పూర్తి చార్జ్ పై ఆగడకుండా 480 కిలోమీటర్లు పరుగులు తీసే Kia EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న 2021 ఎల్ఏ ఆటో (LA Auto Show) లో కొరియన్ కార్ బ్రాండ్ కియా (Kia) తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ కియా ఈవీ9 (Kia EV9) ని అధికారికంగా ఆవిష్కరించింది. ఇది ప్రస్తుతం కియా విక్రయిస్తున్న ఈవీ6 ఎలక్ట్రిక్ క్రాసోవర్ కు ఎగువన విక్రయించబడుతుంది. కియా అనుబంధ సంస్థ హ్యుందాయ్ అవిష్కరించిన హ్యుందాయ్ సెవన్ (Hyundai Seven) ఎస్‌యూవీ కాన్సెప్ట్ ఆధారంగా ఈవీ9 ఎస్‌యూవీని అభివృద్ధి చేశారు.

పూర్తి చార్జ్ పై ఆగడకుండా 480 కిలోమీటర్లు పరుగులు తీసే Kia EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

కియా ఈవీ9 ఎలక్ట్రిక్ వెహికల్ దాని భాగస్వామి హ్యుందాయ్ సెవెన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌తో అండర్‌పిన్నింగ్‌లను పంచుకున్నప్పటికీ, EV9 చాలా విభిన్నంగా ఉంటుంది. తమ బ్రాండ్ కి ఇదొక ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా మారుతుందని కియా భావిస్తోంది. కొత్త Kia EV9 బోల్డ్ మరియు బాక్సీ స్టైల్ ఎక్స్టీరియర్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ముందు వైపు ట్రెడిషన్ గ్రిల్ స్థానంలో పెద్ద బాడీ-కలర్ ప్యానెల్‌ ఉంటుంది. ఈ ప్యానెల్ 'స్టార్ క్లౌడ్' లైట్ ప్యాటర్న్‌తో ఉంటుంది.

పూర్తి చార్జ్ పై ఆగడకుండా 480 కిలోమీటర్లు పరుగులు తీసే Kia EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

ఇందులో నిలువుగా అమర్చిన డేటైమ్ రన్నింగ్ లైట్‌లతో (DRLలు) కూడిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ ట్రయాంగిల్ ప్యాటర్న్ తో కూడిన 22 ఇంచ్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, రిట్రాక్టబుల్ రూఫ్ రెయిల్స్, వెనుక భాగంలో ట్రైయాంగిల్ D-పిల్లర్ వరకు పెరిగే సన్నని టెయిల్‌లైట్లు వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సాధారణంగా, కారులో కనిపించే సైడ్ మిర్రర్స్ స్థానాన్ని Kia EV9 లో కెమెరాలు రీప్లేస్ చేస్తాయి. ఈ కెమెరాలు రోడ్డుకు ఇరువైపులా వచ్చేపోయే ట్రాఫిక్ ను డ్యాష్‌బోర్డులోని స్క్రీన్ పై ప్రదర్శించేలా చేస్తాయి.

కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారుని 'ప్రకృతి యొక్క వైరుధ్యాల' (Contrasts of Nature) నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇది మోడ్రన్ ఎస్‌యూవీ బాడీ స్టైల్ ను కోరుకునే వారిని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని కంపెనీ ధీమాగా ఉంది. ఈ ఎస్‌యూవీ కొలతలను గమనిస్తే, ఇది 4,930 మిమీ పొడవు, 2,055 మిమీ వెడల్పు మరియు 1,790 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. కొలతల పరంగా, కియా ఈవీ9 ఈ బ్రాండ్ యొక్క అతిపెద్ద అంతర్గత దహన (ఇంటర్నల్ కంబషన్ - ఐసి) ఇంజన్ ఎస్‌యూవీ అయిన కియా టెల్యూరైడ్ (Kia Telluride) కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుంది.

పూర్తి చార్జ్ పై ఆగడకుండా 480 కిలోమీటర్లు పరుగులు తీసే Kia EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

కియా ఈవీ9 వీల్‌బేస్ పొడవు 3,100 మిమీగా ఉంటుంది. వాస్తవానికి, EV9 చూడటానికి కొత్త రేంజ్ రోవర్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్త రేంజ్ రోవర్ కూడా త్వరలోనే ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అందుబాటులోకి రానుంది. కియా EV9 యొక్క డిజైన్ హైలైట్‌లలో కియా 'డిజిటల్ టైగర్ ఫేస్' అని పిలుస్తుంది, ఇది స్లిమ్, L-ఆకారపు ఎల్ఈడి లైట్‌లను కలిగి ఉంటుంది. మస్కులర్ వీల్ ఆర్చ్‌లు, బ్లాక్-అవుట్ పిల్లర్లు, పెద్ద గ్లాస్ రూఫ్, రియర్-హింగ్డ్ డోర్లు మరియు సన్నని ఎల్ఈడి టెయిల్-లైట్లతో ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

పూర్తి చార్జ్ పై ఆగడకుండా 480 కిలోమీటర్లు పరుగులు తీసే Kia EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

కొత్త ఎయిర్ వెంట్ డిజైన్ వాహనం యొక్క ఫ్రంటల్ మాస్‌ను తగ్గిస్తుంది మరియు ఇది దాని ఏరోడైనమిక్స్‌ను బాగా మెరుగుపరుస్తుంది. హుడ్ వెంట్ డక్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ ఎండ పరిస్థితుల్లో కారు బ్యాటరీని చార్జ్ చేయడానికి సహాయపడుతుంది. దీని ఏరోడైనమిక్స్‌ను మరింత మెరుగుపరచడానికి, EV9 లో 22 ఇంచ్ ఏరో-ఫోకస్డ్ త్రిభుజాకారపు అల్లాయ్ వీల్స్ మరియు అవసరం లేనప్పుడు వేరుచేసి, ముడుచుకునే వీలుండే రూఫ్ ట్రాక్స్ మరియు వింగ్ మిర్రర్‌ల స్థానంలో కెమెరాలు ఉన్నాయి.

పూర్తి చార్జ్ పై ఆగడకుండా 480 కిలోమీటర్లు పరుగులు తీసే Kia EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

ఇక ఇంటీరియర్స్ డీటేల్స్ ను గమనిస్తే, Kia EV9 కాన్సెప్ట్ లోపల ఫంకీ పాప్-అప్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇంకా ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను మిళితం చేసే 27 ఇంచ్ అల్ట్రా-వైడ్ స్క్రీన్‌ కూడా ఉంటుంది. కియా EV9 యొక్క ఫ్లోరింగ్ కోసం రీసైకిల్ చేసిన చేపల వలలు (ఫిష్ నెట్స్) ఉపయోగించారు మరియు దాని సీటు అప్‌హోలెస్ట్రీని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ మరియు ఉన్ని ఫైబర్‌లను ఉపయోగించి రూపొందించారు.

పూర్తి చార్జ్ పై ఆగడకుండా 480 కిలోమీటర్లు పరుగులు తీసే Kia EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

అంతేకాకుండా, ఈ కారులో ఉపయోగించిన లెథర్ మెటీరియల్స్ కూడా జంతు భాగాల నుండి కాకుండా, ప్రకృతి సాన్నిహిత్యమైన వెజిటేరియన్ లెథర్ తోయారు చేశారు. అంటే, కియా ఈవీ9 ఎస్‌యూవీ బయట నుండి మాత్రమే కాకుండా లోపలి నుండి కూడా పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనదిగా ఉంటుంది. ఈ కంపెనీ భవిష్యత్తులో తయాయరు చేయబోయే అన్ని వాహనాల్లో లెదర్ వాడకాన్ని దశలవారీగా తొలగించడానికి కృషి చేస్తోంది.

పూర్తి చార్జ్ పై ఆగడకుండా 480 కిలోమీటర్లు పరుగులు తీసే Kia EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

కియా ఈవీ9 ఎలక్టిక్ కారు మూడు రకాల మోడ్స్‌ని కలిగి ఉంటుంది. అవి: యాక్టివ్, పాజ్ మరియు ఎంజాయ్. ఇందులో 'యాక్టివ్' మోడ్ లో ఎస్‌యూవీ కదులుతున్నప్పుడు అన్ని సీట్లు ముందుకు ఉంటాయి. 'పాజ్' మోడల్ మూడవ వరుసలో కూర్చున్న ప్రయాణీకులను ఎదుర్కొనేలా ముందు వరుస సీట్లు ఎదురెదురుగా ఉండేలా తిరుగుతాయి. ఇక చివిరగా 'ఎంజాయ్' మోడ్ లో రెండవ వరుసలోని సీట్లు మడుచుకోవడం ద్వారా టేబుల్‌గా మారుతుంది. ఎస్‌యూవీ చలనంలో లేకుండా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే పాజ్ మరియు ఎంజాయ్ మోడ్‌లు ఎంగేజ్ అవుతాయి.

పూర్తి చార్జ్ పై ఆగడకుండా 480 కిలోమీటర్లు పరుగులు తీసే Kia EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

ఇక చివరిగా కియా ఈవీ9 పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, హ్యుందాయ్ మోటార్ గ్రూప్ యొక్క E-GMP ఆర్కిటెక్చర్ ఆధారంగా, తయారు కానున్న ప్రొడక్షన్ స్పెక్ Kia EV9 ఎలక్ట్రిక్ కారులో 77.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీని మరియు డ్యూయల్-మోటార్ సెటప్‌ను పొందవచ్చని అంచనా మరియు ఇది గరిష్టంగా 580 హార్స్ పవర్ ల అవుట్‌పుట్ ని జనరేట్ చేస్తుందని సమాచారం. కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 480 కిలోమీటర్ల రేంజ్ ను కలిగి ఉందని మరియు 350 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదని కియా తెలిపింది.

పూర్తి చార్జ్ పై ఆగడకుండా 480 కిలోమీటర్లు పరుగులు తీసే Kia EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..

Kia EV9 యొక్క ప్రొడక్షన్ వెర్షన్ 2023 లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అయితే, ఫైనల్ ప్రొడక్షన్ వెర్షన్ లో ప్రస్తుతం ప్రదర్శించబడిన కాన్సెప్ట్ మోడల్ నుండి అనేక ఎలిమెంట్‌లు తొలగించబడే అవకాశం ఉందని భావిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు కియా ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసినదే. ప్రస్తుతానికి, దాని గురించి అధికారిక సమాచారం లేనప్పటికీ, కియా EV9 భారత మార్కెట్లో ఈ కొరియన్ కంపెనీ ఓ అద్భుతమైన ఉత్పత్తిగా ఉపయోగపడుతుందని అంచనా.

Most Read Articles

English summary
Kia ev9 concept previews incoming flagship electric suv193125
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X