఇన్నోవా కన్నా అధికంగా ఉంటుంది.

అమేజింగ్ ఆఫర్..: కియా కార్నివాల్‌పై రూ.3.75 లక్షల డిస్కౌంట్!

ఈ కారణం చేతనే ఇది టొయోటా ఇన్నోవాకి గట్టి పోటీగా నిలువలేకపోయింది. ఈ నేపథ్యంలో, కియా కార్నివాల్‌పై కంపెనీ తాజాగా ప్రకటించిన డిస్కౌంట్ల కారణంగా ఇది ఇప్పుడు హై-ఎండ్ టొయోటా ఇన్నోవా వేరియంట్ల ధరకే అందుబాటులోకి రానుంది. కియా కార్నివాల్‌పై కంపెనీ గరిష్టంగా రూ.3.75 లక్షల విలువైన నగదు ప్రయోజనాలను అందిస్తోంది.

అమేజింగ్ ఆఫర్..: కియా కార్నివాల్‌పై రూ.3.75 లక్షల డిస్కౌంట్!

కియా ఇండియా తమ కార్నివాల్ ఎమ్‌పివిని తొలిసారిగా గడచిన ఫిబ్రవరి 2020 నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. అధిక ధర కారణంగా కియా కార్నివాల్ అమ్మకాలు కంపెనీ అందిస్తున్న ఇతర రెండు మోడళ్ల (సోనెట్, సెల్టోస్)తో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కంపెనీ కియా కార్నివాల్ అమ్మకాలను పెంచడానికి ప్రయత్నిస్తోంది.

అమేజింగ్ ఆఫర్..: కియా కార్నివాల్‌పై రూ.3.75 లక్షల డిస్కౌంట్!

ఇందులో భాగంగానే, కియా కార్నివాల్‌పై కంపెనీ ఏకంగా రూ.3.75 లక్షల డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ భారీ డిస్కౌంట్ కార్నివాల్ బేస్-స్పెక్ ప్రీమియం వేరియంట్‌పై అందుబాటులో ఉంటుంది. అలాగే, ఇందులోని మిడ్-స్పెక్ ప్రెస్టీజ్ మరియు టాప్-స్పెక్ లిమోసిన్ అనే రెండు వేరియంట్లపై కంపెనీ గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు నగదు తగ్గింపును అందిస్తోంది.

అమేజింగ్ ఆఫర్..: కియా కార్నివాల్‌పై రూ.3.75 లక్షల డిస్కౌంట్!

ఈ ఆఫర్ జూలై 31, 2021వ తేదీ వరకు మాత్రమే చెల్లుతుందని కంపెనీ పేర్కొంది. కియా కార్నివాల్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో (ప్రీమియం, ప్రెస్టీజ్ మరియు లిమోసిన్) అమ్ముడవుతోంది. తాజా ధరల సవరణ అనంతరం కియా కార్నివాల్ వేరియంట్ల వారీ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

అమేజింగ్ ఆఫర్..: కియా కార్నివాల్‌పై రూ.3.75 లక్షల డిస్కౌంట్!

కియా కార్నివాల్ ప్రీమియం (7-సీటర్) మరియు ప్రీమియం (8-సీటర్) వేరియంట్లను కంపెనీ వరుసగా రూ.24.95 లక్షలు మరియు రూ.25.15 లక్షలకు విక్రయిస్తోంది.

అమేజింగ్ ఆఫర్..: కియా కార్నివాల్‌పై రూ.3.75 లక్షల డిస్కౌంట్!

కాగా, కార్నివాల్ ప్రెస్టీజ్ (7-సీటర్) మరియు ప్రెస్టీజ్ (9-సీటర్) మోడళ్లను వరుసగా రూ.28.95 లక్షలు మరియు రూ.29.95 లక్షలకు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) విక్రయిస్తోంది.

అమేజింగ్ ఆఫర్..: కియా కార్నివాల్‌పై రూ.3.75 లక్షల డిస్కౌంట్!

ఇకపోతే, టాప్-ఎండ్ వేరియంట్ అయిన కియా కార్నివాల్ లిమోసిన్ (7-సీటర్)ను కంపెనీ రూ.33.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విక్రయిస్తున్నారు.

అమేజింగ్ ఆఫర్..: కియా కార్నివాల్‌పై రూ.3.75 లక్షల డిస్కౌంట్!

కియా కార్నివాల్ కోసం కంపెనీ మరొక సరికొత్త ఇండస్ట్రీ ఫస్ట్ స్కీమ్‌ను కూడా ప్రవేశపెట్టింది. 'సంతృప్తి హామీ పథకం' (శాటిస్ఫాక్షన్ గ్యారంటీ స్కీమ్) పేరిట కియా ప్రవేశపెట్టిన ఈ పథకంలో, కార్నివాల్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లు సదరు కారుతో సంతృప్తి చెందకపోయినట్లయితే, వారు దానిని కొనుగోలు చేసిన 30 రోజుల్లోపు కంపెనీకి తిరిగి ఇచ్చేయవచ్చు.

అమేజింగ్ ఆఫర్..: కియా కార్నివాల్‌పై రూ.3.75 లక్షల డిస్కౌంట్!

భారతదేశంలో ఇలాంటి పథకాన్ని అందిస్తున్న మొట్టమొదటి సంస్థ కియా ఇండియా. కారును తిరిగి ఇచ్చేటప్పుడు, కారు యొక్క ఎక్స్-షోరూమ్ ధరలో 95 శాతం మొత్తాన్ని కస్టమర్‌కు తిరిగి చెల్లిస్తామని కంపెనీ ఒక మెమోరాండంలో తెలిపింది. అంతేకాకుండా, కారుపై వసూలు చేసిన రిజిస్ట్రేషన్, ఫైనాన్స్ మరియు ఇతర ఛార్జీలు కూడా తిరిగి ఇవ్వబడతాయి. అయితే, ఈ 30 రోజుల సమయంలో కార్నివాల్ కారు 1,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించరాదని కంపెనీ తెలిపింది.

అమేజింగ్ ఆఫర్..: కియా కార్నివాల్‌పై రూ.3.75 లక్షల డిస్కౌంట్!

ఇక కియా కార్నివాల్ విషయానికి వస్తే, ఇది కేవలం డీజిల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ ఎమ్‌పివిలో 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 440 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Kia Carnival Gets Massive Rs 3.75 Lakh Cash Discount In July 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X