షాకింగ్ రిజల్ట్స్.. క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బాలెనో!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'బాలెనో' (Baleno) క్రాష్ టెస్టులో సున్నా స్టార్ (జీరో స్టార్) రేటింగ్ ను పొందింది. మారుతి సుజుకి బాలెనో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. పైగా ఎంతో విశ్వసనీయమైన మారుతి సుజుకి బ్రాండ్ నుండి లభిస్తున్న ఈ కారు 0 స్టార్ రేటింగ్ పొందడం కస్టమర్లను షాక్‌కు గురి చేస్తోంది.

షాకింగ్ రిజల్ట్స్.. క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బాలెనో!

మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఈ సెగ్మెంట్‌లో టాటా అల్ట్రోజ్ మరియు హ్యుందాయ్ ఐ20 వంటి కార్లతో పడుతోంది. ప్రస్తుతం, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో దాదాపు ప్రతి నెలా అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా మారుతి సుజుకి బాలెనో అగ్రస్థానంలో ఉంది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్ల కారణంగా ఇది కస్టమర్లను ఆకర్షిస్తోంది.

షాకింగ్ రిజల్ట్స్.. క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బాలెనో!

అమ్మకాల పరంగా 'హీరో' గా ఉన్న మారుతి సుజుకి బాలెనో, ఇప్పుడు సేఫ్టీ విషయంలో మాత్రం పెద్ద 'జీరో' గా మారింది. ఇదొక 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తి. బాలెనో కారును గుజరాత్‌లోని సుజుకి ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే బాలెనో కారుని మారుతి సుజుకి వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంది.

ఈ నేపథ్యంలో 'మేడ్ ఇన్ ఇండియా' సుజుకి బాలెనో కారుకు లాటిన్ ఎన్‌సిఏపి (Latin NCAP) క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఈ క్రాష్ టెస్ట్ లో షాకింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షలో బాలెనో 0 (సున్నా) స్టార్ ప్రొటెక్షన్ రేటింగ్‌ను అందుకుంది. అంటే, అత్యవసర సమయాల్లో ఈ కారులో ప్రయాణీస్తున్న ప్రయాణీకుల భద్రతకు ఇది భరోసా ఇవ్వదని స్పష్టమైంది.

షాకింగ్ రిజల్ట్స్.. క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బాలెనో!

గడచిన ఆగస్ట్ నెలలో మారుతి సుజుకి యొక్క మరొక పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ (Swift) కోస నిర్వహించిన క్రాష్ టెస్టులో కూడా సదరు కారు సున్నా రేటింగ్ ను దక్కించుకుంది. ఆ తర్వాత ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్ పై తయారైన బాలెనో కూడా స్విఫ్ట్ మాదిరిగానే సున్నా సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది.

షాకింగ్ రిజల్ట్స్.. క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బాలెనో!

ఓవైపు భారతదేశంలో టాటా మోటార్స్ మరియు మహీంద్రా వంటి సంస్థలు అందిస్తున్న కార్లు, ఇలాంటి క్రాష్ టెస్టులలో స్థిరంగా 4 స్టార్ లేదా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంటుంటే, 'మేడ్ ఇన్ ఇండియా' సుజుకి బాలెనో మాత్రం 0 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కారులో కంపెనీ 2 ఎయిర్‌బ్యాగ్ లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఇదే వేరియంట్ ను క్రాష్ టెస్ట్ కోసం సేకరించారు.

షాకింగ్ రిజల్ట్స్.. క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బాలెనో!

సుజుకి బాలెనో పెద్దల రక్షణలో 20.03 శాతం, పిల్లల రక్షణలో 17.06 శాతం, పాదచారుల రక్షణలో 64.06 శాతం మరియు భద్రతా సహాయంలో 6.98 శాతం స్కోరును పొందింది. ఓవరాల్ గా లాటిన్ NCAP క్రాష్ టెస్టులో ఈ కారు 0-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ను పొందిందని ఒక ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.

షాకింగ్ రిజల్ట్స్.. క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బాలెనో!

ఇదివరకు చెప్పినట్లుగా, గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాస్ టెస్టులో 'మేడ్ ఇన్ ఇండియా' టాటా మరియు మహీంద్రా కార్లు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. ఇప్పటివరకు టాటా యొక్క మూడు కార్లు నెక్సాన్, అల్ట్రాస్ మరియు పంచ్ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ పరీక్షలలో పూర్తిగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి.

షాకింగ్ రిజల్ట్స్.. క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బాలెనో!

అదే సమయంలో, మహీంద్రా యొక్క ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా ఈ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇవి భారతదేశంలో తయారైన కార్లు కాబట్టి, ఇది భారతదేశానికి మరియు భారతీయులకు గర్వకారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

షాకింగ్ రిజల్ట్స్.. క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బాలెనో!

ఈ నేపధ్యంలో, భారతదేశంలో తయారైన బాలెనో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ను పొందడం ఇటు భారతీయ వినియోగదారులను అటు గ్లోబల్‌ గా సుజుకి బ్రాండ్ వినియోగదారులను సందేహంలో పడేస్తోంది. భారతదేశంలో బాలెనో కారుకు అత్యంత ముఖ్యమైన పోటీదారు అయిన టాటా అల్ట్రోజ్ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్‌ ను దక్కించుకున్న సంగతి తెలిసినదే.

షాకింగ్ రిజల్ట్స్.. క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బాలెనో!

టాటా కార్లు మంచి సురక్షితంగా ఉండటంతో, ఇటీవలి కాలంలో భారత్‌లో టాటా మోటార్స్ కార్ల విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. భద్రత విషయంలో వినియోగదారులలో పెరుగుతున్న అవగాహనే దీనికి ప్రధాన కారణం. కస్టమర్లు కారు కొనుగోలు చేసేటప్పుడు ధర, మైలేజ్, డిజైన్ వంటి అంశాలతో పాటుగా ఇప్పుడు భద్రత విషయంలో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

షాకింగ్ రిజల్ట్స్.. క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బాలెనో!

ప్రస్తుతం, భారతదేశంలో అత్యధికంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లను విక్రయిస్తున్న ఏకైక సంస్థ టాటా మోటార్స్. ఈ బ్రాండ్ నుండి ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన చిన్న ఎస్‌యూవీ టాటా పంచ్ కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ పరీక్షలో 5 స్టార్ రేటింగ్ దక్కించుకోవటం విశేషం. రాబోయే సంవత్సరాల్లో టాటా మోటార్స్ నుండి మరిన్ని సురక్షితమైన కార్లను మనం ఆశించవచ్చు. - ఆటోమొబైల్స్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Made in india maruti suzuki baleno scores zero stars in latin ncap crash test
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X