Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (గతంలో Kia Motors) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్ (Kia Sonet) మొత్తం నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో HTE అనేది దాని బేస్ వేరియంట్ మరియు ఈ వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

కియా సోనెట్ జిటి మరియు టెక్ ట్రిమ్ లలో అందుబాటులో ఉంటుంది. మరి ఈ కియా సోనెట్ (Kia Sonet HTE) బేస్ వేరియంట్ యొక్క ధర, లభించే ఫీచర్లు, దాని ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ వివరాలు అలాగే మైలేజ్ మొదలైన వాటి గురించి పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

కియా సోనెట్ HTE ధరలు (ఎక్స్-షోరూమ్)

  • Kia Sonet HTE పెట్రోల్ - రూ. 6.87 లక్షలు
  • Kia Sonet HTE డీజిల్ - రూ. 8.51 లక్షలు
  • ఈ వేరియంట్లు పెట్రోల్ వెర్షన్ లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు డీజిల్ వెర్షన్ లో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ బేస్ వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లభించదు.

    Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

    Kia Sonet HTE ఫీచర్లు

    • హాలోజన్ హెడ్‌లైట్ మరియు హార్ట్ బీట్ టెయిల్ లైట్
    • షార్క్ ఫిన్ యాంటెన్నా
    • స్కిడ్ ప్లేట్
    • మాన్యువల్ ఎయిర్ కండీషనర్
    • టిల్ట్ స్టీరింగ్
    • ముందు డోర్లపై మాత్రమే పవర్ విండోస్
    • సెంట్రల్ లాకింగ్
    • మోనో కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
    • ముందు మరియు వెనుక స్కిడ్ ప్లేట్స్
    • టైగర్ నోస్ గ్రిల్
    • Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

      Kia Sonet HTE సేఫ్టీ ఫీచర్లు

      • ఈబిడితో కూడిన ఏబిఎస్
      • డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు
      • ఫ్రంట్ డిస్క్ బ్రేకులు
      • రియర్ పార్కింగ్ సెన్సార్
      • ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్
      • స్పీడ్ సెన్సార్
      • Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

        Kia Sonet HTE ఇంజన్ ఆప్షన్లు

        కియా సోనెట్ హెచ్‌టిఇ బేస్ వేరియంట్ రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మొదటిది 1197 సిసి పెట్రోల్ ఇంజన్ 83 బిహెచ్‌పి పవర్ ను మరియు 115 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

        Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

        ఇకపోతే, ఇందులోని రెండవ ఇంజన్ ఆప్షన్ 1493 సిసి డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలో కూడా ఇదే ఇంజన్ ను ఉపయోగించారు. ఈ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. కాగా, బేస్ వేరియంట్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లు రెండింటిలోనూ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లభించదు.

        Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

        Kia Sonet HTE మైలేజ్

        ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో లీటరుకు 18.4 కిమీ మైలేజీని అందిస్తుంది. అలాగే, ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో లీటరుకు 24.1 కిమీ మైలేజీని ఇస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా 45 లీటర్ల ఇంధన ట్యాంక్ తో లభిస్తాయి. కాబట్టి, ఫుల్ ట్యాంక్‌ సాయంతో ఈ కారులో సుమారు 400 కిమీ నుండి 500 కిమీ దూరం సులభంగా ప్రయాణించవచ్చు.

        Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

        Kia Sonet HTE కలర్ ఆప్షన్లు

        కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మొత్తం 8 కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. అవి:

        • ఇంటెన్స్ రెడ్
        • బేజ్ గోల్డ్
        • అరోరా బ్లాక్ పెరల్
        • గ్రావిటీ గ్రే
        • స్టీల్ సిల్వర్
        • ఇంటెలిజెంట్ బ్లూ
        • గ్లాసీయర్ వైట్ పెరల్
        • క్లియర్ వైట్
        • Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

          Kia Sonet HTE వీల్స్, బ్రేక్స్ మరియు సైజ్

          కియా సోనెట్ హెచ్‌టిఇ బేస్ వేరియంట్ 195/65 R15 స్టీల్ చక్రాలను కలిగి ఉంటుంది. దీని స్పేర్ వీల్ కూడా 195/65 R15 మాదిరిగానే ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక భాగాల్లో డ్రమ్ / డిస్క్ బ్రేక్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. ఈ ఎస్‌యూవీ పొడవు 3995 మిమీ, వెడల్పు 1790 మిమీ, ఎత్తు 1642 మిమీ మరియు వీల్‌బేస్ 2610 మిమీ గా ఉంటుంది.

          Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

          డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

          కియా సోనెట్ హెచ్‌టిఇ (Kia Sonet HTE) బేస్ వేరియంట్ ఒక కారులో అవసరమైన అన్ని బేసిక్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఒకవేళ, మీరు ఈ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకుంటే, మీరు మిడ్ లేదా టాప్-ఎండ్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. మా సలహా ఏమిటంటే, ఇందులో హెచ్‌టిఎక్స్ వేరియంట్ ఉత్తమమైనది. ఇది ధరకు తగిన విలువను కలిగి ఉండి, అన్ని లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

          Kia Sonet HTE బేస్ వేరియంట్ కొనొచ్చా? దీని ధరెంత మరియు లభించే ఫీచర్లు ఏవి?

          భారత మార్కెట్లో ఆటోమొబైల్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, October 18, 2021, 10:21 [IST]
English summary
Kia sonet hte base variant price specs features and mileage details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+