2021 సెప్టెంబర్ అమ్మకాల్లో Hyundai Creta మించిన Kia Seltos

ప్రముఖ కార్ల తయారీ సంస్థ Kia Motors (కియా మోటార్స్) భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇటీవల కంపెనీ యొక్క 2021 సెప్టెంబర్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం కంపెనీ గత నెలలో మొత్తం 14,441 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది. ఈ అమ్మకాలతో Kia కంపెనీ 7.8 % మార్కెట్ వాటాతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల తయారీదారులలో 4 వ స్థానంలో నిలిచింది.

2021 సెప్టెంబర్ అమ్మకాల్లో Hyundai Creta మించిన Kia Seltos

కంపెనీ యొక్క వార్షిక అమ్మకాల విషయంలో కూడా, ఈ సెప్టెంబర్‌లో 1.4 శాతం పెరిగినట్లు కంపెనీ నివేదికలు తెలిపాయి. ఎప్పటిలాగే, కంపెనీ యొక్క Kia Seltos (కియా సెల్టోస్) మంచి అమ్మకాలతో ముందంజలో నిలిచింది. గత నెలలో మొత్తం కియా సెల్టోస్ 9,583 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాలతో కియా సెల్టోస్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన SUV అయింది.

2021 సెప్టెంబర్ అమ్మకాల్లో Hyundai Creta మించిన Kia Seltos

అంతే కాకుండా సెప్టెంబర్ 2021 నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన SUV గా పేరుగాంచిన Hyundai Creta (హ్యుందాయ్ క్రెటా) ను కూడా కియా సెల్టోస్ అధిగమించగలిగింది. మొత్తానికి కియా మోటార్స్ అమ్మకాలకు కియా సెల్టోస్ చాలా ఉపయోగపడింది.

2021 సెప్టెంబర్ అమ్మకాల్లో Hyundai Creta మించిన Kia Seltos

కియా సెల్టోస్ మాత్రమే కాకుండా కంపెనీ యొక్క కియా సోనెట్ సబ్-కాంపాక్ట్ SUV మరియు కియా కార్నివాల్ ప్రీమియం MPV కూడా మంచి సంఖ్యలను అమ్ముడయ్యాయి. గత నెలలో కంపెనీ కియా సొనెట్ ను మొత్తం 4,454 యూనిట్లను విక్రయించగా, మరోవైపు, కియా కార్నివాల్ 404 యూనిట్ల ఎంపివిలను విక్రయించింది.

2021 సెప్టెంబర్ అమ్మకాల్లో Hyundai Creta మించిన Kia Seltos

కియా ఇండియా ప్రస్తుతం 25 వ నెల అమ్మకాల కార్యకలాపాలలో ఉందని మరియు ఇప్పటికే దేశంలో 3.3 లక్షల కియా కార్లను విక్రయించిందని కంపెనీ తెలిపింది. ఇటీవల, కియా సోనెట్ భారతదేశంలో ఒక లక్ష యూనిట్లను విక్రయించే పెద్ద మైలురాయిని కూడా సాధించింది.

2021 సెప్టెంబర్ అమ్మకాల్లో Hyundai Creta మించిన Kia Seltos

ఈ నెల ప్రారంభంలో, కంపెనీ కియా కార్నివాల్ ప్రీమియం MPV ని కూడా అప్‌డేట్ చేసింది. కావున ఈ MPV ఇప్పుడు మార్కెట్‌లో నాలుగు ట్రిమ్ లెవల్స్‌లో అమ్ముడవుతోంది. ఇందుల ప్రీమియం, ప్రెస్టీజ్, లిమోసిన్ మరియు లిమోసిన్ ప్లస్ అనే వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి.

2021 సెప్టెంబర్ అమ్మకాల్లో Hyundai Creta మించిన Kia Seltos

కొత్త కియా కార్నివాల్ MPV ధర విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ. 24.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ MPV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటంతో పాటు వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

2021 సెప్టెంబర్ అమ్మకాల్లో Hyundai Creta మించిన Kia Seltos

కంపెనీ యొక్క సెప్టెంబర్ 2021 అమ్మకాల గురించి మాట్లాడుతూ, కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్, దేశీయ మార్కెట్లో మా ఉత్పత్తులపై ప్రజలకున్న నమ్మకం వల్ల మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాము, అంతే కాకుండా, కంపెనీ యాజమాన్యం కూడా దీనికి ఎంతగానో కృషి చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్స్ కొరత ఉన్నప్పటికీ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నామన్నారు.

2021 సెప్టెంబర్ అమ్మకాల్లో Hyundai Creta మించిన Kia Seltos

భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమయ్యింది, ఈ సమయంలో సెమీకండక్టర్ల కొరత ఉత్పత్తులపై కొంత వరకు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. మా వాహనాల వెయిటింగ్ పీరియడ్‌ను ఆప్టిమైజ్ చేయడానికి మరియు నియంత్రణలో ఉంచడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా అన్నారు.

2021 సెప్టెంబర్ అమ్మకాల్లో Hyundai Creta మించిన Kia Seltos

ఆటో మొబైల్ పరిశ్రమకు ఈ పండుగ సీజన్ చాలా కీలకమైనది, ఎందుకంటే దురాష్టమి మరియు దీపావళి సందర్భంగా ఎక్కువమంది కొత్త వాహనాలను కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపుతారు. కావున కంపెనీలు ఎక్కువ సంఖ్యలో అమ్మకాలను జరపడానికి అనుకూలంగా ఉంటుంది. అమ్మకాలను పెంచటానికి చాల కంపెనీలు మంచి ఆఫర్స్ కూడా అందిస్తున్నాయి.

2021 సెప్టెంబర్ అమ్మకాల్లో Hyundai Creta మించిన Kia Seltos

Kia India తమ కొత్త Kia Seltos X Line ట్రిమ్ ను భారత మార్కెట్లో ఇటీవల అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త వేరియంట్ ను రూ. 17.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విక్రయించనుంది. ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ లో కంపెనీ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను అందిస్తుంది.

Kia Seltos X Line వేరియంట్ ను రెండు ఇంజిన్ ఆప్షన్‌లలో అందిస్తున్నారు. ఇందులో మొదటిది 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. దీని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి శక్తిని మరియు డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి మరియు డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Kia motors india sales september 14441 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X