Kia నుండి వస్తున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి Carens పేరు అర్థం ఏంటో తెలుసా..?

కొరియన్ కార్ బ్రాండ్ కియా ఇండియా (Kia India) ఇటీవలే భారత మార్కెట్లో తమ నాల్గవ ఉత్పత్తి 'కియా కారెన్స్' (Kia Carens) ఎమ్‌పివిని అధికారికంగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. అసలు ఈ మోడల్‌కి కియా కారెన్స్ అనే పేరును ఎందుకు పెట్టారు, ఆ పేరు వెనుక ఉన్న అర్థం ఏంటి మరియు అదెలా పుట్టుకొచ్చిందనే విషయాన్ని మరియు ఈ ఎమ్‌పివికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్‌లను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Kia నుండి వస్తున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి Carens పేరు అర్థం ఏంటో తెలుసా..?

ఇటీవలే పరిచయం చేయబడిన కియా కారెన్స్ ఎమ్‌పివి, కంపెనీ యొక్క తదుపరి లాంచ్ కానుంది. అయితే కియా కారెన్స్ అనే పేరుకు అర్థం ఏమిటి మరియు అది ఎలా తయారైందనే విషయాన్ని కంపెనీ రీసెంట్‌గా ఓ టీజర్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది, దీనితో పాటు, మీరు ఈ కారు పేరును సరిగ్గా గెస్ చేసి కంపెనీకి పంపడం ద్వారా బహుమతిని కూడా గెలుచుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ క్యాంపైన్ ద్వారా కంపెనీ కస్టమర్లలో ట్రెండ్ కావాలని భావిస్తోంది.

Kia నుండి వస్తున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి Carens పేరు అర్థం ఏంటో తెలుసా..?

కియా తమ Carens అనే పేరుని Car + Renaissance (పునరుజ్జీవనం) అనే రెండు ఆంగ్ల పదాల నుండి కలిపి తయారు చేసింది. అంటే, కంపెనీ తమ కారెన్స్ ఎమ్‌పివి ద్వారా కారు ప్రపంచాన్ని పునరుజ్జీవింపజేయాలని చూస్తోందన్నమాట. కియా కారెన్స్ ఎమ్‌పివి కారును కొత్త డిజైన్‌తో తీసుకురాబోతోంది మరియు ఇది ఈ విభాగంలో మొదటిసారిగా లభించే అనేక అధునాతన ఫీచర్లను మరియు పరికరాలను కలిగి ఉండనుంది. అంతేకాకుండా, కారులో డ్రైవర్ మరియు ప్రయాణీకుల సౌకర్యం కూడా మెరుగ్గా ఉండబోతోంది.

Kia నుండి వస్తున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి Carens పేరు అర్థం ఏంటో తెలుసా..?

కియా ఇండియాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ తయారీ కేంద్రం ఉంది. ప్రస్తుతం, ఈ ప్లాంట్ లో కియా సోనెట్ (Kia Sonet) మరియు కియా సెల్టోస్ (Kia Seltos) ఎస్‌యూవీలను స్థానికంగా అసెంబుల్ చేస్తోంది. కాగా కియా కార్నివాల్ (Kia Carnival) ప్రీమియం ఎమ్‌పివిని మాత్రం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో, ఇతర రెండు కియా మోడళ్లు (సోనెట్ మరియు సెల్టోస్) మాదిరిగానే కొత్త కారెన్స్ ఎమ్‌పివిని కూడా కియా తమ ఇండియా ప్లాంట్ లోనే తయారు చేయనుంది.

Kia నుండి వస్తున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి Carens పేరు అర్థం ఏంటో తెలుసా..?

భారతదేశంలో తయారైన కియా కారెన్స్ ఎమ్‌పివిని కేవలం స్థానిక మార్కెట్లోనే కాకుండా, ఇతర దేశాలలో కూడా విక్రయించనుంది. ఈ నేపథ్యంలో కియా కారెన్స్ విజయాన్ని కంపెనీ అంచనా వేస్తోంది, స్థానిక మార్కెట్లో కన్నా ఎగుమతుల కారణంగా దాని అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. ఇండోనేషియా మరియు లాటిన్ అమెరికా వంటి దేశాలలో ఇలాంటి 6/7 సీటర్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. కాగా, భారతదేశంలోని చిన్న నగరాల్లో కూడా కియా కార్లకు డిమాండ్ పెరుగుతోందని కంపెనీ ఇటీవల తెలిపింది.

Kia నుండి వస్తున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి Carens పేరు అర్థం ఏంటో తెలుసా..?

కియా కారెన్స్ ఎమ్‌పివి విషయానికి వస్తే, టొయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) వంటి ప్రీమియం కార్లకు పోటీగా రానున్న ఈ కారులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వబడుతుంది, దాని దిగువ వేరియంట్లు 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతాయని తెలుస్తోంది. ఇతర కియా కార్ల మాదిరిగానే ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పూర్తిగా డిజిటల్‌ రూపంలో ఉంటుంది మరియు దీని స్టీరింగ్ వీల్ చూడటానికి కియా సెల్టోస్ మోడల్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ కి రెండు వైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి, ఇవి కాల్స్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లోని వివిధ ఫీచర్లను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.

Kia నుండి వస్తున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి Carens పేరు అర్థం ఏంటో తెలుసా..?

కియా ఇండియా తమ కారెన్స్ ఎమ్‌పివిని 6 సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో తీసుకురానుంది. ఈ నేపథ్యంలో, కారు లోపలి భాగంలో వెనుక ప్రయాణీకుల కోసం ఏసి వెంట్‌లు, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, అదనపు యూఎస్‌బి చార్జింగ్ పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ అప్‌హోలెస్ట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్పాట్ లైట్ వంటి మరెన్నో ఆధునిక ఫీచర్లను ఇందులో ఆఫర్ చేయనున్నారు.

Kia నుండి వస్తున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి Carens పేరు అర్థం ఏంటో తెలుసా..?

కియా తమ సెగ్మెంట్లో అత్యధిక వీల్ బేస్ కలిగిన మోడల్ ఇదేనని పేర్కొంది. ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ సీట్ ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం. సేఫ్టీ విషయానికి వస్తే, భారతదేశంలో వినియోగదారులు ఇప్పుడు అధిక సేఫ్టీ ఫీచర్లు కలిగిన కార్లకు ప్రధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, ఈ కారులోని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. దీనితో పాటు, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్స్ మొదలైన ఫీచర్లను కూడా జోడించనుంది.

Kia నుండి వస్తున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి Carens పేరు అర్థం ఏంటో తెలుసా..?

కియా సెల్టోస్ మాదిరిగానే కియా కారెన్స్ ఎమ్‌పివిని కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో బహుళ కాన్ఫిగరేషన్లలో అందించనున్నారు. గేర్‌బాక్స్ విషయంలో కూడా మ్యాన్యువల్, ఆటోమేటిక్ మరియు ఐఎమ్‌టి వంటి ఆప్షన్లను ఆశించవచ్చు. ప్రస్తుతానికి, ఈ ఎమ్‌పివిలో ఉపయోగించబోయే ఇంజన్ల గురించి ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ, సెల్టోస్ ఎస్‌యూవీలో అందిస్తున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఇందులో ఉపయోగించవచ్చని తెలుస్తోంది.

Kia నుండి వస్తున్న కొత్త 7-సీటర్ ఎమ్‌పివి Carens పేరు అర్థం ఏంటో తెలుసా..?

భారతదేశంలోని చిన్న నగరాల్లో కూడా కియా కార్లకు డిమాండ్ పెరుగుతోందని కంపెనీ ఇటీవల తెలిపింది. తదనుగుణంగా కంపెనీ చిన్న నగరాల్లో కూడా తన ఉనికిని విస్తరించడంపై మరిన్ని నిధులను వెచ్చించనుంది. కియా కారెన్స్ ఈ విభాగంలో టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎక్స్ఎల్6, ఎర్టిగా, హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎమ్‌జి హెక్టర్ ప్లస్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Kia india s new 7 seater mpv carens name meaning design features engine and specs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X