బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

దక్షిణ కొరియా కార్ తయారీదారు కియా మోటార్స్ భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ కంపెనీ ఇటీవల తన కార్నివాల్ ఎంపివిలను కొత్తగా కొనుగోలు చేసేవారికోసం 'శాటిస్‌ఫ్యాక్షన్‌ గ్యారెంటీ స్కీమ్' తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద కార్ కొనుగోలు చేసిన కస్టమర్లు కారుపై సంతృప్తి చెందకపోతే దానిని తిరిగి కేవలం 30 రోజుల్లో తిరిగి ఇవ్వవచ్చు. కియా మోటార్స్ ప్రవేశపెట్టిన ఈ కొత్త స్కీమ్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

భారతదేశంలో ఈ కొత్త స్కీమ్ ప్రవేశపెట్టిన సంస్థల్లో కియా మోటార్స్ మొట్టమొదటి సంస్థ. ఇప్పటివరకు ఇటువంటి స్కీమ్ ఇంతకు ముందు ఏ కంపెనీ కూడా ప్రవేశపెట్టిన ఆనవాళ్లు లేదు. కావున ఈ స్కీమ్ వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్ కొనుగోలు చేసిన తర్వాత నచ్చకపోతే 30 రోజుల్లో తిరిగి ఇవ్వవచ్చు.

బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

కస్టమర్ కారును తిరిగి ఇచ్చిన తర్వాత, కారు యొక్క ఎక్స్-షోరూమ్ ధరలో దాదాపు 95 శాతం తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా దీనితో పాటు, రిజిస్ట్రేషన్ ఫైనాన్స్ మరియు కారుపై విధించే ఇతర ఛార్జీలు కూడా తిరిగి ఇవ్వబడతాయి. కానీ వాహనదారుడు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, వాహనదారుడు 30 రోజుల్లో 1,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి ఉండకూడదు.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

ఇది మాత్రమే కాకుండా, కారుని తిరిగి ఇచ్చే సమయంలో, కారు దెబ్బతిన్నా లేదా ఇంజిన్ వంటి వాటిలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని తిరిగి తీసుకోబడదు. దీన్ని కూడా వాహనదారుడు గుర్తించుకోవాలి. కారుని తిరిగి ఇచ్చే సమయంలో కారు యొక్క ఫైనాన్షియర్ తరపున కారు యొక్క ఎన్‌ఓసిని సమర్పించడం కూడా తప్పనిసరి. కారుపై ఏదైనా ఫైన్ లేదా అమౌంట్ వంటివి పెండింగ్ లో ఉంటే దాన్ని క్లియర్ చేసిన తరువాత కంపెనీ కారును తిరిగి తీసుకుంటుంది.

బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

కంపెనీ ప్రవేశపెట్టిన ఇలాంటి స్కీమ్ వల్ల వినియోగదారులకు కారును మెరుగైన రీతిలో ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుందని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా కస్టమర్ మరొక కారు కొనాలనుకుంటే, ఆ అవకాశాన్ని కూడా కంపెనీ కల్పించింది.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

భారతదేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ సమయంలో కరోనాతో పోరాడటానికి కియా కంపెనీ ప్రభుత్వానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కరోనా రిలీఫ్ ఫండ్‌ కింద 5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది.

బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

ఈ మొత్తాన్ని వెంటిలేటర్లు మరియు ఆక్సిజన్ సిలిండర్లతో సహా అనేక ఇతర ముఖ్యమైన వైద్య పరికరాలను కొనుగోలు చేయడానికి ఈ మొత్తం ఉపయోగించబడుతుంది. కియా కంపెనీ ఈ మహమ్మారి పోరాటంలో సహాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సమయంలో, కియా కంపెనీ సిఎం రిలీఫ్ ఫండ్ కి రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చింది.

MOST READ:నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]

బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించబడింది. ప్రస్తుత కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా, కంపెనీ కార్ల వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వంటి వాటిని 2021 జూలై 31 వరకు పొడిగించింది. కియా మోటార్స్ ఇటీవల కాలంలో కియా సెల్టోస్ మరియు సొనెట్ యొక్క కొత్త ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. కియా సెల్టోస్ మరియు సొనెట్ యొక్క ఈ అప్డేటెడ్ ఎడిషన్ ధరలు ఎక్స్ షోరూమ్ ప్రకారం వరుసగా రూ. 9.95 లక్షలు మరియు రూ .6.79 లక్షలు.

Most Read Articles

English summary
Kia India Introduced 30 Days Return Policy On Carnival MPV Details. Read in Telugu.
Story first published: Thursday, May 27, 2021, 11:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X