భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ..!

ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ లెక్సస్, తన సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కారు లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ లిమిటెడ్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ధర దేశీయ మార్కెట్లో అక్షరాలా 2.15 కోట్ల రూపాయలు (ఎక్స్-షోరూమ్). లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ ఒక హైబ్రిడ్ కారు, ఇది పెట్రోల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌లను కూడా ఉపయోగిస్తుంది.

భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

సాధారణంగా ఈ లగ్జరీ కారు గత ఏడాది లాంచ్ చేయాలి. కానీ కరోనా మహమ్మారి కారణంగా లాంచ్ కాస్త వాయిదాపడింది. ఏదై ఏమైనా ఇప్పుడు భారత మార్కెట్లో ఈ సూపర్ లగ్జరీ కారు అడుగుపెట్టింది. కొత్త లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ కారు ఇండియన్ మార్కెట్లో జాగ్వార్ ఎఫ్ పేస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ జెడ్ 4 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ లిమిటెడ్ ఎడిషన్‌లో హైబ్రిడ్ ఇంజన్ ఉంది. ఈ కారు 3.5-లీటర్ అట్కిన్సన్ 6-వాల్వ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 354 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉన్న హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటారు 177 బిహెచ్‌పి అదనపు శక్తిని అందిస్తుంది, ఈ కారుకు మొత్తం 359 బిహెచ్‌పి మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఇది 10-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్ కి జతచేయబడుతుంది.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ కొనుగోలు చేసిన సినీ నటి భావన

భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ లిమిటెడ్ ఎడిషన్ రూపకల్పన లెక్సస్ ఎల్ఎఫ్ఏ స్పోర్ట్స్ కారు నుండి ప్రేరణ పొందింది, అయితే కారు ముందు, వెనుక మరియు వాహన రూపకల్పన సెడాన్ కారు మాదిరిగానే ఉంటుంది. కారు యొక్క షార్ప్ టైర్-డ్రాప్ హెడ్‌ల్యాంప్, షార్ప్ టైల్ లైట్స్, పెద్ద గ్రిల్, రూప్-టాప్ మరియు చిన్న బూట్లు దీనికి గొప్ప స్పోర్ట్స్ కారు రూపాన్ని ఇస్తాయి.

భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ కారు కేవలం 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి100 కిమీ వరకు వేగవంతం కాగలదని లెక్సస్ పేర్కొంది. ఈ కారు ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో లెదర్ డాష్‌బోర్డ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు హెచ్‌విఎసి కంట్రోల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల మంచి లగ్జరీ స్పోర్ట్స్ కారులా అనిపిస్తుంది.

MOST READ:ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

ఈ కారు నిర్మాణం అల్యూమినియం, స్టీల్ మరియు కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడింది. కావున చాలా బలంగా ఉంటుంది. లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ బరువు 2 టన్నుల వరకు ఉంటుంది. లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ భారతదేశంలో మొట్టమొదటి పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కారు అవుతుంది.

భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

దీని గురించి లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ఈ కారు ఇతర స్పోర్ట్స్ కార్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కారుకు ఏవియేషన్ డిజైన్ ఇవ్వబడింది. కావున ఇది చూడటానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కారులో కంపెనీ చాలా క్వాలిటీ మెటీరియల్స్ తో తయారుచేసింది, కావున ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. స్పోర్ట్స్ కార్లను ఎక్కువగా ఇష్టపడే వారు తప్పకుండా ఈ లగ్జరీ లెక్సస్ ఎల్‌సి 500 హెచ్ ను ఇష్టపడతారు.

MOST READ:ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరూ చూడండి

Most Read Articles

English summary
Lexus LC 500H Limited Edition Launched In Indai. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X