ఏప్రిల్ నెలలో కొత్త కార్ల జాతర; సి5 ఎయిర్‌క్రాస్, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, ఆక్టేవియా

ఏప్రిల్ నెలలో కొత్త కార్ల జాతర ప్రారంభం కానుంది. వచ్చే నెలలో అనేక కొత్త మరియు అప్‌డేటెడ్ మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్, ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, కొత్త స్కొడా ఆక్టేవియా, ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్6 వంటి కొత్త మోడళ్లు వచ్చే నెలలో భారతదేశంలో విడుదల కానున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

ఏప్రిల్ నెలలో కొత్త కార్ల జాతర; సి5 ఎయిర్‌క్రాస్, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, ఆక్టేవియా

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ ఏప్రిల్ 7వ తేదీన భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కారు కోసం ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు ఈ కారును రూ.50,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. సిట్రోయెన్ బ్రాండ్‌కు సి5 ఎయిర్‌క్రాస్ భారత్‌లో మొట్టమొదటి మోడల్.

ఏప్రిల్ నెలలో కొత్త కార్ల జాతర; సి5 ఎయిర్‌క్రాస్, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, ఆక్టేవియా

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ ఏప్రిల్ 7, 2021వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ కారు కోసం ప్రీ-లాంచ్ బుకింగ్స్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల మెయింటినెన్స్ ప్యాకేజీని ఉచితంగా అందిస్తోంది. ఏప్రిల్ 6వ తేదీ వరకు వచ్చే బుకింగ్స్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

MOST READ:భారతమార్కెట్లో 2021 మార్చి నెలలో విడుదలైన కార్లు; పూర్తి వివరాలు

ఏప్రిల్ నెలలో కొత్త కార్ల జాతర; సి5 ఎయిర్‌క్రాస్, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, ఆక్టేవియా

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ గత ఏడాది మార్చి నెలలో భారత మార్కెట్లో విడుదలైంది. ఆ తర్వాతి కాలంలో దీని మొదటి బ్యాచ్ అమ్మకాలు పూర్తిగా అమ్ముడైపోయాయి. గత సెప్టెంబర్ కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్‌లను స్వీకరించడాన్ని నిలిపివేసింది. కానీ, ఇప్పుడు ఈ మోడల్ తిరిగి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కొత్త టి-రాక్ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.

ఏప్రిల్ నెలలో కొత్త కార్ల జాతర; సి5 ఎయిర్‌క్రాస్, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, ఆక్టేవియా

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్

కియా మోటార్స్ విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కియా సెల్టోస్‌లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కియా ఇప్పటికే కొత్త సెల్టోస్‌కి సంబంధించి ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఏప్రిల్ 27న కొత్త 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విడుదల కానుంది.

MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ

ఏప్రిల్ నెలలో కొత్త కార్ల జాతర; సి5 ఎయిర్‌క్రాస్, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, ఆక్టేవియా

కొత్త కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ రిఫ్రెష్డ్ డిజైన్‌తో పాటుగా అప్‌డేటెడ్ ఫీచర్లను మరియు సరికొత్త కియా మోటార్స్ కంపెనీ లోగోను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. భారత మార్కెట్లో కియా మోటార్స్ తమ సెల్టోస్ ఎస్‌యూవీని తొలిసారిగా 2019లో విడుదల చేశారు. ఈ మోడల్ మార్కెట్లోకి ప్రవేశించి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో, అప్‌డేటెడ్ కియా సెల్టోస్‌లో ఆసక్తికరమైన మార్పులను ఆశించవచ్చు.

ఏప్రిల్ నెలలో కొత్త కార్ల జాతర; సి5 ఎయిర్‌క్రాస్, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, ఆక్టేవియా

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో అందిస్తున్న ప్రీమియం సెడాన్ స్కొడా ఆక్టేవియాలో కొత్తగా 2021 మోడల్ మార్కెట్లోకి రానుంది. మార్కెట్ సమాచారం ప్రకారం, ఈ రిఫ్రెష్డ్ స్కొడా ఆక్టేవియా కూడా ఏప్రిల్ నెలలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అప్‌డేటెడ్ స్కొడా ఆక్టేవియా అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి ఉంది.

MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?

ఏప్రిల్ నెలలో కొత్త కార్ల జాతర; సి5 ఎయిర్‌క్రాస్, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, ఆక్టేవియా

ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్6

భారతదేశంలో కఠినతరం చేయబడిన కాలుష్య నిబంధనల నేపథ్యంలో ఇసుజు మోటార్స్ గత ఏడాది తమ పికప్ ట్రక్ డి-మాక్స్ వి-క్రాస్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్‌ను బిఎస్6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది.

ఏప్రిల్ నెలలో కొత్త కార్ల జాతర; సి5 ఎయిర్‌క్రాస్, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, ఆక్టేవియా

కొత్త 2021 ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ మోడల్ కూడా ఏప్రిల్ నెలలో మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే నెలాఖరు నాటికి ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి రావచ్చని సమాచారం. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది.

MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

Most Read Articles

English summary
List Of New Cars Launching In April 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X