'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'గా పేరు మార్చుకున్న కియా మోటార్స్

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్ కేంద్రంగా పనిచేస్తున్న కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇండియా ఇకపై తమ సంస్థ పేరును 'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' (కెఐపిఎల్)గా మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. కొంతకాలం క్రితం, కియా ప్రపంచ వ్యాప్తంగా తమ కార్ల కోసం కొత్త లోగోను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.

'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'గా పేరు మార్చుకున్న కియా మోటార్స్

భారతదేశంలో కూడా కొత్త కియా లోగోతో కూడిన కార్లు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. కంపెనీ ఇటీవలే కొత్త లోగోలతో కూడిన రిఫ్రెష్డ్ కియా సోనెట్ మరియు కియా సెల్టోస్ కార్లను మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటి వరకూ 'కియా మోటార్స్ ఇండియా'గా ఉన్న ఈ కంపెనీ, ఇప్పుడు అధికారికంగా తన కార్పొరేట్ పేరును 'కియా ఇండియా'గా మార్చుకుంది.

'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'గా పేరు మార్చుకున్న కియా మోటార్స్

ఇదివరకటి కియా మోటార్స్ అనే పేరు నుండి కంపెనీ 'మోటార్స్' అనే పదాలను తొలగించింది మరియు ఇకపై 'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద కార్ బ్రాండ్లలో కియా కూడా ఒకటి, ప్రపంట వ్యాప్తంగా కియా ఎన్నో అద్భుతమైన కార్లను విక్రయిస్తోంది.

MOST READ:కస్టమైజ్ ఫోర్డ్ పిక్-అప్ ట్రక్కు డ్రైవ్ చేస్తూ కనిపించిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' [వీడియో]

'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'గా పేరు మార్చుకున్న కియా మోటార్స్

ప్రస్తుతం భారత మార్కెట్లో కియా మూడు మోడళ్లను (సోనెట్, సెల్టోస్, కార్నివాల్) విక్రయిస్తోంది. కియా ఇండియా 2018లో తొలిసారిగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. కియా ఇండియా సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఓ తయారీ కేంద్రం ఉంది మరియు దేశవ్యాప్తంగా సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'గా పేరు మార్చుకున్న కియా మోటార్స్

కియా 2018లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కియా ఎస్‌పి అనే కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. అదే మిడ్-సైజ్ ఎస్‌యూవీని 2019 ఆగస్టులో కియా సెల్టోస్ పేరుతో కంపెనీ ఇక్కడి మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ, ఈ విభాగంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది.

MOST READ:కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?

'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'గా పేరు మార్చుకున్న కియా మోటార్స్

కియా సెల్టోస్ ఎస్‌యూవీ తర్వాత కంపెనీ తమ కార్నివాల్ ఎమ్‌పివిని మరియు సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతదేశంలో ప్రారంభించింది. ఈ వాహనాలు భారత మార్కెట్లో మంచి ఆదరణను పొందాయి. మోడ్రన్ డిజైన్, విశిష్టమైన ఫీచర్స్ మరియు విభిన్నమైన ఇంజన్ అండ్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో ఇవి అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.

'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'గా పేరు మార్చుకున్న కియా మోటార్స్

కియా ఇండియా ఇటీవలే తమ అప్‌గ్రేడెడ్ 2021 సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీ ఇప్పుడు కొత్త లోగో పాటుగా కొత్త ఫీచర్లతో కూడా వచ్చింది. అంతేకాకుండా, కియా ఈ మోడల్‌లో కొత్తగా రెండు టాప్-ఎండ్ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టింది.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?

'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'గా పేరు మార్చుకున్న కియా మోటార్స్

ఈ లేటెస్ట్ వెర్షన్ కియా సోనెట్ కోసం కంపెనీ అధికారిక ఉపకరణాల (యాక్ససరీస్) జాబితాను కూడా విడుదల చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం కంపెనీ కొత్త ఇంటీరియర్స్ మరియు ఎక్స్టీరియర్స్ యాక్ససరీలను పరిచయం చేసింది. వీటిలో మడ్‌ఫ్లాప్స్, బంపర్ ప్రొటెక్టర్లు, సైడ్-స్టెప్, డోర్ సిల్ గార్డ్, డోర్ స్ట్రైకర్ కవర్, విండో వైజర్, బ్లైండ్ స్పాట్ మిర్రర్ మరియు ప్రీమియం కార్ కవర్ మొదలైనవి ఉన్నాయి.

'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'గా పేరు మార్చుకున్న కియా మోటార్స్

కియా సోనెట్ ఎక్స్టీరియర్‌కు మరింత ప్రీమియం లుక్‌ని అందించడానికి కంపెనీ ఇందులో క్రోమ్ ప్యాక్‌ను విడుదల చేసింది. ఈ ప్యాక్‌లో హెడ్‌ల్యాంప్‌లు, టైల్‌ల్యాంప్‌లు, ఫాగ్ లాంప్స్, వీల్ ఆర్చెస్, సైడ్ మిర్రర్స్, సైడ్ బాడీ క్లాడింగ్, విండో బీడింగ్, డోర్ హ్యాండిల్ మరియు డోర్ హ్యాండిల్ వెల్స్, రియర్ రిఫ్లెక్టర్ మరియు సైడ్ ఫిన్‌ల కోసం క్రోమ్ గార్నిష్ యాక్ససరీలు ఉన్నాయి.

MOST READ:భారత్‌లో విడుదలైన 2021 జిఎల్‌ఎ & ఎఎమ్‌జి జిఎల్‌ఎ 35; ధర & వివరాలు

'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'గా పేరు మార్చుకున్న కియా మోటార్స్

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని బ్లాక్ లేదా సిల్వర్ కలర్ నంబర్ ప్లేట్ గార్నిష్‌తో కూడా అందిస్తున్నారు. ఇక ఇంటీరియర్ యాక్ససరీలను గమనిస్తే, కంపెనీ ఇందులో 3డి క్యాబిన్ మాట్స్, 3డి ట్రంక్ మ్యాట్, కార్పెట్ మ్యాట్, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్స్, డ్యూయల్ లేయర్ మ్యాట్, రియర్ విండ్‌షీల్డ్ సన్‌షేడ్, విండోస్ సన్‌షేడ్, హెడ్-రెస్ట్ కుషన్స్, కీ కవర్ మరియు వాక్యూమ్ క్లీనర్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Kia Motors India Now Becomes 'Kia India Private Limited', Name Change Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X