2021 లో దేశీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లు.. వివరాలు

2021 సంవత్సరంలో కేవలం సాధారణ కార్లు మాత్రమే కాకుండా లగ్జరీ కార్లు కూడా దేశీయ మార్కెట్లో విడుదలయ్యాయి. ఇందులో స్పోర్ట్స్ కార్లు మరియు ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం ఈ ఆర్టికల్ లో ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్, మెర్సిడెస్ మేబ్యాక్ జిఎల్‌ఎస్ 600, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మరియు జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ వంటి లగ్జరీ కార్లను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

2021 లో దేశీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లు.. వివరాలు

ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ (Aston Martin DBX):

2021 లో భారతీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లలో ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ (Aston Martin DBX) ఒకటి. ఈ కంపెనీ తన మొదటి SUV ని భారతదేశానికి తీరాలకు తీసుకువచ్చింది. ఈ లగ్జరీ కారు ధర రూ. 3.82 కోట్లు (ఎక్స్-షోరూమ్). లగ్జరీ కార్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న సమయంలో కంపెనీ ఈ కారుని తీసుకువచ్చింది.

2021 లో దేశీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లు.. వివరాలు

ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ (Aston Martin DBX) 4.0 లీటర్, ట్విన్ టర్బో, వి8 ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 550 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 9 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 290 కిమీ వరకు ఉంటుంది.

2021 లో దేశీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లు.. వివరాలు

2021 మెర్సిడెస్ ఎస్-క్లాస్ (2021 Mercedes S-Class):

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ మార్కెట్లో తన కొత్త 2021 మెర్సిడెస్ ఎస్-క్లాస్ విడుదల చేసింది. ఈ లగ్జరీ కారు ధర రూ. 2.17 కోట్లు. 2021 మెర్సిడెస్ S-క్లాస్ రెండు వేరియంట్లలో తీసుకురాబడింది. అవి ఒకటి S 400d 4matic కాగా మరొకటి S 450 4matic. వీటి ధరలు వరుసగా రూ. 2.17 కోట్లు మరియు రూ. 2.19 కోట్లు (ఎక్స్-షోరూమ్).

2021 లో దేశీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లు.. వివరాలు

కొత్త 2021 మెర్సిడెస్ ఎస్-క్లాస్‌ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. కొత్త మెర్సిడెస్ S-క్లాస్ S450 (పెట్రోల్) మరియు S400 d (డీజిల్)లో ప్రవేశపెట్టబడింది. ఇది 3.0-లీటర్, సిక్స్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 367 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.

2021 లో దేశీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లు.. వివరాలు

2021 మెర్సిడెస్ మేబ్యాక్ జిఎల్ఎస్600 (2021 Mercedes Maybach GLS600):

మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో తన కొత్త మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీని విడుదల చేసింది. మెర్సిడెస్-మేబాచ్ లైనప్ నుండి వస్తున్న మొట్టమొదటి ఎస్‌యూవీ ఈ జిఎల్‌ఎస్ 600. ఈ కొత్త మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ధర దేశీయ మార్కెట్లో రూ. 2.43 కోట్లు. ఈ కొత్త ఆధునిక SUV లో లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

2021 లో దేశీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లు.. వివరాలు

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో 4.0-లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 21 బిహెచ్‌పి శక్తిని మరియు 249ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుది.

2021 లో దేశీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లు.. వివరాలు

ఈ కారులోని ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ నుండి వచ్చే పవర్ నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. మేబాక్ జిఎల్‌ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

2021 లో దేశీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లు.. వివరాలు

జాగ్వార్ ఎఫ్ పేస్ SVR (Jaguar F-Pace SVR):

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ (Jaguar) తన జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ (Jaguar F-Pace SVR) ధర రూ. 1.51 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఇండియా). ఇది కూడా అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

2021 లో దేశీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లు.. వివరాలు

Jaguar F-Pace SVR యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది బ్రాండ్ యొక్క 5.0-లీటర్ సూపర్ ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 543 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కొత్త జాగ్వార్ ఎఫ్-పేస్ SVR SUV మునుపటి మోడల్‌తో పోలిస్తే 20 ఎన్ఎమ్ టార్క్ అధికంగా ఉత్పత్తి చేయగలదు. ఈ SUV కేవలం 0.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగవంతం చేయగలదు. అంతే కాకుండా ఈ Jaguar F-Pace SVR యొక్క గరిష్ట వేగం గంటకు 286 కి.మీ.

2021 లో దేశీయ మార్కెట్లో విడుదలైన లగ్జరీ కార్లు.. వివరాలు

భారత మార్కెట్లో లగ్జరీ కార్లకు కూడా మంచి ఆదరణ ఉంది. ఈ కారణంగానే చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో విలాసవంతమైన లగ్జరీ కార్లను విడుదక చేస్తున్నాయి. ఈ సంవత్సరం మాత్రమే కాకుండా రానున్న కొత్త సమత్సరం 2022 లో కూడా మరిన్ని లగ్జరీ కార్లు విడుదలవుతాయి.

Most Read Articles

English summary
Luxury cars launched in 2021 aston martin dbx mercedes s class maybach gls 600 details
Story first published: Tuesday, December 21, 2021, 18:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X