Mahindra డిసెంబర్ 2021 ఆఫర్స్.. Alturas G4, Marazzo & KUV100 పై భారీ డిస్కౌంట్స్

దేశీయ కార్ల తయారీ సంస్థ అయిన మహీంద్రా (Mahindra) 2021 డిసెంబర్ నెలలో తన వాహనాలపైన అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ ఇప్పుడు బొలెరో, ఎక్స్‌యువి300, స్కార్పియో, కెయువి100, అల్టురాస్ జి4 వంటి వాటికీ వర్తిస్తాయి. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

Mahindra డిసెంబర్ 2021 ఆఫర్స్.. Alturas G4, Marazzo & KUV100 పై భారీ డిస్కౌంట్స్

మహీంద్రా అల్టురాస్ జి4 (Mahindra Alturas G4):

కంపెనీ యొక్క మహీంద్రా అల్టురాస్ జి4పై ఇప్పుడు ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ లభిస్తుంది. ఇప్పుడు ఈ కారుపైన కంపెనీ రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 11,500 కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ. 20,000 వరకు అడిషినల్ ఆఫర్స్ అందిస్తుంది. ఇది కంపెనీ యొక్క అతితక్కువ సంఖ్యలో అమ్ముడైన మోడల్, కావున కంపెనీ దీనిపై అత్యద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈకారణంగా దీనిని ఇప్పుడు ఎక్కువమంది కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని ఆసిస్తున్నాము.

Mahindra డిసెంబర్ 2021 ఆఫర్స్.. Alturas G4, Marazzo & KUV100 పై భారీ డిస్కౌంట్స్

మహీంద్రా ఎక్స్‌యువి300 (Mahindra XUV300):

మహీంద్రా కంపెనీ తన ఎక్స్‌యువి300 కాంపాక్ట్ SUV పైన రూ. 31,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్, రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అంటివి అందుబాటులో ఉన్నాయి. అంతే కాకూండా ఈ SUV కి దాదాపు రూ. 10,000 వరకు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Mahindra డిసెంబర్ 2021 ఆఫర్స్.. Alturas G4, Marazzo & KUV100 పై భారీ డిస్కౌంట్స్

మహీంద్రా బొలెరో (Mahindra Bolero):

మహీంద్రా బొలెరోపై కంపెనీ దాదాపుగా చాలా ఎక్కువ డిస్కౌంట్స్ అందిస్తుంది. ఇప్పుడు కంపెనీ దీనిపైన రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ అందిస్తుంది. కానీ కంపెనీ ఇటీవల విడుదల చేసిన కొత్త మహీంద్రా బొలెరో నియోపై ఎటువంటి ఆఫర్ అందుబాటులో లేదు. కస్టమర్లు దీనిని గమనించాలి.

Mahindra డిసెంబర్ 2021 ఆఫర్స్.. Alturas G4, Marazzo & KUV100 పై భారీ డిస్కౌంట్స్

మహీంద్రా యొక్క బొలెరో కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలు జరుపుతున్న మోడల్. ఇది దేశీయ మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో వినియోగంలో ఉంది. ఈ కారణంగా ఈ మోడల్ పైన చాలా తక్కువ డిస్కౌంట్ మాత్రమే అందిస్తుంది. అయితే త్వరలో మరిన్ని డిస్కౌంట్స్ అందించే అవకాశం ఉంటుంది.

Mahindra డిసెంబర్ 2021 ఆఫర్స్.. Alturas G4, Marazzo & KUV100 పై భారీ డిస్కౌంట్స్

మహీంద్రా మరాజో (Mahindra Marazzo):

కంపెనీ మహీంద్రా మరాజోలోని M2, M4 ప్లస్ మరియు M6 ప్లస్ యొక్క మూడు ట్రిమ్‌ల కొనుగోలుపై ఈ నెలలో రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతే కాకుండా ఇందులో రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,200 కార్పొరేట్ బెనిఫిత్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా దేశీయ మార్కెట్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలను జరిపలేకపోయింది. ఈ కారణంగా కంపెనీ ఎక్కువ డిస్కౌంట్స్ అందిస్తుంది.

Mahindra డిసెంబర్ 2021 ఆఫర్స్.. Alturas G4, Marazzo & KUV100 పై భారీ డిస్కౌంట్స్

మహీంద్రా కెయువి100 (Mahindra KUV100):

మహీంద్రా కెయువి100 పైన కంపెనీ ఇప్పుడు రూ. 38,055 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ. 3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఇది కూడా ఎక్కువ ఆదరణ పొందకపోవడం వల్ల దీనిపైన కూడా ఎక్కువ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

Mahindra డిసెంబర్ 2021 ఆఫర్స్.. Alturas G4, Marazzo & KUV100 పై భారీ డిస్కౌంట్స్

మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio):

మహీంద్రా యొక్క అత్యధిక ప్రజాదరణ పొందిన కార్లలో మహీంద్రా స్కార్పియో ఒకటి. దీనిపైన కంపెనీ రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తుంది. అంతే కాకూండా కంపెనీ తన కొత్త తరం మోడల్‌ను త్వరలో తీసుకురాబోతోంది, దీని కారణంగా సాధారణ మోడల్ పైన ఎక్కువ తగ్గింపులు లభిస్తున్నాయి.

Mahindra డిసెంబర్ 2021 ఆఫర్స్.. Alturas G4, Marazzo & KUV100 పై భారీ డిస్కౌంట్స్

మహీంద్రా కంపెనీ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్లను అందించడం వల్ల దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది. కావున డిసెంబర్ నెలలో మంచి అమ్మకాలను పొందుతుంది అని ఆశిస్తున్నాము. కంపెనీ యొక్క 2021 నవంబర్ నెల అమ్మకాలు కూడా కొంత పురోగతి స్థాయిలో పయనించింది.

Mahindra డిసెంబర్ 2021 ఆఫర్స్.. Alturas G4, Marazzo & KUV100 పై భారీ డిస్కౌంట్స్

మహీంద్రా కంపెనీ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే కంపెనీ సెమీ కండక్టర్ చిప్ కొరతను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా ఆశించిన స్థాయిలో అమ్మకాలను గాని ఉత్పత్తిని గాని సాధించలేకపోతోంది. అంతే కాకుండా సరఫరా కూడా చాలా ఆలస్యం అవుతోంది. చిప్ కొరత కారణంగానే ఇటీవల విడుదలైన మహీంద్రా XUV700 డెలివరీలు కూడా చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 15, 2021, 19:19 [IST]
English summary
Mahindra car discount december 2021 bolero xuv300 scorpio kuv100 alturas g4 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+