కియా కార్నివాల్ కన్నా చవకైన ఎమ్‌పివి వస్తోంది; బహుశా ఇది సెల్టోస్ 7-సీటరా?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఇటీవలి కాలంలో ఎస్‌యూవీలు, ఎమ్‌పివిల వంటి యుటిలిటీ వాహనాలకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో, దేశంలోని అన్ని కార్ కంపెనీలు ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి అధునాతన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి.

కియా కార్నివాల్ కన్నా చవకైన ఎమ్‌పివి వస్తోంది; బహుశా ఇది సెల్టోస్ 7-సీటరా?

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ కూడా ప్రస్తుతానికి తమ దృష్టంతా ఎస్‌యూవీలు, ఎమ్‌పివిలపైనే ఉందని గతంలో స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే, కియా మోటార్స్ ఇప్పుడు మరో సరికొత్త ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే, ఈ కొత్త ఎమ్‌పివి టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కింది.

కియా కార్నివాల్ కన్నా చవకైన ఎమ్‌పివి వస్తోంది; బహుశా ఇది సెల్టోస్ 7-సీటరా?

ఈ స్పై చిత్రాలను క్షణ్ణంగా పరిశీలిస్తే, కియా సెల్టోస్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ కొత్త ఎమ్‌పివిని అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కియా నుండి రానున్న ఈ సరికొత్త ఎమ్‌పివి, భారత మార్కెట్లో ఈ బ్రాండ్ యొక్క నాల్గవ మోడల్ కానుంది. కియా మోటార్స్ ఇప్పటికే సోనెట్, సెల్టోస్ మరియు కార్నివాల్ మోడళ్లను విక్రయిస్తోంది.

కియా కార్నివాల్ కన్నా చవకైన ఎమ్‌పివి వస్తోంది; బహుశా ఇది సెల్టోస్ 7-సీటరా?

కియా మోటార్స్ ఇప్పటికే కార్నివాల్ అనే ప్రీమియం ఎమ్‌పివిని విక్రయిస్తోంది. అయితే, ధర పరంగా ఈ మోడల్ చాలా ఖరీదైనది. ఈ నేపథ్యంలో, కంపెనీ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండేలా ఈ కొత్త ఎమ్‌పివిని డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. భారత మార్కెట్లో 7-సీటర్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌‌ను పరిగణలోకి తీసుకొని కంపెనీ ఈ కొత్త ఎమ్‌పివిని త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

కియా కార్నివాల్ కన్నా చవకైన ఎమ్‌పివి వస్తోంది; బహుశా ఇది సెల్టోస్ 7-సీటరా?

తాజా నివేదికల ప్రకారం, టెస్టింగ్ దశలో ఉన్న ఈ కొత్త కియా ఎమ్‌పివికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఎమ్‌పివి పొడవు 4.5 మీటర్లు ఉంటుందని, ఇది స్టాండర్డ్ ఎమ్‌పివి పరిమాణం అని చెబుతున్నారు. భారతదేశంలో, ఈ కొత్త కియా ఎమ్‌పివి మారుతి సుజుకి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా మరియు మహీంద్రా మరాజో వంటి ఎమ్‌పివిలతో పోటీ పడగలదు.

కియా కార్నివాల్ కన్నా చవకైన ఎమ్‌పివి వస్తోంది; బహుశా ఇది సెల్టోస్ 7-సీటరా?

కొత్త కియా ఎమ్‌పివి 6-సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ కారు టెస్టింగ్ మోడల్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, 5-స్పోక్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కారులో చాలా చోట్ల క్రోమ్ ఎలిమెంట్స్ కూడా ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి, ఈ కారుకి సంబంధించిన సమాచారం చాలా పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉంది.

కియా కార్నివాల్ కన్నా చవకైన ఎమ్‌పివి వస్తోంది; బహుశా ఇది సెల్టోస్ 7-సీటరా?

మీడియా నివేదికల ప్రకారం, సెల్టోస్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లనే ఈ కొత్త కియా ఎమ్‌పివిలోనూ ఉపయోగించవచ్చని సమాచారం. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 114 బిహెచ్‌పి శక్తిని మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 114 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కియా కార్నివాల్ కన్నా చవకైన ఎమ్‌పివి వస్తోంది; బహుశా ఇది సెల్టోస్ 7-సీటరా?

పెర్ఫార్మెన్స్ ప్రియుల కోసం కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా అందించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్‌పి పవర్ మరియు 192 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుందని అంచనా.

కియా కార్నివాల్ కన్నా చవకైన ఎమ్‌పివి వస్తోంది; బహుశా ఇది సెల్టోస్ 7-సీటరా?

కియా మోటార్స్ ఈ కొత్త ఎమ్‌పివిని కేవలం భారత మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కియా ఈ ఎమ్‌పివిని భారత మార్కెట్లో ప్రతి సంవత్సరం 50,000 యూనిట్లను మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ఏటా 26,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యం పెట్టుకుంది.

కియా కార్నివాల్ కన్నా చవకైన ఎమ్‌పివి వస్తోంది; బహుశా ఇది సెల్టోస్ 7-సీటరా?

కియా సెల్టోస్ మాదిరిగానే ఈ కొత్త కియా ఎమ్‌పివిని కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనంతపురం ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంటు యొక్క వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల యూనిట్లు. కియా ఈ ఎమ్‌పివికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఏడాది చివరి నాటికి వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఇది భారత మార్కెట్లో విడుదలవుతుందని అంచనా.

Source: Rushlane

More from DriveSpark

Article Published On: Tuesday, April 6, 2021, 14:38 [IST]
English summary
Kia Motor's New MPV Spied Testing, Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+