2021 అక్టోబర్‌లో Mahindra అమ్మకాలు; ఎలా ఉన్నాయో చూసారా..!!

భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) 2021 అక్టోబర్ నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ నివేదికల ప్రకారం, గత నెలలో మొత్తం 41,908 వాహనాలను విక్రయించినట్లు తెలిసింది. ఈ అమ్మకాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

More from DriveSpark

2021 అక్టోబర్‌లో Mahindra అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా..!!

మహీంద్రా యొక్క గత నెల మొత్తం అమ్మకాలలో ప్యాసింజర్ వెహికల్, కమర్షియల్ వెహికల్ మరియు విదేశీ మార్కెట్‌లకు ఎగుమతులు ఉన్నాయి. కంపెనీ యొక్క SUV విభాగంలో అమ్మకాల విషయానికి వస్తే, 2021 అక్టోబర్ నెలలో కంపెనీ మొత్తం 20,034 యూనిట్ల SUVలను విక్రయించింది. 2020 అక్టోబర్ నెల అమ్మకాలను పోలిస్తే 2021 అక్టోబర్ నెలలో SUV అమ్మకాలు 9 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తుంది. గత నెలలో కంపెనీ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 20,130 యూనిట్లకు పెరిగాయి.

2021 అక్టోబర్‌లో Mahindra అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా..!!

కంపెనీ యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, మహీంద్రా అండ్ మహీంద్రా గత అక్టోబర్‌లో గ్లోబల్ మార్కెట్‌లలో 3,174 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. మునుపటి ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోలిస్తే 57 శాతం పెరిగినట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.

2021 అక్టోబర్‌లో Mahindra అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా..!!

కంపెనీ యొక్క అమ్మకాల గురించి, మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా మాట్లాడుతూ, మా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో అంతటా వాహనాలకు డిమాండ్ బలంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల విడుదలైన కొత్త మహీంద్రా XUV700 కి అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు.

2021 అక్టోబర్‌లో Mahindra అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా..!!

ఇప్పటికే కంపెనీ Mahindra XUV700 యొక్క పెట్రోల్ వేరియంట్‌లను డెలివరీ చేయడం ప్రారంభించామన్నారు. అయితే ఎగుమతుల విషయంలో మాత్రం కంపెనీ 57 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. ప్రస్తుతం ఆటో మొబైల్ పరిశ్రమలు అన్నీ కూడా సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. అయితే దీనిని కూడా త్వరలో పరిష్కరించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నాము, అన్నారు.

2021 అక్టోబర్‌లో Mahindra అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా..!!

మహీంద్రా తన కొత్త మహీంద్రా XUV700 SUV యొక్క పెట్రోల్ వేరియంట్‌ల డెలివరీలను దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు గత వారంనుంచి ప్రారంభించింది. అయితే ఈ నెల చితిరి నాటికి కంపెనీ డీజిల్ వేరియంట్‌ల డెలివరీలను కూడా ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే కంపెని 2022 జనవరి 14 నాటికి 14,000 యూనిట్లను డెలివరీ చేయాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది.

2021 అక్టోబర్‌లో Mahindra అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా..!!

మహీంద్రా తన XUV700 యొక్క బుకింగ్లను అక్టోబర్ 7 నుండి ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజు కేవలం 57 నిమిషాల్లో మొదటి 25,000 యూనిట్లు బుక్ చేయబడ్డాయి. మరుసటి రోజు 2 గంటల సమయంలో మళ్ళీ 25,000 యూనిట్లు బుక్ చేయబడ్డాయి.

2021 అక్టోబర్‌లో Mahindra అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా..!!

కొత్త మహీంద్రా XUV700 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది, ఇందులో MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు ఉన్నాయి.

2021 అక్టోబర్‌లో Mahindra అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా..!!

కొత్త మహీంద్రా XUV700 SUV డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

2021 అక్టోబర్‌లో Mahindra అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా..!!

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

2021 అక్టోబర్‌లో Mahindra అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా..!!

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

Article Published On: Wednesday, November 3, 2021, 19:05 [IST]
English summary
Mahindra and mahindra sales october 41908 units details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+