ముంబైలో కియా ఇండియా డిజిటల్ షోరూమ్ ప్రారంభం; కొత్తగా మరో మూడు..

కొరియన్ కార్ బ్రాండ్ కియా, భారతదేశంలో తమ మొట్టమొదటి డిజిటల్ షోరూమ్‌ను ముంబై నగరంలో ప్రారంభించింది. ఈ షోరూమ్‌లో డిజిటల్ క్యాటలాగ్, హెరిటేజ్ వాల్, డిజిటల్ స్పెక్ బోర్డులు మరియు మీడియా వాల్‌తో కూడిన 3డి కాన్ఫిగరేటర్స్ ఉంటాయి. ఈ డిజిటల్ స్క్రీన్లపైనే కారుకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వర్చ్యువల్‌గా ప్రదర్శించడం జరుగుతుంది.

ముంబైలో కియా ఇండియా డిజిటల్ షోరూమ్ ప్రారంభం; కొత్తగా మరో మూడు..

కియా ఇండియా తమ భావి వినియోగదారుల కోసం అధునాతన డిజిటల్ సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో, భారతదేశంలో తమ మొదటి డిజిటల్ షోరూమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కంపెనీకి అందిన సమాచారం ప్రకారం, ఈ షోరూమ్ ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉంది.

ముంబైలో కియా ఇండియా డిజిటల్ షోరూమ్ ప్రారంభం; కొత్తగా మరో మూడు..

ఈ డిజిటల్ షోరూమ్ కియా ఇండియా ద్వారా నేరుగా నియంత్రించబడే కంటెంట్‌ను ప్రదర్శిస్తుంది మరియు తద్వారా కంపెనీ పారదర్శకత మరియు విశ్వసనీయతకు భరోసా ఇస్తుంది. ప్రస్తుతం కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆటోమొబైల్ ప్రపంచంలో డిజిటల్ స్పేస్ చాలా ముఖ్యమైనది.

ముంబైలో కియా ఇండియా డిజిటల్ షోరూమ్ ప్రారంభం; కొత్తగా మరో మూడు..

ప్రపంచంలో కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికీ ఒక పెద్ద నిజమైన ముప్పుగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో, కార్ల తయారీదారులు వినియోగదారులతో కనెక్ట్ అవ్వడానికి న్యూ ఏజ్ టెక్నాలజీపై ఆధారపడుతున్నారు. కియా ఇండియా కూడా ఇప్పుడు ఇదే బాటలో తమ డిజిటల్ షోరూమ్‌ల కోసం ప్రత్యేక వ్యూహరచన చేస్తోంది.

ముంబైలో కియా ఇండియా డిజిటల్ షోరూమ్ ప్రారంభం; కొత్తగా మరో మూడు..

తాజా సమాచారం ప్రకారం, కియా ఇండియా ఢిల్లీ, చెన్నై మరియు బెంగుళూరు నగరాల్లో కూడా ఇలాంటి మరో మూడు డిజిటల్ డీలర్‌షిప్ కేంద్రాలను తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, కియా ఈ ఏడాది చివరి నాటికి ముంబైలో మరో డిజిటల్ షోరూమ్‌ని కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు భావిస్తున్నారు.

ముంబైలో కియా ఇండియా డిజిటల్ షోరూమ్ ప్రారంభం; కొత్తగా మరో మూడు..

ముంబైలో ఏర్పాటు చేసిన డిజిటల్ వాహన షోరూమ్‌లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియెన్స్ కోసం మొత్తం ఐదు వాహనాలను ఉంచే స్థలం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ షోరూమ్ 606 చదరపు మీటర్లలో విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ షోరూమ్‌లు నిర్వహణ ఖర్చును భారీగా తగ్గించడంలో సహకరిస్తాయి.

ముంబైలో కియా ఇండియా డిజిటల్ షోరూమ్ ప్రారంభం; కొత్తగా మరో మూడు..

అంతేకాకుండా, ఇవి కంపెనీ మరియు బ్రాండ్ యొక్క వారసత్వాన్ని కూడా ప్రదర్శిస్తాయి. భారతదేశంలో కియా సంస్థ ఇప్పుడు బహుముఖ పాత్ర పోషించడానికి ఈ డిజిటల్ షోరూమ్‌లను సపోర్ట్ చేస్తోందని సిఎస్‌బిఓ మరియు కియా ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టే-జిన్ పార్క్ అన్నారు.

ముంబైలో కియా ఇండియా డిజిటల్ షోరూమ్ ప్రారంభం; కొత్తగా మరో మూడు..

కస్టమర్ సెంట్రిసిటీ మరియు డీలర్ యొక్క లాభదాయకతను దృష్టిలో ఉంచుకుని తమ కొత్త డిజిటల్ షోరూమ్‌లు ప్రజల సౌకర్యార్థం రూపొందించబడ్డాయని, ఆటోమోటివ్ వ్యాపారంలో డిజిటలైజేషన్ వైపు వేగంగా మారడం నేడు డీలర్‌షిప్‌లకు సరైన వ్యాపార నమూనాగా దారితీసిందని ఆయన అన్నారు.

ముంబైలో కియా ఇండియా డిజిటల్ షోరూమ్ ప్రారంభం; కొత్తగా మరో మూడు..

ఆటోమోటివ్ రిటైల్‌లో విధానంలో డిజిటలైజేషన్‌ను స్వాగతించే దిశలో భాగంగా, తాము ఈ డిజిటల్ షోరూమ్‌ను ప్రారంభించడం ఒక ప్రధాన అడుగు అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, కియా వాహనాల యాజమాన్ని సులభతరం చేసేందుకు గానూ, కియా ఇండియా ఇటీవల తమ వినియోగదారుల కోసం కొన్ని ఫైనాన్స్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత కియా డీలరును సంప్రదించవచ్చు.

Most Read Articles

English summary
Kia India Opens First Digital Showroom In Mumbai, Details. Read in Telugu.
Story first published: Saturday, July 31, 2021, 14:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X