Bolero Neo N10 (O) వేరియంట్ విడుదల చేసిన Mahindra: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన Mahindra భారత మార్కెట్లో కొత్త బొలెరో నియో విడుదల చేసిన విషయం తెలిసిందే. కంపెనీ ఈ కొత్త SUV ని N4, N8, N10 మరియు N10 (O) వేరియంట్లలో ప్రవేశపెట్టింది. అయిన కంపెనీ విడుదల సమయంలో టాప్ వేరియంట్ అయిన N10 (O) విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు కంపెనీ Mahindra Bolero Neo N10 (O) వేరియంట్ ని దేశీయ మార్కెట్ల విడుదల చేసింది.

Bolero Neo N10 (O) వేరియంట్ విడుదల చేసిన Mahindra: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Mahindra Bolero Neo N10 (O) మల్టీ-టెర్రైన్ టెక్నాలజీ (మాన్యువల్ లాక్ డిఫరెన్షియల్) ని కలిగి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ ధర రూ. 10.69 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ వేరియంట్ ప్రస్తుతం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రాకీ బీజ్, మెజెస్టిక్ సిల్వర్, హైవే రెడ్, పెర్ల్ వైట్ మరియు నాపోలీ బ్లాక్ కలర్స్. కావున కస్టమర్లు ఈ కలర్ ఆప్సన్స్ ఎంచుకోవచ్చు.

Bolero Neo N10 (O) వేరియంట్ విడుదల చేసిన Mahindra: పూర్తి వివరాలు

కొత్త Mahindra Bolero Neo N10 (O) వేరియంట్ లో మాన్యువల్ లాక్ డిఫరెన్షియల్ ఫీచర్ మాత్రమే కాకూండా, స్టాండర్డ్ Mahindra Bolero Neo N10 లోని అన్ని ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. Mahindra Bolero Neo N10 (O) వేరియంట్ యొక్క ఎక్స్‌టీరియర్ దాని స్టాండర్డ్ N10 వేరియంట్‌తో పోలిస్తే దాదాపు అన్నీ కూడా ఒకేవిధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Bolero Neo N10 (O) వేరియంట్ విడుదల చేసిన Mahindra: పూర్తి వివరాలు

కొత్త Mahindra Bolero Neo N10 (O) వేరియంట్ లోని ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఇందులో ప్రీమియం ఇటాలియన్ థీమ్ ఇవ్వబడింది. కావున అది చాలా విలాసవంతంగా కనిపిస్తుంది. అయితే సీట్లలో మాత్రం ప్రీమియం ఫాబ్రిక్ కవర్లు ఉపయోగించబడ్డాయి మరియు ముందు మరియు వెనుక వరుసలకు ఆర్మ్‌రెస్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Bolero Neo N10 (O) వేరియంట్ విడుదల చేసిన Mahindra: పూర్తి వివరాలు

Mahindra Bolero Neo N10 (O) డాష్‌బోర్డ్ 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీనితో పాటుగా సెంటర్ కన్సోల్ సిల్వర్ యాక్సెంట్‌లను పొందుతుంది. డ్రైవర్ అవసరానికి అనుకూలంగా సీటు యొక్క హైట్ అడ్జస్ట్ చేయవచ్చు. దీనితో పాటు, ముందు మరియు వెనుక పవర్ విండోస్, రిమోట్ లాక్ మరియు కీలెస్ ఎంట్రీ ఫీచర్ ఇవ్వబడింది.

Bolero Neo N10 (O) వేరియంట్ విడుదల చేసిన Mahindra: పూర్తి వివరాలు

కొత్త Mahindra Bolero Neo N10 (O) వేరియంట్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్ mHAWK100 డీజిల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి పవర్ మరియు 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 260 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

Bolero Neo N10 (O) వేరియంట్ విడుదల చేసిన Mahindra: పూర్తి వివరాలు

Mahindra Bolero Neo N10 (O) (మహీంద్రా బొలెరో నియో ఎన్10 (ఓ)) వేరియంట్ ఈఎస్ఎస్ మరియు ఎకో మోడ్‌ను పొందుతుంది, కవుల ఇది మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Mahindra Bolero Neo కంపెనీ యొక్క Mahindra TUV300 ఆధారంగా రూపొందించబడింది.

Bolero Neo N10 (O) వేరియంట్ విడుదల చేసిన Mahindra: పూర్తి వివరాలు

కొత్త Mahindra Bolero Neo అధునాత సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎబిడి విత్ ఇబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, క్రూయిజ్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహనదారునికి మంచి భద్రత కల్పిస్తుంది.

Bolero Neo N10 (O) వేరియంట్ విడుదల చేసిన Mahindra: పూర్తి వివరాలు

కోట బొలెరో నియో కూడా దాని స్టాండర్డ్ బొలెరో అయిన 7 సీట్స్ ఎస్‌యూవీలాగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీకి రెండవ వరుసలో బెంచ్ లాంటి సీటు ఉంటుంది. ఇక మూడవ వరుసలో అయితే ఫేసింగ్ సీటు వంటివి ఉంటాయి. బొలెరో నియో కొత్త బంపర్ మరియు గ్రిల్‌తో పాటు రీడిజైన్ చేసిన ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్‌ని పొందుతుంది.

Bolero Neo N10 (O) వేరియంట్ విడుదల చేసిన Mahindra: పూర్తి వివరాలు

కొత్త Mahindra Bolero Neo లోని N4, N8, N10 మరియు N10 (O) వేరియంట్స్ యొక్క ధరల విషయానికి వస్తే ఎన్ 4 ధర రూ. 8.48 లక్షలు, ఎన్ 8 ధర రూ. 9.48 లక్షలు మరియు ఎన్ 10 ధర రూ. 9.99 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 23, 2021, 9:43 [IST]
English summary
Mahindra bolero neo new n10 o variant launched at rs 10 69 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+