Kia Seltos HTE బేస్ వేరియంట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు మైలేజ్

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ (Kia Motors) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కియా సెల్టోస్ (Kia Seltos) మొత్తం నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో HTE అనేది దాని బేస్ వేరియంట్ మరియు ఈ వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Kia Seltos HTE బేస్ వేరియంట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు మైలేజ్

మరి ఈ కియా సెల్టోస్ హెచ్‌టిఇ (Kia Seltos HTE) బేస్ వేరియంట్ యొక్క ధర, లభించే ఫీచర్లు, దాని ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ వివరాలు అలాగే మైలేజ్ మొదలైన వాటి గురించి పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Kia Seltos HTE బేస్ వేరియంట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు మైలేజ్

కియా సెల్టోస్ HTE ధర

  • Kia Seltos HTE పెట్రోల్ - రూ. 9.95 లక్షలు
  • Kia Seltos HTE డీజిల్ - రూ. 10.65 లక్షలు
  • ఈ వేరియంట్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది.

    Kia Seltos HTE బేస్ వేరియంట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు మైలేజ్

    Kia Seltos HTE ఫీచర్లు

    • ప్రొజెక్టర్ హెడ్‌లైట్
    • షార్క్ ఫిన్ యాంటెన్నా
    • స్కిడ్ ప్లేట్
    • సింగిల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
    • రియర్ ఏసి వెంట్స్
    • ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు
    • టిల్ట్ పవర్ స్టీరింగ్ వీల్
    • కీలెస్ ఎంట్రీ
    • సెంట్రల్ లాకింగ్
    • స్టీరింగ్ మౌంటెడ్ బటన్స్
    • సన్ గ్లాసెస్ హోల్డర్
    • డబుల్ డిన్ ఆడియో, బ్లూటూత్‌ కనెక్టివిటీ
    • USB ఛార్జర్
    • పవర్ విండోస్
    • 16 ఇంచ్ స్టీల్ వీల్
    • Kia Seltos HTE బేస్ వేరియంట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు మైలేజ్

      Kia Seltos HTE సేఫ్టీ ఫీచర్లు

      • ఈబిడితో కూడిన ఏబిఎస్
      • డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు
      • ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేకులు
      • రియర్ పార్కింగ్ సెన్సార్
      • ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్
      • స్పీడ్ సెన్సార్
      • Kia Seltos HTE బేస్ వేరియంట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు మైలేజ్

        Kia Seltos HTE ఇంజన్ ఆప్షన్లు

        కియా సెల్టోస్ హెచ్‌టిఇ బేస్ వేరియంట్ రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1498 సిసి పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1493 సిసి డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తాయి. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండదు.

        Kia Seltos HTE బేస్ వేరియంట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు మైలేజ్

        Kia Seltos HTE మైలేజ్

        మైలేజ్ విషయానికి వస్తే, ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 16.8 kmpl మైలేజీని అందిస్తుంది. అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ 20.8 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా 50 లీటర్ల ఇంధన ట్యాంక్ తో లభిస్తాయి. కాబట్టి, ఫుల్ ట్యాంక్‌ సాయంతో ఈ కారులో సుమారు 400 కిమీ నుండి 500 కిమీ దూరం సులభంగా ప్రయాణించవచ్చు.

        Kia Seltos HTE బేస్ వేరియంట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు మైలేజ్

        Kia Seltos HTE కలర్ ఆప్షన్లు

        ఈ ఎస్‌యూవీ మొత్తం 8 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అవి:

        • ఇంటెన్స్ రెడ్
        • అరోరా బ్లాక్ పెరల్
        • గ్లాసీయర్ వైట్ పెరల్
        • పంచీ ఆరెంజ్
        • ఇంటెలిజెంట్ బ్లూ
        • గ్రావిటీ గ్రే
        • స్టీల్ సిల్వర్
        • క్లియర్ వైట్
        • Kia Seltos HTE బేస్ వేరియంట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు మైలేజ్

          Kia Seltos HTE వీల్స్, బ్రేక్స్ మరియు సైజ్

          కియా సెల్టోస్ హెచ్‌టిఇ బేస్ వేరియంట్ 205/65 R16 స్టీల్ చక్రాలను కలిగి ఉంటుంది. దీని స్పేర్ వీల్ కూడా 205/65 R16 గానే ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక భాగాల్లో డ్రమ్ / డిస్క్ బ్రేక్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. ఈ ఎస్‌యూవీ పొడవు 4315 మిమీ, వెడల్పు 1800 మిమీ, ఎత్తు 1645 మిమీ మరియు వీల్‌బేస్ 2610 మిమీ గా ఉంటుంది.

          Kia Seltos HTE బేస్ వేరియంట్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు మైలేజ్

          డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

          కియా సెల్టోస్ హెచ్‌టిఇ (Kia Seltos HTE) బేస్ వేరియంట్ ఒక కారులో అవసరమైన అన్ని బేసిక్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఒకవేళ, మీరు ఈ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకుంటే, మీరు మిడ్ లేదా టాప్-ఎండ్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. మా సలహా ఏమిటంటే, ఇందులో హెచ్‌టిఎక్స్ వేరియంట్ ఉత్తమమైనది. ఇది ధరకు తగిన విలువను కలిగి ఉండి, అన్ని లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Kia seltos hte base variant price specs features and mileage
Story first published: Saturday, October 16, 2021, 17:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X