కొత్త 'మహీంద్రా బొలెరో నియో' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వీడియో.. చూసారా?
దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు భారత మార్కెట్లో కొత్త బొలెరో నియో విడుదల చేసింది. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 8.48 లక్షలు. మహీంద్రా యొక్క కొత్త బొలెరో నియో ప్రస్తుతం టియువి 300 పై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా ఇది చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ కలిగి ఉంటుంది.
ఇటీవల మేము కొత్త మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీఐ డ్రైవ్ చేసాము. ఈ కొత్త ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
కొత్త మహీంద్రా బొలెరో నియో నాలుగు వేరియంట్లలో వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎన్ 4, ఎన్ 8, ఎన్ 10 మరియు ఎన్ 10(ఓ) వేరియంట్స్. వీటి ధరల విషయానికి వస్తే ఎన్ 4 ధర రూ. 8.48 లక్షలు, ఎన్ 8 ధర రూ. 9.48 లక్షలు మరియు ఎన్ 10 ధర రూ. 9.99 లక్షల వరకు ఉంటుంది. ఈ కొత్త నియో 5 కలర్ ఆప్షన్స్ లో విక్రయించబడుతుంది. అవి సిల్వర్, నాపోలి బ్లాక్, హైవే రెడ్, రాకీ బీజ్ మరియు పెర్ల్ వైట్ కలర్స్.
మహీంద్రా బొలెరో నియో పునఃరూపకల్పన చేసిన ఎల్‌ఇడి హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్లు, స్క్వేర్ ఫాగ్ లైట్లు మరియు ముదురు రంగు స్కిడ్ ప్లేట్‌లతో కొత్త బంపర్ ఉన్నాయి. అంతే కాకుండా ఇది గ్రిల్‌ను పొందుతుంది.
బొలెరో నియోలోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎబిడి విత్ ఇబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, క్రూయిజ్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, కావున ఇది వాహనదారునికి మంచి భద్రత కల్పిస్తుంది.
మహీంద్రా బొలెరో నియో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 3750 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి పవర్ మరియు 2250 ఆర్‌పిఎమ్ వద్ద 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త కార్ ఇంధనాన్ని ఆదా చేయడం కోసం స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.



Click it and Unblock the Notifications








