Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (గతంలో కియా మోటార్స్), దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైడ్ ఎస్‌యూవీ కియా సెల్టోస్ (Kia Seltos) వేరియంట్ లైనప్ లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, Kia Seltos HTK+ వేరియంట్ లో అందిస్తున్న iMT (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్ ను ఇకపై Kia Seltos HTK వేరియంట్ లో కూడా అందిచాలని కంపెనీ భావిస్తోంది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

కియా నుండి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ లో సెల్టోస్ అగ్రస్థానంలో ఉంది. గడచిన అక్టోబర్ 2021 నెలలో కూడా దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాలో కియా సెల్టోస్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆగస్ట్ 2019 లో తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన కియా సెల్టోస్, అప్పటి నుండి ఇప్పటి వరకూ స్థిరమైన నెలవారీ అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

భారత మార్కెట్లో కియా సెల్టోస్ గొప్ప విజయాన్ని సాధించిడానికి ప్రధాన కారణాలు, దాని విస్తృత శ్రేణి వేరియంట్లు, వివిధ రకాల ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లే అని చెప్పవచ్చు. కస్టమర్ అవసరాలను బట్టి ఇవి వివిధ రకాల ఫీచర్లు మరియు ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీని కొనడానికి వచ్చే కస్టమర్‌లు ఎంచుకోవడానికి అనేక ఆప్షన్లు ఉన్నాయి.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

అయితే, మార్కెట్లో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు మరియు ఎస్‌యూవీ సెగ్మెంట్లో కియా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు, సెల్టోస్ డీజిల్ వేరియంట్లలో కూడా ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్ ను అందించాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ కొత్త వేరియంట్ మార్కెట్లో విడుదల్యే అవకాశం ఉంది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

సమాచారం ప్రకారం, కియా సెల్టోస్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ తో iMT గేర్‌బాక్స్ ఆప్షన్ ను పరిచయం చేయనుంది. అయితే, ఇది మార్కెట్లోకి రావాలంటే, ముందు కొత్త తరం కార్నివాల్ ఎమ్‌పివి విడుదల కావాలి. ఆ తర్వాతనే ఈ డీజిల్ ఐఎమ్‌టి సెల్టోస్ మార్కెట్లోకి రావచ్చని అంచనా. కొత్త వెర్షన్ కియా కార్నివాల్ ఎమ్‌పివి జనవరి లేదా ఫిబ్రవరి 2022లో విడుదల కావచ్చని సమాచారం.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

ప్రస్తుతం, కియా సెల్టోస్ యొక్క డీజిల్ వేరియంట్‌లు 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా, ఇందులో కొత్తగా రాబోయే iMT గేర్‌బాక్స్ డీజిల్ వెర్షన్ సెల్టోస్, ఎక్కువ మందిని ఆకర్షించడంలో సహాయపడగలదని కంపెనీ భావిస్తోంది. అయితే, ఈ రాబోయే కాంబినేషన్ (డీజిల్ ఇంజన్ + ఐఎమ్‌టి) ఈ ఎస్‌యూవీ యొక్క ఏ వేరియంట్‌లో అందించబడుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

కియా సెల్టోస్ పెట్రోల్ iMT వేరియంట్ మాదిరిగానే, ఇది కూడా HTK+ మోడల్‌తో అందించబడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుత స్టాండర్డ్ డీజిల్ మాన్యువల్ వేరియంట్ కంటే దాదాపు రూ. 50,000 ఎక్కువగా ఉంటుందని అంచనా.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

iMT (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్ అంటే ఏమిటి?

కియా మోటార్స్ అందిస్తున్న iMT (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్ అనేది ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యొక్క సౌకర్యాన్ని మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇదొక క్లచ్ లేని మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (Clutchless Manual Gearbox). ఐఎమ్‌టి గేర్‌బాక్స్ ఉన్న కారులో రెండు పెడల్స్ (బ్రేక్, యాక్సిలరేటర్) మాత్రమే ఉంటాయి.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

ఈ గేర్‌బాక్స్ వ్యవస్థలో గేర్ లివర్ చూడటానికి 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాదిరిగానే ఉంటుంది. ఈ సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌లో ఎలక్ట్రో-మెకానికల్ యాక్చుయేటెడ్ క్లచ్ ఉంటుంది మరియు ఇదే క్లచ్ వ్యవస్థను ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తుంది.. డ్రైవర్ గేరు మార్చాలని ప్రయత్నించిన ప్రతిసారి, క్లచ్ సాయం లేకుండానే నేరుగా గేరు మార్చవచ్చు. ఇది కారు ప్రయాణించే వేగాన్ని బట్టి ఇ్బబందులు లేని గేర్‌షిఫ్ట్‌ అనుభూతిని అందిస్తుంది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

ఐఎమ్‌టి గేర్‌బాక్స్ (iMT Transmission) వ్యవస్థను తొలిసారిగా హ్యుందాయ్ తమ వెన్యూ (Venue) కారులో పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ ఫీచర్ ను కియా సోనెట్ మరియు పెట్రోల్ వెర్షన్ కియా సెల్టోస్ కార్లలో పరిచయం చేశారు. ఇప్పుడు కొత్తగా దీనిని సెల్టోస్ డీజిల్ ఇంజన్ తో కూడా పరిచయం చేయవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్ లో గేర్‌బాక్స్ మార్పు మినహా వేరే ఏ ఇతర మార్పులు ఉండబోవని సమాచారం.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

ప్రస్తుతం, కియా సెల్టోస్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో 6 స్పీడ్ మాన్యువల్, సివిటి ఆటోమేటిక్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఇంజన్ ఆప్షన్లలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ (114 bhp, 250 Nm), 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ (114 bhp, 144 Nm) మరియు 1.4 లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజన్‌ (138 bhp, 242 Nm) ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

కియా సెల్టోస్ టాప్ ఎండ్ వేరియంట్లలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, కియా యొక్క లేటెస్ట్ UVO కనెక్టెడ్ టెక్నాలజీ, 8 స్పీకర్లతో కూడిన బోస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్; త్వరలోనే విడుదల

ఇంకా ఇందులో ఆటోమేటిక్ స్టార్ట్ / స్టార్ట్ పుష్ బటన్, రియర్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ మోడ్‌లు, డ్రైవ్ మోడ్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు మరెన్నో ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూస్తే, ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), బ్రేక్ అసిస్ట్ మరియు హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC) వంటి ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 6, 2021, 14:42 [IST]
English summary
Kia seltos htx variant to get imt gearbox option launch expected soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+