భారత్‌లో అడుగు పెట్టిన కొత్త మహీంద్రా బొలెరో నియో; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన మహీంద్రా అండ్ మహింద్ర ఎట్టకేలకు భారత మార్కెట్లో కొత్త బొలెరో నియో విడుదల చేసింది. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 8.48 లక్షలు. మహీంద్రా యొక్క కొత్త బొలెరో నియో ప్రస్తుతం టియువి 300 పై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా ఇది చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త కారు బొలెరో యొక్క స్టాండర్డ్ మోడల్‌తో పాటు విక్రయించబడుతుంది.

భారత్‌లో అడుగు పెట్టిన కొత్త మహీంద్రా బొలెరో నియో; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీని నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచారు. కావున కంపెనీ డెలివెరీలను కూడా ఏ సమయంలో అయినా అంటే త్వరలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో అడుగు పెట్టిన కొత్త మహీంద్రా బొలెరో నియో; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

కొత్త మహీంద్రా బొలెరో నియో నాలుగు వేరియాయంట్లలో వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎన్ 4, ఎన్ 8, ఎన్ 10 మరియు ఎన్ 10(ఓ) వేరియంట్స్. వీటి ధరల విషయానికి వస్తే ఎన్ 4 ధర రూ. 8.48 లక్షలు, ఎన్ 8 ధర రూ. 9.48 లక్షలు మరియు ఎన్ 10 ధర రూ. 9.99 లక్షల వరకు ఉంటుంది. ఎన్ 10(ఓ) ధర కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

భారత్‌లో అడుగు పెట్టిన కొత్త మహీంద్రా బొలెరో నియో; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

ఈ కొత్త నియో 5 కలర్ ఆప్షన్స్ లో విక్రయించబడుతుంది.

 • సిల్వర్
 • నాపోలి బ్లాక్
 • హైవే రెడ్
 • రాకీ బీజ్
 • పెర్ల్ వైట్
 • భారత్‌లో అడుగు పెట్టిన కొత్త మహీంద్రా బొలెరో నియో; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

  భారత మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో నియో చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో పునఃరూపకల్పన చేసిన ఎల్‌ఇడి హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్లు, స్క్వేర్ ఫాగ్ లైట్లు మరియు ముదురు రంగు స్కిడ్ ప్లేట్‌లతో కొత్త బంపర్ ఉన్నాయి. అంతే కాకుండా ఇది గ్రిల్‌ను పొందుతుంది.

  భారత్‌లో అడుగు పెట్టిన కొత్త మహీంద్రా బొలెరో నియో; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

  బొలెరో నియో యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ బ్లాక్ స్ట్రిప్ ఇవ్వబడింది, దానితో పాటు కొత్త ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్ కూడా ఇవ్వబడింది. అయితే దీని యొక్క రియర్ ప్రొఫైల్ లో మాత్రమే ఎటువంటి మార్పు చేయలేదని తెలుస్తుంది. కానీ వెనుక భాగంలో రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి.

  భారత్‌లో అడుగు పెట్టిన కొత్త మహీంద్రా బొలెరో నియో; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

  బొలెరో నియోలో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ (మాన్యువల్), కీలెస్ ఎంట్రీ, పవర్ అడ్జస్టబుల్ ORVM లు, ఎసి వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. మొత్తానికి ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

  భారత్‌లో అడుగు పెట్టిన కొత్త మహీంద్రా బొలెరో నియో; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

  బొలెరో నియోలోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎబిడి విత్ ఇబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, క్రూయిజ్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, కావున ఇది వాహనదారునికి మంచి భద్రత కల్పిస్తుంది.

  భారత్‌లో అడుగు పెట్టిన కొత్త మహీంద్రా బొలెరో నియో; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

  కోట బొలెరో నియో కూడా దాని స్టాండర్డ్ బొలెరో అయిన 7 సీట్స్ ఎస్‌యూవీలాగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీకి రెండవ వరుసలో బెంచ్ లాంటి సీటు ఉంటుంది. ఇక మూడవ వరుసలో అయితే ఫేసింగ్ సీటు వంటివి ఉంటాయి.

  భారత్‌లో అడుగు పెట్టిన కొత్త మహీంద్రా బొలెరో నియో; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

  మహీంద్రా బొలెరో నియో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 3750 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి పవర్ మరియు 2250 ఆర్‌పిఎమ్ వద్ద 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త కార్ ఇంధనాన్ని ఆదా చేయడం కోసం స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఎకో డ్రైవ్ మోడ్ కూడా ఇవ్వబడింది. కావున ఇంధనాన్ని కూడా మీరు కొంతవరకు ఆదా చేయవచ్చు.

  భారత్‌లో అడుగు పెట్టిన కొత్త మహీంద్రా బొలెరో నియో; ధర, ఫీచర్స్ & పూర్తి వివరాలు

  మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కాంపాక్ట్ ఎస్‌యూవీల జాబితాలో మరో ఎస్‌యూవీ జోడించింది. భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త బొలెరో నియో, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra Bolero Neo Launched In India. Read in Telugu.
Story first published: Tuesday, July 13, 2021, 16:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X