ఐకానిక్ London Cab ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురానున్న LEVC

బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ లండన్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ (London Electric Vehicle Company -LEVC) తమ ఐకానిక్ 'లండన్ క్యాబ్' (London Cab) యొక్క లేటెస్ట్ వెర్షన్‌ ను త్వరలో భారతదేశానికి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఐకానిక్ London Cab ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురానున్న LEVC

భారతదేశంలో లండన్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ (LEVC TX) తమ మొదటి ఎలక్ట్రిక్ కారును ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ (Exclusive Motors) భాగస్వామ్యంతో ప్రారంభించనున్నట్లు తెలిపింది. లండన్ క్యాబ్ ఎలక్ట్రిక్ కారు త్వరలోనే దేశ రాజధాని న్యూఢిల్లీలోని డీలర్‌షిప్‌ లో అందుబాటులోకి రానుంది.

ఐకానిక్ London Cab ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురానున్న LEVC

LEVC TX అనేది బ్రిటీష్ రాజధాని లండన్ లో అంతర్భాగంగా మారిన బ్లాక్ క్యాబ్‌ ల వరుసలో (1902 సంవత్సరం వరకు విస్తరించి ఉంది) సరికొత్తది. ఈ కొత్త TX ఎలక్ట్రిక్ కారు ఐకానిక్ హాక్నీ (Hackney) క్యారేజ్ బాడీ స్టైల్ ను కలిగి ఉంటుది మరియు ఇది లండన్ వీధుల్లో సంచరించిన పాత కాలరు క్యాబ్ లను గుర్తు చేసేలా ఉంటుంది.

ఐకానిక్ London Cab ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురానున్న LEVC

అయితే, ఇది రెట్రో మోడ్రన్ డిజైన్ కలయికతో రూపుదిద్దుకుంది. చూడటానికి ఐకానికి కారులా కనిపిస్తూనే, మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్స్ మరియు ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఆధునిక కాలానికి తగినట్లుగా ఎల్ఈడి హెడ్‌లైట్ లు మరియు టెయిల్‌ లైట్లను కలిగి ఉంటుంది. ఇది ఐకానిక్ బ్లాక్ క్యాబ్ యొక్క ఓల్డ్ స్కూల్ రూపానికి మోడ్రన్ క్యారెక్టర్ ను జోడిస్తుంది.

ఐకానిక్ London Cab ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురానున్న LEVC

LEVC TX అనేది సున్నా-ఉద్గారాలను విడుదల చేసే ఓ ఎలక్ట్రి వాహనం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పెట్రోల్ లేదా డీజిల్ కార్లతో సమానమైన శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ ఈ కారులో ఉంటుంది. ఇందులో 149 బిహెచ్‌పిల శక్తిని మరియు 255 న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేసే సిమెన్స్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఈ కారులో ఉపయోగించారు.

ఐకానిక్ London Cab ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురానున్న LEVC

ఈ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా విడుదలయ్యే శక్తి వెనుక చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఎల్‌జి కెమికల్స్ (LG Chem) ద్వారా సరఫరా చేయబడిన 33 kW బ్యాటరీ ప్యాక్ సాయంతో ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 101 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు.

ఐకానిక్ London Cab ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురానున్న LEVC

ఈ బ్యాటరీ ప్యాక్ 22 kW AC మరియు 50 kW DC ఛార్జింగ్ ప్రమాణాలకు మద్దతు ఇస్తుంది. అయితే, అసలు విషయం ఏంటంటే, LEVC TX పూర్తిగా ఎలక్ట్రిక్ కారు కాదు. లండన్ బ్లాక్ క్యాబ్ ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు. అయితే, ఇది సాధారణ హైబ్రిడ్‌ కార్ల మాదిరిగా కాకుండా, TX దాని బ్యాటరీ ప్యాక్‌ను టాప్ అప్ చేయడం కోసం, ఇందులో ఉపయోగించిన వోల్వో (Volvo) బ్రాండ్ నుండి గ్రహించిన త్రీ సిలిండర్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్‌ ఇంజన్ ను జనరేటర్‌ గా ఉపయోగిస్తుంది.

ఐకానిక్ London Cab ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురానున్న LEVC

అంటే, ఈ పెట్రోల్ ఇంజన్ కేవలం జనరేటర్ మాదిరిగా మాత్రమే పనిచేస్తుంది. ఈ ఇంజన్ సాయంతో కారు నడవదు, కానీ కారులోని బ్యాటరీ ప్యాక్ మాత్రం చార్జ్ అవుతూ ఉంటుంది. అంటే, ఈ ఇంజన్ ఆన్ లో ఉన్నంత వరకూ కారులోని బ్యాటరీ ప్యాక్ చార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ టర్బో పెట్రోల్ జనరేటర్ (ఇంజన్) సహాయంతో, LEVC TX ఏకంగా 510 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది.

ఐకానిక్ London Cab ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురానున్న LEVC

లండన్ క్యాబ్ (LEVC TX) ఎలక్ట్రిక్ కారు 4,857 మిమీ పొడవు మరియు 1,874 మిమీ వెడల్పు కలిగిన ఎత్తయిన వాహనం. లండన్ బ్లాక్ క్యాబ్ యొక్క మొత్తం ఎత్తు 1,888 మిమీగా ఉంటుంది. కానీ, దీని వీల్‌బేస్ మాత్రం 2,986 మిమీ గా ఉంటుంది. ఈ వాహనం పెద్ద పరిమాణాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఇది కేవలం 8.45 మీటర్ల టర్నింగ్ సర్కిల్‌ను మాత్రమే ఉపయోగించుకుంటుంది.

ఐకానిక్ London Cab ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురానున్న LEVC

LEVC TX యొక్క పెద్ద వీల్‌బేస్ కారణంగా, వెనుక వైపు ప్రయాణీకుల కోసం ఎక్కువ క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. అంటే, ఈ కారులో వెనుకవైపు 6 మంది ప్రయాణికులు (ఎదురెదురుగా) సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. లండన్ క్యాబ్ వీల్ చైర్ వినియోగదారులకు కూడా సులభంగా యాక్సెస్ చేసుకునే వీలు కల్పిస్తుంది మరియు వెనుకవైపు ఉన్నవారి నుండి డ్రైవర్‌ ను వేరుచేయడం కోసం ప్రత్యేకమైన విభజనను కూడా కలిగి ఉంటుంది.

ఐకానిక్ London Cab ఎలక్ట్రిక్ కారును ఇండియాకు తీసుకురానున్న LEVC

భారతదేశంలో LEVC రాక గురించి హర్ మెజెస్టి యొక్క ట్రేడ్ కమీషనర్ అలాన్ గెమ్మెల్ (దక్షిణాసియా కోసం) మాట్లాడుతూ.. "LEVC యొక్క వినూత్న భవిష్యత్ మొబిలిటీ సొల్యూషన్స్ భారతదేశం యొక్క డైనమిక్ మరియు పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో అవకాశాలను స్వీకరించడం పట్ల నేను సంతోషిస్తున్నాను. యూకే మరియు భారతదేశాల మధ్య సంబంధాలు ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. మా వాణిజ్యం మరియు పెట్టుబడి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మరియు రెండు ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనాలను తీసుకురావడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది" అని అన్నారు.

Most Read Articles

English summary
London electric vehicle company to launch london cab in india soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X